చింతల మానేపల్లి మండలం

తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం


చింతల మానేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 20 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి  నిర్జన గ్రామం. ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 50 కి. మీ. దూరంలో ఉంది.

కౌటల
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కౌటల స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కౌటల స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కౌటల స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం కౌటల
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 504299

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

ఇంతకుముందు చింతల మానేపల్లి గ్రామం అదిలాబాద్ జిల్లా, అసిఫాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని కౌటల మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చింతల మానేపల్లి నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన కుమ్రం భీమ్(ఆసిఫాబాద్) జిల్లా, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+20 (ఇరవైఒకటి) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 292 చ.కి.మీ. కాగా, జనాభా 29,732. జనాభాలో పురుషులు 14,966 కాగా, స్త్రీల సంఖ్య 14,766. మండలంలో 7,061 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. బాబాపూర్
  2. బాబాసాగర్
  3. బాలాజి అంకొడ
  4. చింతల మానేపల్లి
  5. గంగాపూర్
  6. బూరేపల్లి
  7. కొరిసిని
  8. రన్వల్లి
  9. రవీంద్రనగర్
  10. కేథిని
  11. దింద
  12. చిత్తాం
  13. గూడెం
  14. బూరుగూడ
  15. కోయపల్లి
  16. శివపల్లి
  17. కర్జవెల్లి
  18. రుద్రాపూర్
  19. దబ్బా
  20. అడేపల్లి

గణనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-27.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు