చిన్మయానంద సరస్వతి

అసలు పేరు లేదా జన్మ నామము పూతమ్పల్లి బాలకృష్ణన్ మీనన్ ( 1916 మే 8 - 1993 ఆగస్టు 3). ఆశ్రమ నామము స్వామి చిన్మయానంద సరస్వతి అయినప్పటికీ స్వామి చిన్మయానందగా పరిచితులు. ఈయన హిందూ ఆధ్యాత్మిక వేత్త, చిన్మయ మిషన్ స్థాపకులు. ఈ సంస్థ ద్వారా అద్వైత వేదాంతము, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర పురాతన హిందూ రచనల జ్ఞానాన్ని పంచుతున్నారు. చిన్మయ మిషన్ లాభదాయకత ఆశించని సంస్థ.[1]

చిన్మయానంద సరస్వతి
1990లలోని చిన్మయానంద స్వామి యొక్క ఒక చిత్ర పటము.
జననంబాలకృష్ణ మీనన్
(1916-05-08)1916 మే 8
ఎర్నాకుళం, Cochin Princely State, British India
నిర్యాణము1993 ఆగస్టు 3(1993-08-03) (వయసు 77)
శాన్ డియాగో, కాలిఫోర్నియా, U.S.
Resting place: సిద్దబరి
స్థాపించిన సంస్థచిన్మయ మిషన్
విశ్వ హిందూ పరిషత్
గురువుశివానంద సరస్వతి
తపోవన్ మహరాజ్
తత్వంఅద్వైత వేదాంతం
సాహిత్య రచనలుపవిత్ర భగవద్గీత తో పాటు మరిన్ని (See Bibliography)
పలుకులు
  • "మానవ చరిత్రలో విషాదం ఏమిటంటే సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ సంతోషం తగ్గుతోంది"
  • " నిజమైన గురువు అంటే స్వచ్చమైన అంతఃకరణ జ్ఞానం కలవారు; పవిత్రులు, లోతైన సాధించాలనే తపన ఉన్న మనస్సు కలవారు."
  • "మేము తరచుగా ప్రేమ లేకుండా ఇవ్వ వచ్చు, కానీ ఇవ్వకుండా ఎప్పటికీ ప్రేమించలేము."
ప్రముఖ శిష్యు(లు)డుస్వామి తేజోమయానంద
స్వామి పరిపూర్ణానంద

చిన్మయానంద 1964 లో విశ్వ హిందూ పరిషత్ సహాయ స్థాపకులు.

నేపధ్యం

మార్చు

ప్రారంభ జీవితం, విద్య

మార్చు

స్వామి చిన్మయానందగా అని పిలువబడే బాలకృష్ణ మీనన్ కేరళలోని ఎర్నాకులంలో 1916 మే 8 వ తేదీన ప్రఖ్యాత న్యాయమూర్తి వడక్కే కురుప్పాత్తు కుట్టన్ మీనన్ ఇంట పెద్ద కొడుకుగా జన్మించాడు. తల్లి గృహిణి. ఈమె తన మూడవ బిడ్డకు జన్మనిస్తుండగా మరణించింది. తరువాత తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు.

పాఠశాల విద్య కొచ్చిలోని శ్రీరామవర్మ హై స్కూల్ (1921–1928) లోనూ,త్రిసూర్లోని వివేకోదయం స్కూల్ (1928–1932)లోనూ పూర్తి చేశాడు. ఎర్నాకులం లోని మహారాజస్ కాలేజీ (1932–1934)లో ఫెల్లో ఆఫ్ ఆర్ట్స్ (FA), త్రిసూర్లోని సెయింట్ థామస్ కాలేజీలో బ్యాచ్లర్ ఆఫ్ ఆర్ట్స్ (1935–1937) పూర్తి చేశాడు. జర్నలిజం లోని కోర్సులను పూర్తి చేస్తూనే న్యాయశాస్త్రం, సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లక్నో విశ్వవిద్యాలయం (1940–1943)లో చదివాడు.

