చల్లా భగీరథరెడ్డి

చల్లా భగీరథరెడ్డి (1976 - 2022 నవంబరు 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు.

చల్లా భగీరథరెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 ఫిబ్రవరి 2021 - 29 మార్చి 2023
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1976
ఉప్పలపాడు, అవుకు మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2022 నవంబరు 2
హైదరాబాదు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీదేవి
జీవిత భాగస్వామి శ్రీలక్ష్మి

జననం, విద్యాభాస్యం మార్చు

చల్లా భగీరథరెడ్డి 1976లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, అవుకు మండలం, ఉప్పలపాడు గ్రామంలో చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీదేవి దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

చల్లా భగీరథరెడ్డి తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2003 నుంచి 2009 వరకు కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశాడు. భగీరథరెడ్డి 2007 నుంచి 2008 వరకు జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్‌ సెక్రటరీగా, 2009 నుంచి 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా పని చేశాడు. ఆయన తన తండ్రితో పాటు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో 8 మార్చి 2019న వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[1]

ఆయన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి భగీరథరెడ్డిని 25 ఫిబ్రవరి 2021న వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశాడు.[2][3]ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్లు 8 మార్చి 2021న ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపాడు.[4]ఆయన శాసనసభ్యుడిగా 1 ఏప్రిల్ 2021న ప్రమాణ స్వీకారం చేశాడు.[5][6]

మరణం మార్చు

46 ఏళ్ల చల్లా భగీరథ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2022 నవంబరు 2న తుదిశ్వాస విడిచాడు. ఆయనకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[7]

మూలాలు మార్చు

  1. TV9 Telugu (8 March 2019). "వైసీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి -". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. TV9 Telugu (25 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే! - Political history of YCP MLC candidates". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (26 February 2021). "ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో వైఎస్సార్‌సీపీ ప్రత్యేకత". Sakshi. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  4. Outlook India (8 March 2021). "Six ruling YSR Congress candidates elected unopposed to AP Legislative Council". outlookindia.com/. Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  5. The Times of India (1 April 2021). "Six newly elected Andhra Pradesh MLCs take oath | Amaravati News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  6. Prajashakti (1 April 2021). "ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 2 April 2021. Retrieved 18 July 2021.
  7. "MLC Bhageeratha Reddy: వైకాపా ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత". web.archive.org. 2022-11-02. Archived from the original on 2022-11-02. Retrieved 2022-11-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)