చిత్రాంగదుడు

చిత్రాంగదుడు శంతనుడు, సత్యవతిల మొదటి కుమారుడు. విచిత్రవీర్యుడు ఇతని తమ్ముడు. భీష్ముడు సత్యవతికి కాక శంతనుడు, గంగలకు కలిగిన కుమారుడు. భీష్ముడు తన శపథం మేరకు చిత్రాంగదుని హస్తినాపుర సింహాసనానికి పట్టాభిషిక్తుని చేసాడు. చిత్రాంగదుడు బలవంతుడనని అహంకారము కలవాడు. అదే పేరు కలిగిన ఒక గంధర్వ రాజు చిత్రాంగదుని యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధంలో గంధర్వ రాజు చిత్రాంగదుని చంపాడు. చిత్రాంగదుని మరణం తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని పట్టాభిషిక్తుని చేసాడు.

Chitrāngada.jpg
చిత్రాంగదుడు

వివరాలుసవరించు

శంతన మహారాజు గంగాదేవిని కలిసి భీష్ముడిని పుత్రునిగా పొందుతాడు. అష్టవసువుల శాపాన్ని ఉద్ధరించడానికి ఆమె పుట్టిన వెంటనే ఏడుమంది శిశువులను గంగపాలు వేస్తుంది. అష్టమ వసువైన భీష్ముడిని చంపబోగా శంతనుడు ఆమెను వారించడంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆమె శంతనుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. తర్వాత శంతనుడు సత్యవతిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ తనకు పుట్టబోయే సంతానానికి రాజ్య అర్హత ఉండదని అడ్డుపడుతుంది. అప్పుడు భీష్ముడు తనకు రాజ్యం వలదనీ, పెళ్ళి కూడా చేసుకోనని ఆమెకు మాట ఇచ్చి తండ్రి వివాహం జరిపిస్తాడు. తర్వాత ఆమెకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. ఒకరు చిత్రాంగదుడు. మరొకడు విచిత్ర వీర్యుడు. వీరు చిన్నతనంలో ఉండగానే శంతనుడు మరణించాడు.[1]

రాజ్యభారమే కాక వారిద్దరి పోషణా భారం కూడా భీష్ముడిమీద పడుతుంది. భీష్ముడు వారిని పెంచి పెద్దచేసి ముందుగా పెద్దవాడైన చిత్రాంగదుడిని రాజును చేస్తాడు. అతను మహావీరుడై అనేక యుద్ధాలు చేస్తాడు. అదే అహంకారంతో తన పేరే కలిగిన గంధర్వరాజుతో యుద్ధం చేసి మరణిస్తాడు. దాంతో భీష్ముడు అతని తమ్ముడైన విచిత్రవీర్యుని రాజును చేస్తాడు.[2]

చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. దివాకర్ల, వేంకటావధాని (2013). కవిత్రయ విరచిత శ్రీమదాంద్రమహాభారతము ఆదిపర్వము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Archived from the original on 2020-06-09. Retrieved 2020-06-09.
  2. "మహాభారత కథ : భీష్ముడు రాజకుమార్తెలను అపహరించడం". ఇష సద్గురు. 2017-03-01. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.


మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  • సభా పర్వము  • వన పర్వము లేక అరణ్య పర్వము  • విరాట పర్వము  • ఉద్యోగ పర్వము  • భీష్మ పర్వము  • ద్రోణ పర్వము  • కర్ణ పర్వము  • శల్య పర్వము  • సౌప్తిక పర్వము  • స్త్రీ పర్వము  • శాంతి పర్వము  • అనుశాసనిక పర్వము  • అశ్వమేధ పర్వము  • ఆశ్రమవాస పర్వము  • మౌసల పర్వము  • మహాప్రస్ధానిక పర్వము  • స్వర్గారోహణ పర్వము  • హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటరాజు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి | సుధేష్ణ
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత