చర్చ:వీలునామా
తాజా వ్యాఖ్య: బ్లాగు లింకులు చేర్చుట టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Chavakiran
బ్లాగు లింకులు చేర్చుట
మార్చువికీపీడియా:బయటి_లింకులు#ఇవ్వకూడని లింకులు (శాశ్వతలింకు) లో 9 ప్రకారం, సుప్రసిద్దుడైన వ్యక్తి బ్లాగు లింకులు చేర్చడానికి విధానం ప్రకారం అనుమతి వుంది. నేను చేర్చిన బ్లాగు లింకు ప్రముఖ పుస్తక రచయిత మరియు న్యాయమూర్తి దైనందున చంద్రకాంతరావు వీటిని తొలగించటం సరికాదు. నాకు తెలియని విధానం ఏదైనా వుంటే మూడురోజులలో తెలియచేయండి.--అర్జున (చర్చ) 04:33, 31 డిసెంబర్ 2012 (UTC)
- ప్రసిద్ధులైన వారి బ్లాగు లింకులు చేర్చడానికి అభ్యంతరం ఏమీ లేదు కాని సదరు వ్యక్తి ప్రసిద్ధుడేనన్నట్లు ఆధారమేమీ లేదు. ఉన్న ఆధారానికి బ్లాగుకు లింకులేదు. బ్లాగులింకుల గురించి ఇదివరకే చాలా సార్లు చర్చలు జరిగాయి. ఇలా అవకాశమిస్తే ఎవరో ఎల్లయ్య తాను ప్రసిద్ధుడైన వ్యక్తినని బ్లాగులో రాసుకుంటూంటే కేవలం ఒక్క బ్లాగు ఆధారంగా మాత్రమే తెవికీలో లింకులివ్వడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఈ వ్యక్తి ప్రసిద్ధుడే కావచ్చు కాని రేపు ఇంతకంటే పై హోదాలో ఉన్నట్లు ఒక అనామకుడు వ్రాసుకొని ఎక్కడినుంచో సమాచారం కాపీచేసుకొని బ్లాగు సృష్టిస్టే దానిసంగతేంటీ? అసలు బ్లాగులే ప్రామాణికం కావు, చిటికెలో ఎవరైనా బ్లాగులు ప్రారంభించవచ్చు, ఏమైనా వ్రాసుకోవచ్చు, అలాంటప్పుడు మనం వాటికి దూరంగా ఉండటమే మేలు. ఇదివరకే మనకు తెలిసిన ప్రముఖలకు సంబంధించిన బ్లాగులకు, ఆధారం లేకుండా ప్రముఖులు అనదగ్గ బ్లాగులకు చాలా తేడా ఉంటుంది. అంతేకాకుండా ఒక్క వాక్యం వ్యాసానికి నాలుగు బయటిలింకులు, అదీ ఒకే బ్లాగు నుంచి పెట్టడం ఎంతవరకు శ్రేయస్కరం? బయటిలింకులు నియమాలలో మొదటి విభాగంలో ఉన్న రెండుపాయింట్లు వివరించేది దీన్నే. ఇవ్వకూడని లింకుల విభాగం 9వ పాయింటులో ప్రముఖుల బ్లాగుకు మినహాయింపు ఉంది, కాదనను కాని, ఇదివరకే చెప్పినట్లు ఆధారం మాత్రం లేదు. ఇలా ఆధారం లేని వాటికి కూడా మనం లింకులిస్తే తెవికీ మొత్తం బ్లాగులింకులమయం అయిపోయే సమయం వస్తుందేమో! తెవికీ ముఖ్యోద్దేశ్యం బయటిలింకులివ్వడం కాదు, ముందు వ్యాసాన్ని వీలయినంతవరకు పొడిగించి, పాఠకులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలి. అప్పుడు మరింత సమాచారం కోసం బయటిలింకులిస్తే ఫరవాలేదేమో! కాని అతిచిన్న వ్యాసానికి వ్యాసంలోని వాక్యాలకంటే నాలుగురెట్ల బయటిలింకులిచ్చి