చెన్నకేశవరెడ్డి

చెన్నకేశవరెడ్డి, 2002లో విడుదలైన ఒక తెలుగు సినిమా. రాయలసీమ ఫ్యాక్షన్ వేపధ్యంలో ఆ సమయంలో వెలువడిన అనేక చిత్రాల పరంపరలో ఇది కూడా ఒకటి. ఇందులో నందమూరి బాలకృష్ణ "చెన్నకేశవరెడ్డి" అనే స్థానిక నాయకుడిగాను, అతని కొడుకైన పోలీస్ ఇనస్పెక్టర్ గాను రెండు పాత్రలు పోషించాడు. చెన్నకేశవరెడ్డి స్థానికంగా పలుకుబడి కలిగిన ఒక నాయకుడు. అతని ప్రత్యర్ధులు అతనిని ఒక కేసులో ఇరికించి విచారణ కానీయకుండా మెలికపెట్టి సంవత్సరాల తరబడి తీహార్ జైలులో ఉండేలా చేస్తారు. అతని శ్రేయోభిలాషులు అతని కొడుకును రాయలసీమకు దూరంగా పెంచుతారు. తరువాత చెన్నకేశవరెడ్డి జైలునుండి విడుదలై తిరిగి తన ఇలాకాపై ఆధిపత్యం చెలాయించడం, అతనిని అదుపులో ఉంచడానికి అతని కొడుకునే ప్రభుత్వం అక్కడ నియమించడం ఈ చిత్రంలో క్లైమాక్సుకు దారి తీస్తాయి.

చెన్నకేశవరెడ్డి
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.వి.వినాయక్
నిర్మాణం బెల్లంకొండ సురేష్
తారాగణం నందమూరి బాలకృష్ణ
టాబు
శ్రియా
జయప్రకాశ్ రెడ్డి
దేవయాని (నటి)
చలపతి రావు
ఆహుతి ప్రసాద్
రఘుబాబు
బ్రహ్మానందం
ఆలీ
ఎల్. బి. శ్రీరాం
ఎమ్మెస్ నారాయణ
వేణుమాధవ్
సంగీతం మణిశర్మ
సంభాషణలు పరుచూరి సోదరులు
నిర్మాణ సంస్థ శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు మార్చు

  • డోంట్ కేర్ - రచన: చంద్రబోస్ - గానం: శంకర్ మహదేవన్
  • హాయ్.. హాయ్..- రచన: వేటూరి - గానం: ఎస్.పి., సునీత
  • బకరా.. బకరా.. - రచన: చంద్రబోస్ - గానం: ఉదిత్ నారాయణ్
  • నీ కొప్పులోన - రచన: శ్రీనివాస్ - గానం: ఎస్.పి., కౌసల్య
  • ఊరంతా ఉత్సవం - రచన: సీతారామశాస్త్రి - గానం: ఎస్.పి., సుజాత
  • తెలుపు.. తెలుపు - రచన: చంద్రబోస్ - గానం: ఎస్.పి., చిత్ర.

మూలాలు మార్చు