కాగజ్‌నగర్

తెలంగాణ, కొమరంభీం జిల్లా, కాగజ్‌నగర్ మండలం లోని పట్టణం
(కాగజ్‌నగర్‌ నుండి దారిమార్పు చెందింది)
  ?కాగజ్‌నగర్‌
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 19°20′00″N 79°29′00″E / 19.3333°N 79.4833°E / 19.3333; 79.4833
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 8.31 కి.మీ² (3 చ.మై)[1]
జిల్లా (లు) కొమరంభీం జిల్లా జిల్లా
జనాభా
జనసాంద్రత
57,583[2] (2011 నాటికి)
• 6,929/కి.మీ² (17,946/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం కాగజ్‌నగర్‌


కాగజ్‌నగర్‌, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, కాగజ్‌నగర్‌ మండలం లోని గ్రామం[3] కాగజ్ అనగా కాగితం. సిర్పూర్ పేపర్ మిల్స్ ఉండటం వలన ఈ ఊరికి కాగజ్‌నగర్‌ అని పేరు వచ్చింది. 1988లో కాగజ్‌నగర్‌ పురపాలకసంఘంగా ఏర్పడింది. [4]2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [5]

విద్యుత్ వ్యవస్థ

మార్చు

తెలంగాణరాష్ట్ర ఏర్పాటు తరువాత వ్యవసాయ, వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుంది.

నీటి సరఫరా

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది

రవాణా

మార్చు
 
సిర్పూర్ - కాగజ్‌నగర్‌ రైల్వే స్ఠేషన్ సైన్ బోర్డు దృశ్య చిత్రం

ఈ పట్టణానికి న్యూ ఢిల్లీ-చెన్నై ప్రధాన మార్గంలో ఉన్న సిర్పూర్ - కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్ సేవలు అందిస్తుంది. దీనిని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నిర్వహిస్తుంది. కాగజ్‌నగర్‌ పట్టణం రెబ్బెన వద్ద రహదారి ద్వారా AP SH 1 కి అనుసంధానించబడింది. కాగజ్ నగర్ తెలంగాణలోని అనేక నగరాలకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు సర్వీసు ద్వారా అనుసంధానించబడింది.

సమీప విమానాశ్రయం నాగ్‌పూర్ విమానాశ్రయం 257 కి.మీ దూరంలో, హైదరాబాద్ విమానాశ్రయం 307 కి.మీ దూరంలో ఉన్నాయి.

వ్యవసాయం, పంటలు

మార్చు

కాగజ్‌నగర్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4277 హెక్టార్లు, రబీలో 4365 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[6]

గ్రామ ప్రముఖులు

మార్చు
  1. కావేటి సమ్మయ్య: రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు.[7][8]
 
హనుమాన్ విగ్రహం, త్రిశూల్ పహడ్, సిర్పూర్ కాగజ్‌నగర్

పర్యాటకం

మార్చు

ఇక్కడికి సమీపంలోని అడవుల్లో అడవుల్లో ప్రతిఏటా బర్డ్స్​వాక్‌ ఫెస్టివల్‌ జరుగుతుంటుంది. 2019 డిసెంబర్‌లో తొలిసారిగా బర్డ్స్​వాక్‌ ఫెస్టివల్ నిర్వహించబడింది. పర్యాటకులు విచ్చేసి రకరకాల పక్షుల కూతల నడుమ ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. కాగజ్​నగర్ మండలంలోని కదంబ, రేగుల్‌గూడ, కోస్ని, వాచ్ టవర్, సిర్పూర్ టిలో మాలిని, బెజ్జూర్‌ మండలంలో మర్తాడి స్ప్రింగ్ కట్ట, పెంచికలపేట మండలంలో కొండపల్లి అటవీ ప్రాంతాల్లోని పక్షులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రెండు రోజులపాటు సాగే బర్డ్స్​వాక్ ఫెస్టివల్ లో అటవీశాఖ అధికారులు రకరకాల పక్షులను చూపించి, ముగింపు కార్యక్రమంలో కాగజ్​నగర్ డివిజన్ కార్యాలయంలో పర్యాటకులకు ధ్రువపత్రాలతోపాటు జ్ఞాపికలు అందిస్తారు.[9][10]

మూలాలు

మార్చు
  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 28 June 2016.
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. https://kagaznagarmunicipality.telangana.gov.in/pages/basic-information[permanent dead link]
  5. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  6. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 160
  7. ఈనాడు, తాజా వార్తలు (9 April 2020). "మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి". www.eenadu.net. Archived from the original on 9 April 2020. Retrieved 9 April 2020.
  8. నమస్తే తెలంగాణ, తెలంగాణ (9 April 2020). "మాజీ ఎమ్మెలే కావేటి సమ్మయ్య కన్నుమూత". ntnews. Archived from the original on 9 April 2020. Retrieved 9 April 2020.
  9. "కాగజ్‌నగర్‌ అడవుల్లో ప్రారంభమైన బర్డ్స్‌ వాక్‌ ఫెస్టివల్‌". Namasthe Telangana. 2022-01-08. Archived from the original on 2022-01-08. Retrieved 2022-01-11.
  10. "Birds Walk Festival 2022 :ఎన్నో మధురానుభూతులను పంచిన బర్డ్స్ వాక్ ఫెస్టివల్". ETV Bharat News. Archived from the original on 2022-01-11. Retrieved 2022-01-11.

వెలుపలి లంకెలు

మార్చు