మా సమాచారం ఇంతే ఇక మీరు బయటకు వెళ్ళి చూసుకోండి అన్నట్లుగా వారిని బలవంతంగా తెవికీ నుంచి బయటకు పంపడం హర్షణీయం కాకపోవడమే కాదు, మనం నవ్వులపాలవుతాం కూడా. ఇదివరకు వ్యాసాలలో బొమ్మలు అధికమయ్యాయని కొందరు సభ్యులు అభ్యంతరం చెప్పారు. వ్యాసం నిడివిని బట్టి బొమ్మలు ఉండవచ్చని మరికొందరు సర్దిచెప్పారు. అంటే వ్యాస సమాచారం అధికంగా లేనప్పుడు బొమ్మలకే అభ్యంతరం ఉన్నప్పుడు బయటిలింకులు చేర్చే అవసరం దేనికి? ఈ వ్యాసం గురించి సమాచారం కావాలంటే బోలెడు సమాచారం లభ్యమౌతోంది. ఆ పనిచేయక కేవలం బయటిలింకుల అవసరం దేనికి? సమాచారం లభించనప్పుడు ఏకవాక్య వ్యాసాలుండటం వేరు, సమాచారం లభిస్తున్ననూ సమాచారం చేర్చకుండా కేవలం బయటిలింకులు చేర్చడం వేరు. వ్యాసంలో చేర్చాల్సిన మామూలు సమాచారం లాయర్లకే కాదు సాధారణ వ్యక్తులకు కూడా తెలుసు. వ్యాససమాచారం పెరిగి, సదరు వ్యక్తి ప్రముఖుడే నన్నట్లు ఆధారం ఉంటే ఒకటి, రెండు బయటిలింకులుండటం ఎవరికీ అభ్యంతరం ఉండదు. చివరగా మరోమాట నియమాలను చూసేటప్పుడు కేవలం ఒక్కో నిమయాన్ని విడివిడిగా చూడకుండా అన్ని నియమాలను స్థూలంగా గ్రహించి అర్థం చేసుకోవడం మంచిది. దీనికి మంచి ఉదాహరణ నేను తెవికీలో ఇదివరకు ఎప్పుడో చెప్పినట్లు రాజ్యంగం ప్రకారం స్వేచ్ఛ ఉందని మనం మన ఇష్టమున్నట్లు వ్యవహరించలేము కదా, స్వేచ్ఛపై ఎన్నో నిర్భంధాలు అదే రాజ్యంగంలో ఇతర ప్రకరణాలలో ఉన్న సంగతిని కూడా మనం గ్రహించాలి. నేను బ్లాగులింకులు తొలిగించేటప్పుడు కేవలం బ్లాగు అని ఒక్క కారణంతో మాత్రమే తొలిగించలేను, కర్ణుడి చావుకున్న కారణాలెన్నో దీనికీ అన్ని కారణాలున్నాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:54, 31 డిసెంబర్ 2012 (UTC)
- మీ వివరణకు ధన్యవాదాలు. తెలుగు వికీ అభివృద్ధి మందకొడిగా వున్నసంగతి మనందరికి తెలుసు. అయితే వికీ ముఖ్యోద్దేశం దీని చదువరులకు విజ్ఞానాన్ని సత్వరంగా అందచేయటం అన్నది దృష్టిలో వుంచుకొని, పుస్తక రచయిత మరియు బ్లాగు లో వ్యక్తి వివరాలు మరియు పాఠ్యవిషయంతో సరిపోవడంతో నేను లింకులు చేర్చాను. ముందు ముందు వాటిని ఆధారంగా చేసుకొని విస్తరించాలనే సదుద్దేశంవున్నది. నా పని వట్టి లింకులిచ్చేవుద్దేశం లేదని మీకు తెలిసేవుంటుంది. ఎక్కువ లింకులిచ్చాను అని అనుకుంటే వాటిని ఒక దానికి తగ్గించవచ్చు దానికి నాకు అభ్యంతరంలేదు. ఈ వివరాలు గురించి వెతకటానికి నాకు చాలా సమయం పట్టింది. అలా ఇంకా మరిందరికి సమయం వృధాకాకూడదు అనే వుద్దేశం నాది.
