చిల్పూర్ మండలం (జనగామ జిల్లా)

తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం

చిల్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఇందులో 12 గ్రామాలున్నాయి. మండల కేంద్రం చిల్పూర్

చిల్పూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, చిల్పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, చిల్పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, చిల్పూర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం చిల్పూర్
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 156 km² (60.2 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 38,127
 - పురుషులు 19,022
 - స్త్రీలు 19,105
పిన్‌కోడ్ 506145

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 156 చ.కి.మీ. కాగా, జనాభా 38,127. జనాభాలో పురుషులు 19,022 కాగా, స్త్రీల సంఖ్య 19,105. మండలంలో 9,686 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన కొత్త మండలం మార్చు

 
మండల వనరుల కార్యాలయం, చిల్పూరు మండలం

లోగడ చిల్పూర్ గ్రామం వరంగల్ జిల్లా, వరంగల్ రెవెన్యూ డివిజను, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా  చిల్పూర్  గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ రెవెన్యూ డివిజను పరిధి క్రింద స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం నుండి చిల్పూర్ గ్రామంతో కలుపుకొని (1+11) పన్నెండు గ్రామాలతో నూతన మండల ప్రధాన కేంధ్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. చిల్పూర్
  2. కృష్ణాజిగూడెం
  3. కొండాపూర్
  4. చిన్నపెండ్యాల
  5. నష్కల్
  6. పల్లగుట్ట
  7. ఫతేపూర్
  8. మల్కాపూర్
  9. రాజవరం
  10. లింగంపల్లి
  11. వెంకటాద్రిపేట
  12. శ్రీపతిపల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు