చింతరణం
పరిచయంసవరించు
Rhynchostylis retusa | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Subtribe: | |
Genus: | |
Species: | R. retusa
|
Binomial name | |
Rhynchostylis retusa |
చింతరణం అనేది ఆర్కిడాసే కుటుంబంలో చెట్లపై పెరిగే వాండా జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం 'రింకోస్టైలిస్ రెటూసా' (Rhynchostylis Retusa). ఫాక్స్ టేల్ ఆర్కిడ్ అని దీని ఆంగ్ల నామం. సంస్కృతంలో చింతరణాన్ని బంద లేక రస్న అంటారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, సిక్కీం,, ఇతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో సీలేరు అటవీ ప్రాంతాల్లో చింతరణం పెరుగుతుంది. చింతరణం అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం. అత్యంత మెల్లగా పెరిగే చింతరణానికి వర్షాకాలం చివరలో సుమారు 100 అందమైన పువ్వుల గెల పుష్పిస్తుంది.
ఔషధ గుణాలుసవరించు
ఆస్సాంలో గొలాఘట్ జిల్లాలో తెగలు చింతరణాన్ని కౌపౌ ఫల్ (Kopou Phul) అని పిలుస్తారు. చివిపోటుకు దీని వేళ్ళ రసాన్ని చెవిలో వేసుకుంటారు[1] . ఒడిషా రాష్ట్రంలో చింతరణాన్ని పునంగా పిలుస్తారు. రక్త విరేచనాలకు 3 నుండి 4 గ్రాముల లేత చింతరణం ఆకులు 2 గ్రాముల Pisum sativum ఆకుల చిగురులతో పేస్టులా నూరి రోజుకు రెండు సార్లు వారం రోజుల పాటు 1 గ్రాము చొప్పున ఖాళీ కడుపున తీసుకుంటారు. కొన్ని తెగలవారు చింతరణం ఆకులను పసరగా నూరి తగిలిన గాయలకు, పుండ్లకు, తలనొప్పికి పట్టులా వేస్తారు.[2]
ఇతర ఉపయోగాలుసవరించు
వసంత ఋతువులో ఆస్సాం రాష్ట్రంలో జరుపుకొనే రోంగలి బిహు అనే పండుగ సమయాల్లో అమ్మాయిలు తమ జడలను చింతరణం పువ్వులతో అలంకరించుకుంటారు. ఆస్సాం యువత చింతరణం పువ్వులను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. పెళ్ళిళ్ళ వేడుకల్లో పెళ్ళిమండపాలను చింతరణం పువ్వులతో అలంకరిస్తారు.
ప్రస్తుత పరిస్థితిసవరించు
అద్భుతమైన పుష్పాలు పూచే చింతరణం మొక్కలను చాలా మంది ఆసక్తితో అడవులకు వెళ్ళి సేకరిస్తుంటారు. ఇటీవల ఇండియన్ ఫారెస్ట్ డిపార్టుమెంట్ వారి అంతరించిపోయే జాబితాలో నమోదైయ్యింది.
పెంపకంసవరించు
ఈ మొక్కలను కుండీల్లో పెంచడానికి కొబ్బరి డెక్కలు, కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్ట్, ఇటుకల పొడి, చీకిపోయిన చెట్ల బెరడు అవసరమవుతుంది. మట్టి అవసరం లేదు. వాతావరణంలో అధిక తేమ ఉండాలి, మధ్యాహ్నపు ఎండ నేరుగా తగలరాదు. నీడ అవసరం. కోస్తా జిల్లాలు ఇటువంటి వాతావరణానికి అనుకూలం. చింతరణం చీకటి గదిలో గాని లేక ఏ.సి గదుల్లో గాని పెరగదు.