చింతలపూడి నగరపంచాయితీ
చింతలపూడి నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం ఏలూరు లోక్సభ నియోజకవర్గం లోని, చింతలపూడి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చింతలపూడి | |
స్థాపన | 2021 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
చరిత్ర
మార్చుచింతలపూడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నగర పంచాయతీ. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 48 కి.మీ. దూరంలో ఉంది. జిల్లాలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రము ద్వారకాతిరుమల, చింతలపూడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ నగర పంచాయతీ 2021 లో 20 వార్డులతో ఏర్పాటు చేశారు.[1]
భౌగోళికం
మార్చుఈ చింతలపూడి నగరపంచాయితీ17°02′30″N 80°35′24″E / 17.0417°N 80.5901°E అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఖమ్మం జిల్లా (తెలంగాణా రాష్ర్టము) నకూ, ఇటు కృష్ణా జిల్లాకూ సరిహద్దుగా ఉంది.రాష్ట్ర రాజధాని అమరావతి నుండి 199 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చుఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 25,952 జనాభా ఉన్నరు. ఉండగా అందులో పురుషులు 12,438, మహిళలు 13,514 మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2,652 ఉన్నారు.ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అక్షరాస్యత ఎక్కువ.అక్షరాస్యత రేటు 78.08%, ఉంది[2]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
మూలాలు
మార్చు- ↑ "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2021-06-06.
- ↑ "Chintalapudi Village Population - Chintalapudi - West Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-06-06.