ప్రధాన మెనూను తెరువు

చామరాజనగర్ (కన్నడం:ಚಾಮರಾಜನಗರ) కర్నాటకా రాష్ట్రంలో దక్షిణభాగంలో ఉంది. కర్ణాటకారాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న మైసూరు జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి 1998లో చామరాజనగర్ జిల్లాగా ఏర్పాటుచేసారు. జిల్లాకు ప్రధాననగరంగా చామరాజనగర్ ఉంది.[1] కర్నాటకారాష్ట్రంలోని 30 జిల్లాలలో చామరాజనగర్ జిల్లా జనసాంద్రతలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో కొడుగు మరియు బెంగుళూరు గ్రామీణ జిల్లా జిల్లాలు ఉన్నాయి. .[2]

Chamarajanagar district

ಚಾಮರಾಜನಗರ ಜಿಲ್ಲೆ
district
Chamrajnagar3.jpg
Karnataka Chamarajanagar locator map.svg
CountryIndia
StateKarnataka
HeadquartersChamarajanagar
TalukasYelandur, Gundlupet, Chamarajanagar, Kollegal, Hanur
విస్తీర్ణం
 • మొత్తం5,101 కి.మీ2 (1,970 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం9,65,462
 • సాంద్రత189/కి.మీ2 (490/చ. మై.)
Languages
 • OfficialKannada
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
571 313
Telephone code08226
వాహనాల నమోదు కోడ్KA-10

చరిత్రసవరించు

చామరాజనగర్ ఒకప్పుడు అరికోత్తర అని పిఉవబడుతుండేది. మైసూరును పాలించిన రాజైన చామరాజ ఉడయార్ ఇక్కడ జన్మించిన తరువాత ఈ ప్రదేశానికి చామరాజనగర్ అని నామకరణం చేయబడింది. ఇక్కడ హొయశిల రాజైన గంగరాజా వద్ద రాజప్రతినిధి పునిసదండనాయక క్రీ.శ 1117 లో " ది విజయ అర్స్వనాథ్ బసాడి " అనే జైన ఆలయం నిర్మించాడు. .

భౌగోళికంసవరించు

కర్నాటక రాష్ట్రం దక్షిణభాగంలో ఉన్న చామరాజనగర్ జిల్లా సరిహద్దులలో తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లాకు వాయవ్యసరిహద్దులో మైసూరు జిల్లా, ఉత్తరసరిహద్దులో మండ్య, ఈశాన్యసరిహద్దులో బెంగుళూరు జిల్లాలు ఉన్నాయి. తూర్పుసరిహద్దులో తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా, సేలం జిల్లా మరియు ఈరోడ్ జిల్లా మరియు నీలిగిరి జిల్లాలు ఉన్నాయి. ఆగ్నేయంలో వేల్యాండు జిల్లాలు ఉన్నాయి.

కర్నాటక రాష్ట్రంలోని జాతీయరహదారి 209 బెంగుళూరు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ వద్ద జాతీయరహదారి 7 తో అనుసంధానించబడి ఉంది. జాతీయరహదారి 7 కర్నాటక సరిహద్దులో పడమర కనుమల వద్ద పంజూరు వద్ద ముగుస్తుంది.

జిల్లాలోని అత్యధిఅభాగం నీలగిరి పర్వతాల దిగువభూములు ఆక్రమించి ఉన్నాయి. ఇవి వర్షాధార మైదానాలుగా అరణ్యాలు మరియు కొండలతో నిండి ఉన్నాయి.

గణాంకాలుసవరించు

2011 గణాంకాలను అనుసరించి చామరాజనగర్ జిల్లా జనసంఖ్య 1,020,962.[2] ఇది దాదాపు సైప్రస్ దేశానికి సమానంగా ఉంది.[3] అలాగే యు.ఎస్ రాష్ట్రాలలోని మాంటనా రాష్టానికి సమానం.[4] 640 భారతీయ జిల్లాలలో ఇది 441వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 200. 200 inhabitants per square kilometre (520/sq mi) .[2]2001-2011 కుటునబనియంత్రణ శాతం 5.75%.[2] చామరాజనగర్ స్త్రీపురుష నిష్పత్తి 989:1000., [2] అలాగే అక్షరాస్యత శాతం 61.12%.[2] అటవీప్రాంతం అత్యధికంగా ఉన్న జిల్లా అయినందున జిల్లాలో అత్యధికస్థాయిలో గిరిజనులు నివసిస్తున్నారు. వారిలో " సోలిగా, యరావా, జెనుకుర్బా మరియు బెట్ట కుర్బాలు జాతి వారు ప్రధానులుగా పరిగణిచబడుతున్నారు. ఈ జాతి ప్రజల సంఖ్య మొత్తం 82,000. ఈ ప్రజలకు వారి ప్రత్యేక భాష ఉంటుంది.

ఇతర సమాచారంసవరించు

జిల్లాలోని దక్షిణప్రాంతం అధికంగా దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాలు గంధపు చెట్ల అక్రమరవాణా మరియు బందిపోటు వీరప్పన్‌కు ఆశ్రయం అయ్యాయి. వీరప్పన్ 100 కంటే అధికమైన పోలీసుల మరణానికి హేతువు కారణమయ్యాడు. వీరప్పన్ ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న " స్పెషల్ టస్క్ ఫోర్స్ " చేతిలో 2004 అక్టోబరు18 న తమిళనాడుకు చెందిన ధర్మపురి జిల్లాలో ఎంకౌంటర్‌లో హతుడయ్యాడు. విరప్పన్ దాదాపు 2 దశాబ్ధాల కాలం పరారి జీవితం గడిపాడు. వీరప్పన్ నల్లరాతి అక్రమరవాణా చేసి అటవీ శాఖను హడకెత్తించాడు.

.

మూలాలుసవరించు

  1. http://chamrajnagar.nic.in/home.html
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Montana 989,415 line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు