చెట్టిచెర్ల
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
చెట్టిచెర్ల ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని గ్రామం[1].
చెట్టిచెర్ల | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°31′46.632″N 79°6′3.996″E / 15.52962000°N 79.10111000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | బేస్తవారిపేట |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ తిగిరెడ్డి భూపాలరెడ్డి సర్పంచిగా ఎన్నికైనారు. [3]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం
మార్చుఈ గ్రామంలో 2013 డిసెంబరు 14 నుండి 16 వరకూ, శ్రీ పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ పూజలు జరిగినవి. పండితులు యంత్ర, నాగప్రతిష్ఠలు, కలశ స్థాపన చేశారు. కుంభాభిషేకం, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. 3 పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. [4]
శ్రీ కాశినాయనస్వామివారి ఆలయం
మార్చుఈ ఆలయంలో 2017, ఫిబ్రవరి-1వతేదీ బుధవారంనాడు, స్వామివారి వార్షిక ఆరాధన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, అఖండ దీపారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రద్యోషకాల పూజ, ధార్మిక ఉపన్యాసం చేశారు. కులుకు భజన, చింతామణి నాటకాన్ని ప్రదర్శించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [5]
గ్రామ విశేషాలు
మార్చు2017, జూన్లో ప్రకటించిన జె.ఇ.ఇ. అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో ఈ గ్రామానికి చెందిన బొజ్జ సాయివంశీధరరెడ్డి, ఆలిండియా ఓపెన్ క్యాటగిరీ విభాగంలో 208వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల నిర్వహించిన జె.ఇ.ఇ. మెయిన్స్ లోనూ 310వ ర్యాంక్ సాధించాడు. ఈ విద్యర్ధి 2017 ఆంధ్రా, తెలంగాణా ఎం.సెట్.పరీక్షలలోనూ 45వ ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి శ్రీ విశ్వనాథరెడ్డి, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇతని తల్లి శ్రీమతి సుజాత. [6]
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[3] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 12వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2013, డిసెంబరు-17; 5వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-2; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-13; 11వపేజీ.