స్వామి తేజోమయానంద

భారతీయ ఆధ్యాత్మిక గురువు

స్వామి తేజోమయానంద సరస్వతి 1950 జూన్ 30 న జన్మించారు. ఈయనని గురూజీ అని కూడా పిలుస్తారు. అసలు పేరు సుధాకర్ కైతవాడే, భారత ఆధ్యాత్మిక గురువు. చిన్మయ మిషన్ కు 1994-2017 వరకు ఈయనే అధ్యక్షుడు, ఆ తర్వాత 2017 లో స్వామి స్వరూపానంద అధ్యక్షుడయ్యారు.[1]

H.H. స్వామి తేజోమయానంద సరస్వతి (గురూజీ)
వ్యక్తిగతం
జననం
సుధాకర్ కైత్వాడే

(1950-06-30) 1950 జూన్ 30 (వయసు 73)
మతంహిందూత్వం

దీక్ష, శిష్యత్వం మార్చు

స్వామి చిన్మయానంద నుండి  భగవద్గీతపై  కొన్ని  చర్చలలో  పాల్గొన్న తరువాత, సుధాకర్ కైట్వాడే ముంబైలోని సందీపని సాధనలయలో చిన్మయ మిషన్ వారి నివాస వేదాంత కోర్సులో చేరడానికి ప్రేరణ పొందారు. 1975 లో కోర్సు పూర్తి చేసిన తరువాత, అతను బ్రహ్మచారి వివేక్ చైతన్యగా మారడంతో పాటు దీర్ఘకాలిక నివాస కోర్సు నిర్వహిస్తున్న స్వామి దయానంద సరస్వతి (అర్ష విద్యా) నుండి కూడా విద్యను  అభ్యసించాడు.

21 అక్టోబర్ 1983 న, స్వామి చిన్మయానంద అతనికి సన్యాసం ఇచ్చి స్వామి తేజోమయానందగా పేరు మార్చారు.

లక్ష్యాలు మార్చు

ప్రపంచవ్యాప్త చిన్మయ మిషన్  అధిపతిగా, స్వామి తేజోమయానంద ని మిషన్‌లో పూజ్య గురూజీగా పిలుస్తారు. అంతేకాకుండా కోయంబత్తూరులోని చిన్మయ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కొత్త డిల్లీలోని చిన్మయ సెంటర్ ఆఫ్ వరల్డ్ అండర్స్టాండింగ్, కొచ్చిన్ సమీపంలో ఉన్న చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, చెన్నైలోని చిన్మయ హెరిటేజ్ సెంటర్, బెంగళూరులోని చిన్మయ మిషన్ హాస్పిటల్ విస్తరణ, పూణే సమీపంలోని చిన్మయ విభూతి విజన్ సెంటర్ వంటి ప్రాజెక్టులలో పాల్గొన్నారు. అంతర్జాతీయంగా కూడా ఎక్కువ గా ప్రయాణాలు చేశారు. తన ప్రయాణాలలో, అతను ప్రతి వారం వివిధ నగరాలు, వివిధ దేశాలలో జ్ఞాన యజ్ఞాలను (3-7 రోజుల వేదాంత ఉపన్యాస సిరీస్) నిర్వహిస్తాడు

నిర్వహణలు మార్చు

స్వామి తేజోమయానంద చిన్మయ మిషన్ లో చాలా బాధ్యతలు నిర్వర్తించారు.

  • ముంబైలోని సందీపనీ సాధనలయ ఆశ్రమంలో ఆచార్యులుగా సేవలందించారు.
  • అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లోని చిన్మయ మిషన్ కేంద్రంలో ఆచార్యులుగా సేవలందించారు.
  • ప్రపంచం లో అన్నీ చిన్మయ మిషన్ లకు అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించారు.

పురస్కారాలు మార్చు

 
ఏప్రిల్ 12, 2016 న న్యూ డిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర పురస్కార వేడుకలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వామి తేజోమయానందకు పద్మభూషణ్ అవార్డును అందజేశారు.
  • స్వామి తేజోమయానందకు 2016లో దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ భూషణ్ తో సత్కరించారు.[2]

కార్యక్రమాలు మార్చు

స్వామి తేజోమయానంద వేదాంతం పైన శతాధిక పుస్తకాలు ప్రచురించారు.

ఇవి కూడా చూడండి మార్చు

ప్రస్తావనలు మార్చు

  1. "స్వామి తేజోమయానంద". చిన్మయ మిషన్. Archived from the original on 31 May 2008. Retrieved 17 May 2020.
  2. "This Year's Padma Awards announced" (Press release). Ministry of Home Affairs (India). 25 January 2016. Retrieved 25 January 2016.

బాహ్య లింకులు మార్చు