చుంచుపల్లి మండలం
చుంచుపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 4 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ మండలం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని,కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండల కేంద్రం చుంచుపల్లి.
చుంచుపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, చుంచుపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°31′25″N 80°36′15″W / 17.52361°N 80.60417°W | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | చుంచుపల్లి |
గ్రామాలు | 4 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 115 km² (44.4 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 43,360 |
- పురుషులు | 21,598 |
- స్త్రీలు | 21,762. |
అక్షరాస్యత (2016) | |
- మొత్తం | 69.14% |
పిన్‌కోడ్ | 507101 |
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
మార్చుగతంలో చుంచుపల్లి గ్రామం ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధిలోని కొత్తగూడెం మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చుంచుపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధిలో 4 (1 +3) (నాలుగు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 115 చ.కి.మీ. కాగా, జనాభా 43,360. జనాభాలో పురుషులు 21,598 కాగా, స్త్రీల సంఖ్య 21,762. మండలంలో 11,135 గృహాలున్నాయి.[4]
సమీప మండలాలు
మార్చుచుంచుపల్లికి పశ్చిమాన టేకులపల్లి మండలం, దక్షిణం వైపు జూలూరుపాడు మండలం, తూర్పు వైపు పాల్వంచ మండలం, దక్షిణం వైపు చంద్రుకొండ మండలం ఉన్నాయి.
సమీప పట్టణాలు
మార్చుకొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం పట్టణాలు చుంచుపల్లికు సమీపంలో ఉన్నాయి.
ప్రయాణ సౌకర్యాలు
మార్చురైలు మార్గం
మార్చుబేతంపూడి రైల్వే స్టేషన్, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ చుంచుపల్లికు చాలా దగ్గరలో ఉన్నాయి.
రోడ్డు మార్గం
మార్చుకొత్తగూడెం నుండి చుంచుపల్లికు రహదారి అనుసంధానం ఉంది
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2022-01-06. Retrieved 2020-06-23.
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.