చార్లెస్ థామ్సన్

భారతీయ మాజీ క్రికెటర్, కోచ్

చార్లెస్ డేవిడ్ థామ్సన్ (జననం 1969, సెప్టెంబరు 7) భారతీయ మాజీ క్రికెటర్, కోచ్. భారత సర్వీసెస్ జట్టు తరపున 1993 నుండి 2003 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

చార్లెస్ థామ్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చార్లెస్ డేవిడ్ థామ్సన్
పుట్టిన తేదీ (1969-09-07) 1969 సెప్టెంబరు 7 (వయసు 55)
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1993-94 to 2003-04Services
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 34 23
చేసిన పరుగులు 1249 273
బ్యాటింగు సగటు 25.48 13.65
100లు/50లు 1/5 0/2
అత్యధిక స్కోరు 130 61*
వేసిన బంతులు 1404 444
వికెట్లు 12 10
బౌలింగు సగటు 65.91 39.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు 3/60 3/59
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 8/–
మూలం: Cricinfo, 2021 1 March

క్రికెట్ రంగం

మార్చు

థామ్సన్ ఇండియన్ నేవీలో పనిచేస్తున్నప్పుడు సర్వీసెస్ తరపున ఆడాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. 2002–03లో రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రపై 130 పరుగులతో తన ఏకైక సెంచరీ సాధించాడు.[1] 1998–99లో జమ్మూ, కాశ్మీర్‌పై సర్వీసెస్ విజయంలో లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 61 నాటౌట్ చేశాడు.[2]

2013లో నౌకాదళాన్ని విడిచిపెట్టిన తర్వాత, థామ్సన్ ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌కు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆంధ్రా క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్ గా ఉన్నాడు.

మూలాలు

మార్చు
  1. "Saurashtra v Services 2002-03". Cricinfo. Retrieved 1 March 2021.
  2. "Jammu and Kashmir v Services 1998-99". CricketArchive. Retrieved 2 March 2021.

బాహ్య లింకులు

మార్చు