చిన్మయారణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, ఓబులవారిపల్లె మండలం, యల్లాయ పల్లె గ్రామంలోని ఓ ఆశ్రమం. ఇది చిన్మయ మిషన్ వారి అనుబంధ సంస్థ. ఈ ఆశ్రమం పచ్చని చెట్లతో, దేవాలయాలతో అందంగా ఉంటుంది. పూజ్య స్వామిని శారదాప్రియానంద, స్వామి చిన్మయానంద గార్లచె స్థాపించబడిన ఈ ఆశ్రమం ఇక్కడ హిందూ మతానికి, అధ్యాత్మికతకు, చుట్టు పక్కల ఊర్ల ప్రజలకు విశేష కృషి చేస్తోంది[1]. ఇక్కడ ఆశ్రమవాసులు, చుట్టుపక్కల గ్రామాల వారందరూ ఈ ఆశ్రమ స్థాపకురాలైన శారద ప్రియానంద గారిని అమ్మ అని వచిస్తూ ఆమె యందు ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉంటారు.[2]

చిన్మయారణ్యం
రకంఆధ్యాత్మిక సంస్థ
స్థాపించిన తేదీ1982
ప్రధాన కార్యాలయం
ఆదర్శ వాక్యం“Receive the light of Knowledge , Bringout the heat of Action.”

నేపధ్యంసవరించు

ఈ ఆశ్రమం కోసం యల్లాయ పల్లె గ్రామస్తులు 1982 లో 24 ఎకరాల భూమిని దానం చేశారు. తద్వారా స్వామి చిన్మయానంద సరస్వతి 1982 ఫిబ్రవరి 8 న భూమి పూజకు నిశ్చయించారు. ఈ ఆశ్రమం ప్రారంభిస్తూ గురుదేవులు స్వామి చిన్మయానంద ఉత్సాహంగా ," ఈ ఆశ్రమం బాగా అభివృద్ది చెందుతుంది అని, దేశం మొత్తం ఈ ఆశ్రమం వైపు చూస్తుందనడంలో సందేహం లేదు" అని తెలిపారు. చిన్మయానంద స్వామి మరో నిమిషం వృధా చేయకుండా ఉత్సాహంతో వివిధ కార్యక్రమాల రూపకల్పన చేశారు[3]. తర్వాత ఈ ఆశ్రమం బాగా అభివృద్దిలోకి వచ్చింది.

గ్రామంలో ఈ ఆశ్రమం ప్రారంభించిన నెలాఖరు కల్లా ఉన్నత చదువులు చదివిన ఓ బ్రహ్మచారి రాత్రి బడిని ప్రారంభించి సత్సంగాలు కూడా నిర్వహించాడు. మూడు నెలల్లో రెండు కుటీరాలు నిర్మించారు. తద్వారా చిన్మయ మిషన్ లోని ఐదుగురు ప్రముఖుల్లో నలుగురు ఇక్కడికి ఉండడానికి వచ్చారు. ఓ సంవత్సరం తిరిగే లోగా ఏ ఆసరా లేని పేద వృద్దులను పోషించడం ప్రారంభించారు. ప్రారంభంలో వీరు ఓ 15 మంది ఉండే వారు. తరువాత ఇదే విధముగా సత్య కామ మందిరం ప్రారంభించడంతో బాటు ఇద్దరు అనాధాలైన ఆడ పిల్లలకు ఆశ్రయం కల్పించారు.

ఇక్కడ సరైన నీటి వసతులు ఉండేవి కావు. ఆ సందర్భంలో స్వామి చిన్మయానంద," భగవంతుడు భూమిని ఇచ్చినప్పుడు నీరు ఎందుకు ఇవ్వడు ? దేవుడు భూమిలోపల నుండి లేదా కొండ పై నుండి గంగని అనుగ్రహిస్తాడు!!" అని అన్నాడు. గురుదేవులు చెప్పిన విధంగానే జియోలాజి శాఖ వారు పరిశీలించి ఈ భూమిలో నీరు ఉందని తెలిపి మూడు చోట్ల బోరు వేయడానికి గుర్తులు పెట్టారు. ఆ మూడు చోట్ల రెండు బోర్లు మోటారు పంపుల కోసం ఒకటి రోజువారీ అవసరాల కోసం బోరు వేశారు. ఎనిమిది నెలల్లోనే విద్యుత్ అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోయాయి. ఖాళీగా నిరుపయోగంగా పడి ఉన్న నేల నీటి గలగలలతో ఆకు పచ్చని అందమైన తోటగా మారింది.

విద్యా సంస్థలుసవరించు

ఈ ఆశ్రమం తరపున ఈ ఊరిలో చిన్మయ హరిహర విద్యాలయ అనే పాఠశాల నడుపుతున్నారు. అనాథలకు, పేద వారికి ఉచిత లేదా అత్యల్ప ధరకు 10 వ తరగతి వరకు ఇక్కడి పాఠశాలలో బోధన చేస్తున్నారు. వసతి గృహ సదుపాయం కూడా ఉంది[4].

చిన్మయారణ్యంలోని దేవాలయాలు, దర్శనీయ స్థలాలుసవరించు

  1. అరణ్యేశ్వర ఆలయం
  2. తపోవన ధ్యాన మందిరం
  3. చిన్మయ సదన్
  4. మాతృ మందిరం
  5. చిన్మయ సౌరభ స్థూపం
  6. శ్రీ వీర ఆంజనేయ స్వామి మందిరం

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-07-03. Retrieved 2020-05-16.
  2. http://chinmayaranyam.org/sarada.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-09-16. Retrieved 2020-07-15.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-09-16. Retrieved 2020-05-16.