- వ్యక్తికి సంబంధించిన రెండు మూలాలు ఒకరికి సంబంధించిన వనే అధారం కావాలంటే ఆ వ్యక్తినుండి ఈమెయిల్ సరిపోతుందా? ఈమెయిల్ మాత్రం సరిగా వుందని ఎలా అనుకోవచ్చు. అది తెచ్చుకోవటంలోకూడా ఇబ్బందులుంటాయి కొంత మంది గోప్యత దృష్ట్యా వారి ఈమెయిళ్లు తెలపకపోవచ్చు. లేక స్పందించకపోవచ్చు. దీనిలోని కష్టాసాధ్యాలు దృష్ట్యా ఒక అనుభవజ్ఞుడైన తెవికీ సంపాదకుడు ఒక వ్యక్తి ప్రముఖుడని ప్రజాపరిధిలో వున్న వివరాలను చూసి నిశ్చయించి ఒక లింకు చేర్చితే ఇతర అనుభవ జ్ఞులైన తోటి సంపాదకులు వాటిని తొలగించకుండా వుండే పద్ధతి బాగుంటుంది. అలా కనీసం కొంతైనా తెవికీ అభివృద్ధికి కృషి జరుగుతుంది. ఈ విషయమై స్పందిస్తే అవసరమనుకుంటే నేను ప్రై ప్రతిపాదన రచ్చబండలో ఇతర సంపాదకుల స్పందనకోసం చేరుస్తాను. దానిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు--అర్జున (చర్చ) 23:47, 2 జనవరి 2013 (UTC)
- నిర్వహణలో భాగంగా అతిచిన్న వ్యాసానికి 4 బయటిలింకులు ఉండటం గమనించి వాటిని తొలిగించడాన్ని మీరు తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. నేను ప్రత్యేకంగా ఎవరినో దృష్టిలో ఉంచుకొని ఈ పని చేయలేను. నేను తొలిగించిన పిదప మీ అభిప్రాయాలు చర్చా పేజీలో మామూలుగా వ్రాస్తే సరిపోయేది. నిబంధనల గురించి, ప్రత్యేకంగా నా పేరు ప్రస్తావించి, "ఇది సరికాదు" అని వ్రాయడంతో నేను వివరంగా వ్రాయాల్సి వచ్చింది. నిబంధనల గురించి నాకు తెలియక కాదు, తెలిసే చేశాను. ఇదివరకు కూడా ఇదే విషయంపై చర్చ కూడా జరిగింది. ప్రత్యేకంగా ఎవరినో దృష్టిలో ఉంచుకొని చేయాలంటే ఇంకనూ చాలా ఉన్నాయి కాని నేను ఆ పనిచేయట్లేదు. ఉదా:కు మొదటిపేజీలో మీకు తెలుసా? శీర్షికలో ఆశ్చర్యకరమైన వాక్యాలకు బదులు సెలవు దినాలకు సంబంధించిన రెండు కేలండర్ వ్యాస లింకులున్నాయి. అసలు అలాంటివి తొలిగించి కొత్త వ్యాసాలలోని ఆశ్చర్యకర లేదా ముఖ్యమైన వాక్యాలు పెట్టవచ్చు. తెలియజేస్తే లేదా తొలిగిస్తే ఇబ్బందిగా గురౌతారని ఆ విషయాలకే వెళ్ళట్లేదు. మనిషి అన్నాక పొరపాట్లు జరుగుతుంటాయి. ఇతరులు తెలియజేసినప్పుడే మనం వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతమాత్రానికే తెవికీలో నిర్వాహకులు చేసే పొరపాటును ఇతర నిర్వాహకులు తొలిగించరాదు అని అనడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇక్కడ అందరూ సమానులే కాబట్టి కొత్తవారైననూ, పాతవారైననూ, నిర్వాహకులైననూ, సభ్యులైననూ అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. నిర్వాహకుల పొరపాటును వదిలి ఇతర సభ్యుల పొరపాట్లను మాత్రమే సరిదిద్దితే అది నిర్వహణ అనిపించుకోదు. అంతేకాకుండా నిర్వాహకుల పొరపాట్లను తెలియజేయనప్పుడే తెవికీ అభివృద్ధి చెందుతుందనడానికి కూడా నేను వ్యతిరేకిస్తాను. ఇంకనూ దీనికి సంబంధించి నా అభిప్రాయాలు రచ్చబండలో ప్రతిపాదన వచ్చిన పిదప వెల్లడిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:13, 3 జనవరి 2013 (UTC)
- పొరపాట్లు తెలియచేయకూడదనటం నా వుద్దేశ్యం కాదు. సద్విమర్శ నేను ఎప్పుడైనా గౌరవిస్తాను. ఇక మీరు ప్రస్తావించిన 'మీకు తెలుసా' విషయం ఈ చర్చకు అప్రస్తుతం. ఎవరైనా విషయాలను మెరుగు చేయవచ్చు. బ్లాగు లింకుల గురించి ఈ వివాదాన్ని రచ్చబండలో మరింత మంది స్పందనకోసం చేరుస్తాను.--అర్జున (చర్చ) 00:47, 4 జనవరి 2013 (UTC)
