చిల్లర దేవుళ్లు

చిల్లర దేవుళ్ళు 1977లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కాకతీయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు టి.మాధవరావు దర్శకత్వం వహించాడు. కాంచన, సావిత్రి, రమాప్రభ, భాను ప్రకాష్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1] దాశరథి రంగాచార్య ప్రఖ్యాత నవల చిల్లర దేవుళ్ళుకు ఇది చిత్రరూపం. కె.వి.మహదేవన్ స్వర కల్పనలో అద్భుతమైన గీతాలున్నాయి.

చిల్లర దేవుళ్లు
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి. మాధవరావు
తారాగణం ప్రభాకర్,
కాంచన,
భాను ప్రకాష్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ కాకతీయ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • కాంచన
  • సావిత్రి గణేషన్
  • రమాప్రభ
  • ఉమా భారతి
  • రాజేశ్వరి
  • మీనా కుమారి
  • భాను ప్రకాష్
  • వినయ్ కుమార్
  • త్యాగరాజు
  • ఎం. ప్రభాకర్ రెడ్డి
  • వేణు మాధవ్
  • రామకృష్ణారావు
  • జయశ్రీ

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: టి.మాధవరావు
  • స్టూడియో: శ్రీ కాకతీయ పిక్చర్స్
  • ఛాయాగ్రాహకుడు: జి.వి.ఆర్. యోగానంద్;
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
  • విడుదల తేదీ: మార్చి 11, 1977
  • కథ: దాశరథి రంగచార్య;
  • సంభాషణ: దాశరథి రంగచార్య
  • గాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం. నరసింహ మూర్తి, వి.రామకృష్ణ దాస్
  • ఆర్ట్ డైరెక్టర్: చంద్ర;
  • డాన్స్ డైరెక్టర్: రాజు (డాన్స్), శేషు

పాటలు

మార్చు
  • కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • పాడాలనే ఉన్నదీ వినిమెచ్చె మనిషుంటే, రచన: ఆత్రేయ, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఎటికేతం బట్టి యెయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా, రచన: ఎం.నరసింహమూర్తి
  • శ్రీలక్ష్మి నీ మహిమలూ చిత్రమై తోచునమ్మా, గానం. పులపాక సుశీల
  • గుడిసెనక గుడిసేదానా, రచన: ఆత్రేయ, గానం.వి.రామకృష్ణ
  • లబ్బరి బొమ్మ జరచూసుకొని, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల.

మూలాలు

మార్చు
  1. "Chillara Devullu (1977)". Indiancine.ma. Retrieved 2020-08-31.

2.ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog.