చర్చ:రాముడికి సీత ఏమవుతుంది
ఈ విమర్శనాత్మక వ్యాసాన్ని తొలగించడం మంచి నిర్ణయం కాదనిపిస్తుంది. ఆలోచించండి.Rajasekhar1961 06:22, 5 అక్టోబర్ 2009 (UTC)
- విమర్శనాత్మక వ్యాసం అయినా దీనిని ప్రారంభించిన సభ్యుని ఆలోచనలు వికీ విధానాలకు అనుగుణంగా లేవని నా అభిప్రాయం. ఇతడిని ఒకసారి సమర్ధిస్తే మరిన్ని పిచ్చి రాతలు రాసే అవకాశం ఉన్నది. ఈ విషయం బ్లాగులు రాసే కొద్ది మందికి తెలుసు. కనుక దయచేసి ఈ వ్యాసం వరకూ నన్ను సమర్ధిస్తారని ఆశిస్తాను. ధన్యవాదములు.విశ్వనాధ్.బి.కె. 06:57, 5 అక్టోబర్ 2009 (UTC)
- విశ్వనాధ్! మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను (1) ఇది ఒక పుస్తకం గురించి మొదలు పెట్టిన వ్యాసం. ఆ పుస్తకం కాస్తా కూస్తా ప్రసిద్ధి చెందిందే (2) సభ్యుని ఆలోచనలు గురించి మనకు అనవుసరం. ఇక్కడ వ్రాసింది నిరాధారమైతే దానిని తప్పక తొలగించవచ్చును. (3) సదరు సభ్యుని బ్లాగులను బట్టి వికీ వ్యాసం బేరీజు వేయడం తగదు. అయితే ఇదే వ్యాసాన్ని వేరే (నిరాధార విషయాలు, నిందాత్మక శైలి వంటివి) కారణాలమీద తొలగిస్తే అది వేరే సంగతి- నా మాటను వ్యక్తిగతంగా తీసుకోరనుకొంటున్నాను. --కాసుబాబు 18:55, 6 అక్టోబర్ 2009 (UTC)
మీరు చెప్పిన కొన్నిటితో నేనూ ఏకీభవిస్తాను. సభ్యుని ఆలోచనలు గురించి మనకు అనవుసరం అన్నదానితో కాదు. సదరు సభ్యుడు తెలివైనవాడు, హిందూమతాన్ని విమర్శించడమం లక్ష్యంగా పెట్టుకొన్నవాడు, హిందూయిజాన్ని కించపరచే వ్యాసాలు రాసేవాడు అయినపుడు అతని ఆలోచనలు కూడా పరిగణణలోనికి తీసుకోవడం అత్యవసరం. పైన అదే ఉదహరించాను తటస్థ వైఖరి కలిగిన రాజశేఖర్ లాంటి వారిని అలాంటి వ్యాసాలు రాయమని అడిగాను. నేనూ సహకరిస్తానని రాసాను. అతడు రాయడం మొదలెట్టినతరువాత వ్యాసాలపై చర్చలు, గొడవలు పడటం, నిషేదాలు లాంటివాటికంటే ముందుగానే కట్ చేయటం ఉత్తమనిపించి తొలగించాను. ఇతర సభ్యులకు కూడా ఈ వ్యాసం ఉండతగినదే అనిపిస్తే పునరుద్దరిచవలశిందిగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.విశ్వనాధ్.బి.కె. 04:57, 7 అక్టోబర్ 2009 (UTC)
- వ్యాసాన్ని పునరుద్దరించాను. వివాదాస్పదం అని అనుకుంటున్న వ్యాసాలను చర్చ జరుపకుండానే తొలగించవద్దని మనవి. వికీపీడియా:వివాద_పరిష్కారం#మొదటి చర్య: వివాదంలోని ఇతర పార్టీలతో మాట్లాడండిను ఒక సారి చూడండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 05:20, 7 అక్టోబర్ 2009 (UTC)
- వ్యాసానికి కొన్ని మార్పులు చేసాను పరిశీలించగలరు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 02:50, 8 అక్టోబర్ 2009 (UTC)
రాముడికి సీత ఏమవుతుంది గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. రాముడికి సీత ఏమవుతుంది పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.