- నిర్వాహకులు ఘర్షణ పడటం సరికాదు. సభ్యుడైనా, నిర్వాహకుడైనా తెవికీ అభివృద్ధికి కృషి చేయాలి. కాని వ్యక్తిగత విమర్శలు తగదు. ఎవరైనా తెవికీ నియమావళికి అనుగుణంగా వెళితే బాగుంటుంది.మీరు వ్యాస ప్రాధాన్యత కంటె మీ విమర్శలకే అధిక సమయం వెచ్చించారనే విషయం మరిచిపోకండి. ఇంత రాద్దాంతం అవసమా! సభ్యులైనా, నిర్వాహకులైనా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ పోవాలి. కాని సంకుచిత మనస్తత్వంతో తెవికీ మీ ఒక్కరి స్వంత బ్లాగు అయినట్లు ప్రవర్తించకండి. ఏవైనా అభిప్రాయ భేదాలుంటే వ్యక్తిగతంగా ఈ మెయిల్స్ పంపుకోండి. అందరికి తెలికీ నిర్వాహకుల అనైక్యతను చాటడం మంచి పద్ధతి కాదు. ఏవైనా వివాదాలుంటే రచ్చబండలో ప్రతిపాదనలు చేయండి. తెవికీ నిబంధనలకు వ్యతిరేకమైన ప్రతిపాదనలు రచ్చబండలో ఉంచకండి. దయ ఉంచి. వ్యాసాల అభివృద్ధికి కృషి చేయండి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. ఎంతో గౌరవ హోదాలో ఉన్న చంద్రకాంతరావు, అర్జున గారు వివాదాల జోలికి పోవడం సాధారణ సభ్యులకు మనస్తాపం కలిగిస్తుంది. ఈ వివాదం ఇంతటితో ఆపి తెవికీ సభ్యుల, నిర్వాహకుల ఐక్యతను చాటండి. మీ సద్విమర్శతో మీరిద్దరూ స్పందనను తెలియజేసి సభ్యుల మనోభావాలకు ఆనందం కలిగించండి.(Rojarani (చర్చ) 01:19, 4 జనవరి 2013 (UTC))
- పొరపాట్లు తెలియచేయకూడదనటం నా వుద్దేశ్యం కాదు. సద్విమర్శ నేను ఎప్పుడైనా గౌరవిస్తాను. ఇక మీరు ప్రస్తావించిన 'మీకు తెలుసా' విషయం ఈ చర్చకు అప్రస్తుతం. ఎవరైనా విషయాలను మెరుగు చేయవచ్చు. బ్లాగు లింకుల గురించి ఈ వివాదాన్ని రచ్చబండలో మరింత మంది స్పందనకోసం చేరుస్తాను.--అర్జున (చర్చ) 00:47, 4 జనవరి 2013 (UTC)
- నిర్వాహకులకేమీ కొమ్ములు ఉండవు కదా :-) వారూ మామూలు సభ్యులే, కాకుంటే అనుభవజ్ఞులు. చర్చలు జరగాల్సిందే, నిర్వాహకుల మధ్య అయినా మరో గుంపు మధ్య అయినా. Chavakiran (చర్చ) 01:35, 4 జనవరి 2013 (UTC)
- చర్చలు జరగాలి గాని అవి వ్యక్తిగత కక్షలుగా మారకూడదు. ఇక్కడ అదే జరుగుతున్నది. మీరిరువురూ మాత్రమే కొన్ని విషయాలలో ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. అవి చాలా వరకూ అనవసరమైన గమ్యాన్ని ఆధారం చేసుకొని ప్రయాణిస్తున్నాయి. మీ చర్చలలో మిగిలిన వారు పాల్గొనలేకపోవుటకు కారణం అదే. దయచేసి ఇక దీనిని గురించి ఆపేయండి ఆ వ్యాసాన్ని కొద్దికాలం విడిచి వేరే వ్యాసాలపై దృష్టి పెట్టండి.విశ్వనాధ్ (చర్చ) 07:34, 4 జనవరి 2013 (UTC)
- చావా కిరణ్ గారి స్పందనకు ధన్యవాదాలు. విశ్వనాధ్ గారు, రోజారాణిగారు దీనిని వ్యక్తిగతంగా చూడడం దురదృష్టకరం. పాఠ్యానికి సంబందించిన వివాదమైతే కొంతకాలం పట్టించుకోకపోతే సమసిపోతుందేమోగాని నియమాలకు సంబంధించిన వివాదం అలా సమసిపోదని నా అనుభవం. దయచేసి మీ అభిప్రాయాలు దీనికి సంబందించిన రచ్చబండచర్చలో తెలియచేయండి. --అర్జున (చర్చ) 00:11, 6 జనవరి 2013 (UTC)
- నా అభిప్రాయం అయితే, ఇంగ్లీషు వాళ్ళు తీసుకున్నట్టు బ్లాగులను తెలుగు వాళ్ళం తీసుకోలేం. తెలుగు వరకు బ్లాగను ఏ యితర జాలపుటల్లాగానే పరిగణించి చూడాలి. ఏదన్నా లింకు సరిఅయినది కాదు అని అనిపిస్తే, ఆ వ్యాసం చర్చాపుటలో చర్చించి నిర్ణంయం తీసుకోవాలి. గంపగుత్తుగా బ్లాగులనుండి లింకులు ఉండకూడదు, బ్లాగులు ఆధారపడదగినవి కాదు, అనే ప్రిజుడిసుకు నేను వ్యతిరేకం. Chavakiran (చర్చ) 13:23, 6 జనవరి 2013 (UTC)