చిట్టెం పర్ణికారెడ్డి

చిట్టెం పర్ణికారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2023 శాసనసభ ఎన్నికల్లో నారాయణపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[2][3]

చిట్టెం పర్ణికారెడ్డి

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు ఎస్‌. రాజేందర్‌ రెడ్డి
నియోజకవర్గం నారాయణపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1993
నారాయణపేట, నారాయణపేట జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు కే.శే. చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మి (ఐఏఎస్‌)
జీవిత భాగస్వామి చింతలపని విశ్వజిత్ రెడ్డి
బంధువులు డీకే అరుణ (మేనత్త)
సంతానం అయాన్ష్ రెడ్డి
నివాసం సీవీఆర్ భవన్, సాయి విజయ్ కాలనీ, నారాయణపేట[1]

జననం, విద్యాభాస్యం మార్చు

చిట్టెం పర్ణికారెడ్డి 1993లో హైదరాబాద్‌లో కే.శే. చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మి (ఐఏఎస్‌) దంపతులకు జన్మించింది.[4] ఆమె 2016లో ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ పూర్తి, భాస్కర వైద్య కళాశాలలో పీజీ (రేడియాలజిస్ట్‌) గా పని చేసింది.[5][6]

రాజకీయ జీవితం మార్చు

డా. పర్ణిక రెడ్డి రాజకీయ నేపధ్యమున్న కుటుంబ నుండి రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యేగా, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడిగా, మేనత్త డీకే అరుణ మంత్రిగా, బాబాయ్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆమె మేనమామ కుంభం శివకుమార్‌రెడ్డి రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా నారాయణపేట నుండి పోటీ చేసి ఓడిపోయాయడు. పర్ణిక రెడ్డి ఆమె మేనమామ పోటీ చేసిన నారాయణపేట నియోజకవర్గం నుండి 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్‌. రాజేందర్‌ రెడ్డిపై 7,951 ఓట్ల మెజారిటీతో[7] గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.[8]

మూలాలు మార్చు

  1. "CHITTEM PARNIKA REDDY Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 16 December 2023. Retrieved 16 December 2023.
  2. Eenadu (4 December 2023). "తొలి అడుగులోనే సంచలన గెలుపు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. The Hindu (8 December 2023). "New wave, new wins" (in Indian English). Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
  4. Eenadu (4 December 2023). "వయసు 30 ఏళ్లలోపే.. తొలి ఎన్నికలోనే సత్తా చూపించారు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  5. News18 తెలుగు (4 December 2023). "అసెంబ్లీలో అధ్యక్షా అననున్న డాక్టర్లు.. ఎమ్మెల్యేలుగా 16 మంది వైద్యులు..!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. TV9 Telugu (3 December 2023). "అనూహ్య తీర్పు ఇచ్చిన ఓటర్లు.. సంచలనం సృష్టించిన యువనేతలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  8. Eenadu (4 December 2023). "పేటకు తొలి మహిళా ఎమ్మెల్యే". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.