చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా

సి. ఎం. హబీబుల్లా గా ప్రసిద్దులైన చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా భారతీయ వైద్యులు. ఆయన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో భారత దేశంలో సుప్రసిద్ధుడు.[1][2]

చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా
సుప్రసిద్ద వైద్యులు, పద్మశ్రీ డాక్టర్ హబీబుల్లా గారు
జననం1937
ఆంధ్రప్రదేశ్, భారతదేశము
మరణం10 జూలై 2010
సమాధి స్థలంహైదరాబాదు
వృత్తిగాస్ట్రో ఎంటరాలజిస్టు
క్రియాశీల సంవత్సరాలు1958 - 2010
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు
పిల్లలుడాక్టర్ ఏజాజ్ హబీబ్
పురస్కారాలుపద్మశ్రీ
ఖ్వారిజ్మి అంతర్జాతీయ అవార్డు

జీవిత విశేషాలు

మార్చు

ఆయన 1937 లో భారతదేశ దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు.[3] 1958 లో గుంటూరు వైద్య కళాశాల నుండి ఎం.బి.బి.ఎస్ పట్టాను పొందారు. తరువాత ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని, చండీగడ్ లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుండి ఎం.డి పట్టాలను పొందారు.[1]

కెరీర్

మార్చు

ఆయన ఉస్మానియా వైద్య కళాశాలలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా కెరీర్ ప్రరంభించారు. 1975 నుండి 1992 వరకు ఆ విభాగానికి అధిపతిగా యున్నారు. తరువాత 1994 వరకు ప్రధానాద్యాపకునిగా పనిచేసారు.[1] ఆయన హైదరాబాదు లోని దక్కన్ కాలేజి ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సెంటర్ ఫర్ లివర్ రీసెర్చ్ అండ్ డయాగ్నాసిస్ విభాగంలో డైరక్టరుగా తన సేవలనందించారు.[3] ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ విద్యకు డైరక్టరుగా కూడా పనిచేసారు.[1] ఆయన భారతదేశం లోని నేషనల్ సైన్సు అకాడమీలో 1997 లో ఫెలోషిప్ పొందారు.[3] ఆయన అనేక శాస్త్రపరమైన ప్రచురణలు చేసి గుర్తింపబడ్డారు.[4][4]

పురస్కారాలు

మార్చు
  • 1997 - ఖ్వారిస్మి అంతర్జాతీయ పురస్కారం.[5]
  • 2001 : భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం.[6] He died on 10 July 2010, falling to a cardiac arrest.[1]
  • 2003 : డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ అవార్డు.[7]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Springer (October 2010). "Chittoor Mohammed Habibullah". Indian Journal of Gastroenterology. 29 (5): 175–176. doi:10.1007/s12664-010-0053-9.
  2. "Learning from Expert". Learning from Expert. 2014. Archived from the original on 2015-01-02. Retrieved January 2, 2015.
  3. 3.0 3.1 3.2 "NASI". NASI. 2014. Retrieved January 2, 2015.
  4. 4.0 4.1 "Listing on Pubfacts". Pubfacts. 2014. Archived from the original on 2015-09-24. Retrieved January 2, 2015.
  5. "KIA". KIA. 2014. Archived from the original on 2013-12-15. Retrieved January 2, 2015.
  6. "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved November 11, 2014.
  7. "డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ అవార్డులు : స్నాతకోత్సవం డీఎస్సీ అవార్డు". Archived from the original on 2016-06-02. Retrieved 2016-05-21.

ఇతర లింకులు

మార్చు