ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయం

డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం (ఎన్.టి.ఆర్.విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ ) ఆంధ్ర ప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రీ, సినీ నటుడు అయిన నందమూరి తారక రామారావు పేరు ఈ సంస్థకు పెట్టారు. 1986లో ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా ప్రారంభమయిన ఈ విశ్వవిద్యాలయము ఎన్.టి.రామారావు మరణానంతరము ఎన్.టి.ఆర్.విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చబడింది. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం.

ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
నినాదంవైద్యో నారాయణో హరి
రకంపబ్లిక్
స్థాపితం1986
ఛాన్సలర్శ్రీ ఈ.ఎస్.ఎల్.నరసింహన్
వైస్ ఛాన్సలర్శ్రీ రవి రాజు
స్థానంవిజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత దేశము, భారతదేశం
కాంపస్అర్బన్
అనుబంధాలుయుజిసి
జాలగూడుntruhs.ap.nic.in

చరిత్ర మార్చు

డాక్టర్ ఎన్.టి.ఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం ( ఎన్.టి.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్,ఎన్.టి.ఆర్.యు.హెచ్.ఎస్) 1986 సంవత్సరం లో స్థాపించబడింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అనేక కమిటీలు సిఫార్సులను ఇచ్చిన తరువాత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం 6 ద్వారా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , ఆరోగ్య శాస్త్రాల మొదటి విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1998లో విశ్వవిద్యాలయానికి దాని వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పేరు పెట్టారు. 1998 ఫిబ్రవరి 2 వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పనిచేయడం ప్రారంభించింది. అన్ని కోర్సులలో పరిశోధన, ఏకరీతి పాఠ్యప్రణాళికను అమలు చేయడంతో సహా వైద్య విద్య ప్రమాణాలను మెరుగుపరచడం విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యాలు. డాక్టర్ ఎన్.టి.ఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభములో ఎన్ టిఆర్ యుహెచ్ ఎస్ కార్యాలయం క్యాంపస్ ను సిద్ధార్థ మెడికల్ కాలేజీ భవనం లో మార్చి 2002 సంవత్సరం వరకు ఉండి , ఆ తర్వాత ఏప్రిల్, 2002 సంవత్సరం లో ప్రస్తుత భవనంలోకి మార్చినారు. ఎన్ టిఆర్ యుహెచ్ ఎస్ కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) గుర్తింపు పొందింది ,ఆయుర్వేద మెడిసిన్ & సర్జరీ (బిఎఎమ్ఎస్)లో బ్యాచిలర్ డిగ్రీని 5 సంవత్సరాల 6 నెలల అధ్యయన కోర్సు.[1]

పేరు మార్పు మార్చు

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (సవరణ) చట్టం 2022లోని సెక్షన్ 1లోని సబ్ సెక్షన్ 2ను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును 'డాక్టర్ వైఎస్సార్ హెల్త్ సైన్సెస్'గా మార్చడం జరిగింది. ఈ పేరు సవరణ 2022 నాటి చట్టం నెం.19ను ఆంధ్రప్రదేశ్ గెజిట్ నెం.19 పార్ట్-4-బి, 28.10.2022 సంచికలో ప్రచురించారు, సవరించిన దాని ప్రకారం పేరు మార్పు 2022 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి రావడం జరిగింది[2].

కోర్సులు మార్చు

యూనివర్సిటీ తన అనుబంధ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్(యుజి) , పోస్ట్ గ్రాడ్యుయేట్ ( పిజి) , సూపర్ స్పెషాలిటీ, పిహెచ్ డి , పిడిఎఫ్ కోర్సులను మోడరన్ మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల తో ఉన్నది . డాక్టర్ ఎన్.టి.ఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయంకు ప్రారంభంలో 27 అనుబంధంగా ఉండి , ప్రస్తుతము మొత్తం కళాశాలల సంఖ్య 271 వరకు ఉన్నవి.[3]


అనుసంధానించిన కళాశాలలు , ఇన్‌స్టిట్యూట్స్ మార్చు

ప్రభుత్వ కళాశాలలు మార్చు

ఉప సంచాలకులు మార్చు

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా మార్చు

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు
  1. ప్రొఫెసర్ ఐ. వి. రావు (1986 to 1988)
  2. ప్రొఫెసర్ ఎల్. సూర్యనారాయణ (1988 to 1994)
  3. ప్రొఫెసర్ సి. ఎస్. భాస్కరన్ (1994 to 1997)
  4. ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్ (1997 to 2004)
  5. ప్రొఫెసర్ ఆర్. సాంబశివరావు (2004 to 2007)
  6. డాక్టర్ పి. వి. రమేష్ (2007)
  7. ప్రొఫెసర్ ఎ. వి. కృష్ణంరాజు (2007 to 2010)
  8. డాక్టర్ ఐ. వి. రావు (2010)

ఇవి కూడా చూడండి మార్చు

 
ఎన్.టి.ఆర్.వైద్యశాస్త్ర విశ్వవిద్యాలయం.

బయటి లింకులు మార్చు


మూలాలు మార్చు

  1. "NTR University of Health Sciences". EducationWorld (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-09-07. Retrieved 2021-09-02.
  2. "DR. Y.S.R UNIVERSITY OF HEALTH SCIENCES". drysruhs.edu.in. Retrieved 2024-02-10.
  3. "About Us" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2013-08-13. Retrieved 2021-09-02.