చల్లా రాధాకృష్ణమూర్తి
చల్లా రాధాకృష్ణమూర్తి సాహితీకారుడు, వ్యాసరచయిత, అనువాదకుడు, వ్యాఖ్యాత, విమర్శకుడు.[1] ఈయన ఆర్.ఎం.చల్లాగా అందరికీ సుపరిచితుడు. ఈయనకు తత్వశాస్త్రం, కవిత్వం, సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది.
జీవిత విశేషాలు
మార్చుఆర్.ఎం.చల్లా పశ్చిమ గోదావరి జిల్లా భీమలాపురంలో జూన్ 28 1926 న జన్మించారు. ఆయన తండ్రి సుబ్బారాయుడు వైదిక విద్యా ఉపకారవేతనాల పోషకుడు. బాల్యంలో ఆయన ఆయన తండ్రి వద్ద వేదాలు, వేదాంగాలను అభ్యసించారు.తండ్రికి తగ్గ కుమారునిగా పేరు పొందాడు.ఆయన కళాశాల విద్యను మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో చదివారు. తారువాత తత్వ శాస్త్రాన్ని మద్రాసు లోని క్రిస్టియన్ కళాశాలలో చేసారు. స్విడ్జర్లాండ్ లోని ప్రబర్గ్ విశ్వవిద్యాలయంలో ఫ్రెంచ్, జర్మన్ భాఅషల గూర్చి లోతైన అధ్యయనం చేసారు. పారిస్ లో సోర్‌బోన్ లో పశ్చిమ తత్వశాస్త్రము, కళలు, కళా విమర్శలపై అధ్యయనం చేసారు. పశ్చిమ ప్రాంతంలో పొర, శాస్త్రీయ ప్రగతిపై ఆకర్షణ ఉన్నప్పటికీ, ఆయన తన జీవితాన్ని సౌకర్యవంతంగా ఉండేందుకు విదేశాలలో స్థిరపడలేదు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రిలో నిర్మలమైన, పాండిత్య జీవితాన్ని గడపడానికి యిష్టపడ్డారు.[2]
చల్లా విదేశీ భాషలైన జర్మన్, ఆంగ్లం, పర్షియన్, పోలిష్ లో చక్కని జ్ఞానాన్ని కలిగినవారు. ఆయన ఋగ్వేదాన్ని ఫ్రెంచ్ అంరియు జర్మన్ భాషలలోకి అనువదించారు.
అనువాదకునిగా
మార్చుఆయన భగవద్గీత గ్రంధాన్ని తెలుగులోని అనువదించారు. ఆయన జీవిత చరిత్ర వ్రాసిన టి.శివరామకృష్ణ మాటల్లో, ఆ గ్రంథం లోకమాన్య తిలక్ వ్రాసిన "గీతా రహస్య" (మరాఠీ) తో పోల్చదగిన రచన. ప్రసిద్ధ వైదిక పండితుడు ఉప్పులూరి అంపతిశాస్త్రి వ్రాసిన "ఆంజనేయ రమాయణం" అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. అద్వైతంలో విశేష వ్యక్తిగా ఆయన అద్వైతం, ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, జీన్ పాల్ సార్థే వ్రాసిన ఆస్తిక వాదం ల తులనాత్మక అధ్యయనంతో ఒక గ్రంథాన్ని రచించారు.
చల్లా ఆస్ట్రేలియా కవులు వ్రాసిన కొన్ని రచనలను అనువాదం చేసారు. ఫ్రెంచ్ కవులు వ్రాసిన రచనలను ఆంగ్లంలోకి అనువదించారు. తిలక్ వ్రాసిన "అమృతం కురిసిన రాత్రి" తెలుగులోకి అనువాదం చేసారు. "లలితా సహస్ర స్తోత్రాన్ని" అనువదించారు. కాళిదాసు వ్రాసిన "మేఘదూతం"ను అనువదించారు.ప్రసిద్ధ రచయిత శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వ్రాసిన కొన్ని కవితలను "లిల్లీస్ ఇన్ ద లేక్(1950) అనే పేరుతో అనువదించారు.
కవిగా
మార్చుఆయన కావ్య రచనలు తత్వశాస్త్రం, ఆలోచన, మేథస్సు యొక్క స్థాయిని తెలియజేస్తాయి.ఆయన తెలుగు, ఆంగ్ల భాషల్లో అనేక రచనలు చేసారు. ఆయన ప్రసిద్ధ రచనలలో ఆంగ్లంలో "థార్న్స్ ఆఫ్ ప్లవర్స్(1948) , పోయమ్స్ ఇన్ ఐరోపా(1949),రెడ్ డాంస్ ఆఫ్ న్యూ లైఫ్ అండ్ న్యూ లవ్(1953), పాషన్ అండ్ ఫిలాసఫీ(1954), బడ్స్ ఆఫ్ రెడ్ బ్లడ్(1961), లోటస్ ఆఫ్ మై హర్ట్(1961), బ్యూటీ అండ్ ద పోయత్(1967), జాన్ ఎఫ్.కెన్నెడీ జ్ఞాపకార్థం వ్రాసిన "ద ఎటర్నల్ ప్లెమ్". ఆయన తెలుగులో చిరస్మరణీయమైన పద్యాలు కోకిల, ప్రణయ సందేశం, ఊహా నివాసి, అంబరం లను వ్రాసారు.[2]
మరణం
మార్చుఆయన ఏప్రిల్ 29 2014 న మరణించారు.[2]
మూలాలు
మార్చు- ↑ "ప్రముఖ సాహితీ కారుడు చల్లా రాధాకృష్ణమూర్తి కన్నుమూత". Archived from the original on 2015-06-04. Retrieved 2015-07-26.
- ↑ 2.0 2.1 2.2 "In memory of vedic scholar R M Challa". S M Kompella. హన్స్ ఇండియా. Retrieved 31 May 2014.