కాల గమనంలో ఆధ్యాత్మిక గురువుగా మారినప్పటికి, విద్యార్థి దశలో మతాన్ని అధికారికంగా స్వీకరించలేదు. తర్వాత ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకోవడం, 1942-1944 లో విస్తృతంగా జరిగిన "క్విట్ ఇండియా" ఉద్యమం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఉత్సాహంగా పాల్గొనడం, జైలుకు వెళ్ళడం జరిగాయి. చరసాలలోని అపరిశుభ్ర పరిస్థితులలో కొన్ని నెలలు గడపడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురికావడం వల్ల ఓ రాత్రి బయటకు తీసుకు వెళ్ళి నగర శివారులో రోడ్డు పక్కన పడేశారు. అటుగా వెళ్తున్న ఓ క్రైస్తవ భారతీయ మహిళ సైన్యంలో పనిచేసే తన కొడుకులా భావించి ఇంటికి తీసుకెళ్ళి వైద్యున్ని పిలిచింది. తరువాత అతను ఓ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు..[2]

విలేఖరిగా జీవితం

మార్చు

బాలన్ ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడింది. తరువాత జవహర్ లాల్ నెహ్రూ చే ప్రారంభించబడిన కొత్త వార్తాపత్రిక ది నేషనల్ హెరాల్డ్ లో కోటంరాజు రామారావు జర్నలిస్ట్ గా తొలి ఉద్యోగం ఇచ్చాడు. ఇక్కడ సోషల్ఇజం గురించి పత్రికలో పలు వ్యాసాలు రాసేవాడు. చరిత్ర, సామాజికం, రాజకీయం, సంస్కృతి పలు అంశాల మీద విభిన్న వ్యాసాలు రాశాడు.

ఆత్మ శోధన

మార్చు

తొలి అడుగులు

మార్చు

బాలన్ పుట్టుకతో పవిత్రుడు కాకపోయినా 33 ఏండ్ల వయస్సులో సన్యాస దీక్ష స్వీకరించాడు. దీని గురించి అతని మాటలలో "ఇది మాత్రమే చేయదగినది" అని తెలిపారు.[2] 19 శతాబ్దపు తొలి నాళ్ళలో కేరళ ఎర్నాకుళంలోని పూతమ్ప ఇంట్లో త్రిచూర్కి చెందిన వడక్కే కురుపాత్ కుట్టన్ మీనన్, శ్రద్ధాభక్తులు కలిగిన అతని భార్య పారుకుట్టి మీనన్ లకు ఇద్దరు కుమార్తెల తర్వాత మూడవ సంతానంగా జన్మించాడు. వీరి కుటుంబం గురించి చెప్పాలంటే భోజన సమయం కన్నా భక్తితో కూడిన ప్రార్థన అధిక సమయం చేసే సంప్రదాయ కుటుంబం. వీరి ఇల్లు దయకు, ఆతిథ్యం అందించడంలో పేరు గాంచినది ఎందుకంటే వీరి కుల గురువులు అయిన చట్టంబి స్వామిగల్, యోగిరాజ్ భైరవానంద లకు మర్యాదలతో గడిచేది. ఇంట్లో వారి ప్రకారం చిన్నప్పుడు బాలన్ అన్నీ విషయాల మీద అధికంగా ప్రశ్నలు వేసేవాడు, ప్రశ్నించే మనస్తత్వం కలిగినవాడు.

చిన్నతనంలో సాయం వేళలో తన ఇంట్లో రోజు జరిగే పూజలు తన తర్వాత వయస్సులో తన మనసు భగవంతుని ఆరాధన వైపు, ప్రపంచానికి మార్గదర్శనం చేసే దిశగా వెళ్ళేలా చేశాయి. తన కళ్ళు మూసుకున్న, బయట ఆడుకుంటునప్పుడు కూడా భగవంతుని ధ్యాసలో పరమ శివుని అన్వేషణలో ఉన్నట్టు మొహం తీయని దరహాసం ఉండేది.

