చర్చ:విక్టరీ ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాచ్
తాజా వ్యాఖ్య: యాఛ్ టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
ఈ వ్యాసం ఒక స్వఛ్ఛంద సంస్థకు ప్రకటనలాగా ఉంది. ఈ సంస్థ గురించి మరెక్కడా (దినపత్రికలు, ప్రముఖ వెబ్సైట్ల) వచ్చి ఉండకపోతే దీన్ని తొలగించాలి. వికీపీడియాలో ఉండదగిన వ్యాసమని నిరూపించుకోవాలి. --వైజాసత్య 03:29, 27 జూన్ 2008 (UTC)
వైజా సత్య చెప్పిన విధంగానే ఆంగ్లవికీలో ఇదే వ్యాసాన్ని en:Wikipedia:Notability అనే ప్రమాణంపై తొలగించారు. అయితే తెలుగు వికీలో, ఆంధ్ర ప్రదేశ్ పరిధిలో చూస్తే, కొంత వెసులుబాటు తీసుకోవచ్చని అనుకొంటాను.
- ఆంధ్ర ప్రదేశ్ స్థాయిలో కొన్ని గ్రామాలలో పని చేస్తున్నందున ఈ సంస్థకు కొంత ప్రాముఖ్యత ఉంది.
- వారి వెబ్‌సైట్‌కు అనుగుణంగా, ప్రశంసా పూర్వకంగా ఉన్నమాట వాస్తవమే గాని పెద్దగా ప్రచార ధోరణి ఇప్పటికి వ్రాసినంతవరకు నాకు కనిపించలేదు. వేరే విషయాలు (విమర్శలు లాంటివి) వ్రాయడానికి ఎవరికైనా ఆస్కారం ఉంది.
- ఇతర రచనలు లేదా వెబ్‌సైటులలో ఇది రిఫర్ చేయబడలేదనేది వాస్తవం (http://pcserver.nic.in/ngo/Firstletter.asp?letter=V ఇక్కడ మాత్రం పేరు ఉంది).
- ప్రస్తుతానికి ఈ వ్యాసానికి ఈ చర్చ వల్ల కొంత హెచ్చరిక వస్తుంది. తొలగించాల్సినంత అవుసరం లేదనుకొంటున్నాను.
యాఛ్
మార్చుyacht ని సాధారణంగా యాట్ట్ లేదా యాట్ అని పలుకుతారు (అమెరికాలో). భారతదేశంలో యాఛ్ అంటారా? --వైజాసత్య 20:31, 28 జూన్ 2008 (UTC)
- నాకెప్పుడూ అయోమయంగా ఉండే ఉచ్ఛారణలలో ఇది ఒకటి. ఇప్పుడు తెలిసింది! ఈ సమస్య తెలుగు వారికి చాలా మందికి ఉందనుకొంటాను. "యాట్"కు మారుద్దాము --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:03, 29 జూన్ 2008 (UTC)