చుంచుపల్లి (భద్రాద్రి కొత్తగూడెం)

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం లోని జనగణన పట్టణం

చుంచుపల్లి, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చుంచుపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.గ్రామంలో ఎపి గ్రామీణ వికాస బ్యాంకు,మండలరెవెన్యూ కార్యాలయం,పోలీసు స్టేషను ఇతర ప్రభుత్వ కార్యాలయలు ఉన్నవి.

జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5187 ఇళ్లతో, 19,944 జనాభాతో 8.50 కి.మీ. విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9,877, ఆడవారి సంఖ్య 10,067.

2001 భారత జనాభా లెక్కల ప్రకారం చుంచుపల్లf జనాభా 18,967. ఇందులో పురుషులు 50%, స్త్రీలు 50% ఉన్నారు. చుంచుపల్లి సగటు అక్షరాస్యత రేటు 70%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 76%, స్త్రీ అక్షరాస్యత 63%. చుంచుపల్లిలో, జనాభాలో 11%  6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.సవరించు

లోగడ చుంచుపల్లి గ్రామం ఖమ్మం జిల్లా,కొత్తగూడెం రెవిన్యూ డివిజను, కొత్తగాడెం మండలానికి చెందిన గ్రామం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చుంచుపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తిరిగి కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధి క్రింద (1+3) నాలుగు గ్రామాలతో నూతన మండల ప్రధాన కేంధ్రంగా  ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2017-12-22.

బయటి లింకులుసవరించు