ఆనంద కుటీరం లో ఉన్నప్పుడు తన గతాన్ని నెమరు వేసుకున్నప్పుడు చిన్మయానంద తన మాటలలో "పరమేశ్వరునితో జ్ఞాన మార్గంలో ప్రయాణించడానికి బాలన్ చిన్నతనంలో వేసుకున్న బాటలు తెలుసుకోవడానికి 20 సంవత్సరాల పైన పట్టింది".

 
చిన్మయానంద తన సన్యాస్ దీక్ష చేసిన రోజున, శివానంద సరస్వతి ఇతర శిష్యుల నుండి కుడి వైపు, 1949 ఫిబ్రవరి 25, మహా శివరాత్రి దినం, రిషికేశ్.
 
1956 లో ఉత్తరకాశి వద్ద స్వామి తపోవన్ మహారాజ్, స్వామి చిన్మయానంద
 
ఒక సందులో స్వామి చిన్మయానంద యొక్క ఆశువుగా సత్సంగం
 
దక్షిణ భారతదేశంలో స్వామి చిన్మయానంద జ్ఞాన యజ్ఞంలో ప్రేక్షకులు
 
1971 లో మసాచుసెట్స్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఇంటర్ఫెయిత్ సెమినార్‌లో స్వామి చిన్మయానంద ప్రార్థన చేయిస్తూ

బాలన్ నుండి జ్ఞాన మార్గంలో ఆనందం వైపు

మార్చు

ఉన్నత చదువులు పూర్తి అయిన తరువాత పత్రికలలో రాసేవాడు. అలా రాస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా ప్రసంగాలు కూడా ఇచ్చేవాడు. బాలకృష్ణన్ జాతీయవాద కార్యకలాపాలు జైలుపాలు చేశాయి. అందరిలాగే బాలన్ కూడా మూఢ నమ్మకాలపై, అసమానతలపై పోరాడాడు. ఈ విప్లవాత్మక పోరాటాలు స్వతంత్రంగా ఆలోచించడానికి జ్ఞాన మార్గం వైపు ప్రయాణించడానికి దోహదం చేశాయి.

నేషనల్ హెరాల్డ్ లో పనిచేస్తుండగా ఒకరోజు హిమాలయాల్లోని సాధువుల గురించి నిజాలు వెలికి తీయడానికి పూనుకున్నాడు. ఈ సందర్భంలో రిషికేశ్ లోని స్వామి శివానంద ఆశ్రమానికి వెళ్లాడు. స్వామి శివానంద దైవత్వం, ప్రేమ, వేదాంత బోధనలు ఆత్మశోధనకు ప్రేరేపించి ఆధ్యాత్మికతవైపు నడిపించాయి. బాహ్య ప్రపంచం గురించి వదిలేసి శాశ్వత ఆనందం గురించి ఆలోచనల్లో మునిగి తేలేవాడు. వారి సాంగత్యంలో బోధన స్పష్టత వలన అన్నీ వదిలేయడానికి, పరిత్యజించడానికి సిద్దపడ్డాడు.

1949 ఫిబ్రవరి 25 మహా శివరాత్రి పర్వదినాన స్వామి శివానంద ఆదేశం మేరకు సన్యాసం స్వీకరించి స్వామి చిన్మయానంద సరస్వతి అని పేరు పెట్టి ఆశీర్వదించబడ్డాడు. తర్వాత అక్కడి కఠిన పద్ధతులు అలవరుచుకున్నాడు. తరువాత జ్ఞానాన్ని వివిధ కోర్సుల ద్వారా అందించడానికి పూనుకున్నాడు. తానే స్వయంగా వేదాంత ఉపనిషత్తుల మీద 95 పుస్తకాలు రాశాడు[3].

విశ్వ హిందూ పరిషత్

మార్చు

1963 లో స్వామి చిన్మయానంద "హిందూ సంస్కృతి మనుగడ, అభివృద్ది" కోసం "ప్రపంచ వ్యాప్త హిందూ సమాఖ్య" అనే సంస్థ ఒకటి ఏర్పడాలని ఆశిస్తూ కష్టానష్టాలను చర్చించడానికి ప్రపంచవ్యాప్త అతిథులను ఆహ్వానిస్తూ ఓ వ్యాసం రాశారు. ఈ ఆలోచన ఇదే విధమైన ఆలోచనలు కలిగి ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ గా ఉన్న ఎస్.ఎస్. ఆప్టేని ఆకర్షించింది.

అదే సంవత్సరంలో కన్యా కుమారిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్మిస్తున్న వివేకానంద రాక్ మెమోరియల్ కు నిధులు అందించడానికి చిన్మయ మిషన్ రూ. 10,000 వసూలు చేసింది. అంతేకాకుండా 1964 ఆగస్టులో పోప్ నవంబర్లో ముంబైలో (అప్పట్లో బాంబే) లో జరిగే అంతర్జాతీయ యుచరిస్టిక్ సమావేశంలో 250 హిందువులు క్రైస్తవ మతంలోకి మారుతారని ప్రకటించాడు. బదులుగా చిన్మయానంద స్వామి 500 మందిని క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి మారుస్తానని ప్రకటించాడు.

1964 ఆగస్టులో సాందీపనీ ఆశ్రమంలో జరిగిన సమావేశంలో స్వామి చిన్మయానంద, ఆప్టే కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశం మూలంగా విశ్వ హిందూ పరిషత్ ఏర్పడింది. ఈ కొత్త సంస్థకు చిన్మయానంద అధ్యక్షుడిగా, ఆప్టే జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు.

స్వామి చిన్మయానంద ప్రకారం వి.హెచ్.పి ఎందుకు అంటే..

awake(n) the Hindus and to make them conscious of their proud place in the comity of nations. Once we have made every Hindu conscious of his own identity, the Parishad has done its job and we shall feel fully rewarded... ...

మనం హిందువులను హిందూత్వం వైపు మారుద్దాం, తరువాత అన్నీ సరిగ్గా ఉంటాయి. .[4]: 42 

అంతేకాకుండా వి.హెచ్.పి, "సాంస్కృతిక విధులు, ధార్మిక విలువలు" గురించి సభ్యులైన హిందూ మతంలోని హిందువులను వారి పిల్లలను విద్యావంతులను చేయడం, "మన సంప్రదాయాలను నేర్పించడం, అలవాటుచేయడం, ప్రోత్సహించడం" మొదలగు అవకాశాలు కల్పించడం మీద కచ్చితంగా శ్రద్ధ పెట్టాలని విశ్వసించాడు.

1980 లలో వి.హెచ్.పి తలపెట్టిన "ఏకాత్మత యాత్ర"లకు మద్దతు తెలిపాడు. ఈ యాత్రలను వ్యతిరేఖించే వారిని ఉద్దేశించి, దేశ ఐఖ్యత మీద మర్యాద లేని వారిగా, ఒంటరిగా మిగిలిపోతారని అభివర్ణించాడు.

స్వామి చిన్మయానందకు గుండె సంబంధిత సమస్యలు ఉండేవి. 1969 లో తొలిసారిగా గుండెపోటు రాగా కొత్తగా బెంగుళూరు నగరంలో తెరువబడిన చిన్మయ మిషన్ హాస్పిటల్లో తొలి పేషెంట్గా చేరి వైద్యం చేయించుకున్నారు. 1980 వేసవిలో అమెరికాలోని టెక్సాస్ నగరంలో జ్ఞానయజ్ఞ తరగతులు నిర్వహిస్తుండగా గుండెకి పలు బైపాస్ సర్జరీలు చేశారు. 1993 జులై 26 న శాన్ డియాగో, కాలిఫోర్నియాలో శ్వాస తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. జులై 29 న షార్ప్ మెమోరియల్ హాస్పిటల్లో అత్యవసర గుండె బైపాస్ సర్జరీ చేశారు. పరిస్థితి విషమంగానే ఉండటంతో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పైనే ఉంచారు. 1993 ఆగస్టు 3 న మరణించారు.

1993 ఆగస్టు 3 న పార్ధివ దేహాన్ని భారతదేశానికి తీసుకువస్తుండగా కొన్ని వేల మంది కొత్త ఢిల్లీ లోని ఇందిరా గాంధీ జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తరువాత హిమాచల్ ప్రదేశ్ లోని సిద్దబరికి దేహాన్ని తరలించి వైదిక సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇక్కడే మహా సమాధి స్మారకం నిర్మించారు.

నివాళి

మార్చు

24 డిసెంబర్ 1991 న అతని భక్తులు ముంబై లో సమావేశం అయ్యి అతని శరీర బరువుకు సమానమైన బంగారంతో సువర్ణ తులాభారం నిర్వహించదలచారు. ఈ నిధులు చిన్మయ మిషన్ లోని వివిధ సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు.

ప్రభావం

మార్చు

చిన్మయా మిషన్

మార్చు

స్వామి చిన్మయానంద ప్రపంచ వ్యాప్తంగా అధ్యాత్మికతకు, విద్యకు, సాధనకు ఉపకరించేలా ఆశ్రమాలు నెలకొల్పాడు.

స్వామి చిన్మయానంద చిన్మయా మిషన్ వేదికగా బాల విహార్, చిన్మయ యువ కేంద్ర(చిన్మయ మిషన్ యువ విభాగం), దేవి సమూహాలు అనబడే వయోజన విద్యా సమూహాలు మొదలగు ఆధ్యాత్మిక, మానసిక, సాంస్కృతిక, సామాజికతకు ఉపయోగపడేలా వివిధ విభిన్న ప్రాజెక్టులను రూపొందించాడు.

ప్రశంసలు, గుర్తింపులు

మార్చు

1992 డిసెంబర్ 2 న ఐక్య రాజ్యాలని ఉద్దేశించి, "సంక్షోభంలో గ్రహం" అనే అంశం మీద ప్రసంగించారు.[5]

1992 లో అమెరికా పత్రిక "హిందూఇజం టుడే" Hindu Renaissance Award తో "హిందూ ఆఫ్ ది ఇయర్" టైటిల్ తో సత్కరించింది.[6]

1993లో చికాగోలోని "పార్లమెంటు ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్" (వందేళ్ల కిందట స్వామి వివేకానంద ప్రసంగించిన చోటు) వద్ద జరిగిన శతాబ్ది సమావేశాల్లో "హిందూమత అధ్యక్షుడు"గా ఎన్నుకోబడ్డాడు. ఇతను మానవాళికి చేసిన నిస్వార్ధ సేవలకు గాను వాషింగ్టన్డి.సిలో 6- 1993 ఆగస్టు 8 లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన "వరల్డ్ విజన్ 2000" గౌరవించబడాల్సి ఉంది. స్వామి చిన్మయానంద 3 ఆగస్టు 1993 న మరణించినందున ఈ రెండింటికీ హాజరు కాలేదు.[7]

2015 మే 8 న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, చిన్మయానంద స్మారక నాణెన్ని చిన్మయానంద 100 వ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. https://en.wikipedia.org/wiki/Chinmayananda_Saraswati
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-11-07. Retrieved 2020-05-16.
  3. http://www.chinmayamission.com/who-we-are/swami-chinmayananda/
  4. Katju, Manjari (1998). "The Early Vishva Hindu Parishad: 1964 to 1983". Social Scientist. 26 (5/6): 34–60. doi:10.2307/3517547. ISSN 0970-0293. JSTOR 3517547.
  5. https://mychinmaya.org/?id=art_planet
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-25. Retrieved 2020-07-25.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-17. Retrieved 2020-07-25.