టబు

భారతీయ సినీ నటి
(టాబు నుండి దారిమార్పు చెందింది)

టబు హైదరాబాదులో పుట్టి ముంబైలో స్థరపడిన సినిమా నటి. ఈమె నటి ఫరాహ్ చెల్లెలు, నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది.[1]

టబు
జననం
తబస్సుమ్ ఫాతిమా హష్మి

(1971-11-04) 1971 నవంబరు 4 (వయసు 52)
ఇతర పేర్లుటబు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1980,1985, 1991, 1994 – ప్రస్తుతం

నేపధ్యము

మార్చు

అసలు పేరు తబుస్సుమ్ హష్మి. 1971 నవంబరు 4న హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి జమాల్ అలీ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె తల్లి ఒక పాఠశాల అధ్యాపకురాలు. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకొంది. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది. నిన్నటితరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాజ్ కూడా టబుకి బంధువు అవుతారు.

నటజీవితము

మార్చు

1980లోనే కెమెరా ముందుకెళ్లింది. 'బజార్' అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత ఐదేళ్లకు 'హమ్ నే జవాన్' లో దేవానంద్‌కి కూతురిగా నటించింది. పద్నాలుగేళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకొంది. బోణీకపూర్ తన సంస్థలో నిర్మించనున్న 'రూప్‌కీ రాణీ చోరోంకా రాజా', 'ప్రేమ్' చిత్రాల కోసం టబుని కథానాయికగా ఎంపిక చేసుకొన్నాడు. 'ప్రేమ్'లో సంజయ్‌కపూర్ సరసన నటించింది టబు. అయితే ఆ చిత్రం పూర్తి కావడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టింది. సుదీర్ఘకాలం తర్వాత విడుదలైనా, ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో టబుకి ఏ మాత్రం కలిసిరాలేదు

తెలుగు సినీరంగ ప్రవేశము

మార్చు

'కూలీ నెంబర్ 1' చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. దగ్గుబాటి వెంకటేష్ సరసన నటించిన టబు గురించి తెలుగు ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. అంతలోనే హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది. 'విజయ్‌పథ్'లో అజయ్ దేవగణ్ సరసన నటించి తొలి విజయాన్నందుకొంది. ఇక ఆ చిత్రం తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. 'సాజన్ చలే ససురాల్', 'జీత్' చిత్రాలు ఆమెని స్టార్ కథానాయికని చేశాయి. 90వ దశకమంతా బాగా కలిసొచ్చింది. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించింది. హిందీలో చేసిన 'మాచీస్' చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపానీ చేసింది. అది కూడా గుర్తింపును తీసుకురావడంతోపాటు తమిళంలో అవకాశాల్ని తెచ్చిపెట్టింది.

కథానాయికగా టబు తెలుగుపై చెరగని ముద్ర వేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా, టబు అనగానే తెలుగు ప్రేక్షకులు 'మా కథానాయికే' అంటుంటారు. 'కూలీ నెంబర్ 1' తర్వాత చాలా రోజులకి 'నిన్నే పెళ్లాడతా'లో నటించింది. సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత 'చెన్నకేశవరెడ్డి', 'ఆవిడా మా ఆవిడే', 'అందరివాడు', 'పాండురంగడు', 'ఇదీ సంగతి' తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె తమిళంలో నటించిన 'కాదల్ దేశమ్' తెలుగులో 'ప్రేమదేశం'గా విడుదలై ఘనవిజయం అందుకొంది.

ఆమె ఆచితూచి కథల్ని ఎంచుకొంటుంది. మనసుకు నచ్చిన పాత్రల్లోనే నటిస్తుంది. దర్శకుడు, నిర్మాత తదితర విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నటిస్తుంది. అందుకే ఆమె ప్రయాణం కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంటుంది. 'బార్డర్', 'విరాసత్', 'బివి నెంబర్ 1', 'హమ్ సాథ్ సాథ్ హై', 'హేరా ఫేరీ', 'అస్తిత్వ', 'చాందినీ బార్', 'మక్బూల్', 'చీనీ కమ్' తదితర చిత్రాలతో ఆమె ప్రయాణం బిజీబిజీగా సాగింది. తమిళంలోనూ 'కాదల్ దేశమ్', 'కండుకొండేన్ కండుకొండేన్'లాంటి సినిమాలు చేసింది. మలయాళంలో 'స్నేగితీయే', 'ఉరుమి'లాంటి చిత్రాల్లో నటించింది బెంగాలీ, మరాఠీ చిత్రాల్లోనూ నటించి తన అభిరుచిని చాటింది.

అంతర్జాతీయ చిత్రాలు

మార్చు

మీరానాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంగ్ల చిత్రం 'ది నేమ్‌సేక్'లో టబు కీలక పాత్ర పోషించింది. 2012లో విడుదలైన 'లైఫ్ ఆఫ్ పై'లోనూ ఓ కీలక పాత్ర పోషించి అలరించింది. టబు హిందీలో చేసిన 'చీనీకమ్' కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణను చూరగొంది. ఆ చిత్రానికి అమెరికా, ఇంగ్లండ్‌లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారత ప్రభుత్వం టబుకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. పలు అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఆమెని వరించాయి.

వ్యక్తిగత జీవితము

మార్చు

టబు ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఆమె ప్రేమలో పడిందని పలు మార్లు మీడియాలో ప్రచారం సాగింది. అక్కినేని నాగార్జునతో సన్నిహితంగా మెలుగుతోందని, బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాతోనూ బంధం ఉందని అంటుంటారు. అయితే టబు మాత్రం, నా బాయ్‌ఫ్రెండ్స్ అంటూ చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తుంటాయి. బాయ్‌ఫ్రెండ్స్ ఎంతమందైనా రావొచ్చు, పోవచ్చు.

అభిరుచులు

మార్చు

ఒక పత్రికా ముఖాముఖి లో తన అభిరుచులను ఈ విధముగా తెలియజేసింది.

టబు నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
1985 హమ్‌ నౌజవాన్ ప్రియ హిందీ బాలనటి
1991 కూలీ నెం 1 రంజని తెలుగు
1994 పెహలా పెహలా ప్యార్ సప్న ఉర్దూ
1994 విజయ్‌పథ్ మోహిని "మోనా" హిందీ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి
1995 ప్రేమ్ లచి/సోనియా జైట్లీ హిందీ
1995 సాజన్ కీ బాహోమే కవిత హిందీ
1995 సిసింద్రీ తెలుగు ప్రత్యేక గీతం
1995 హకీకత్ సుధ హిందీ
1996 సాజన్ చలే ససురాల్ దివ్య ఖురానా హిందీ
1996 కాలాపానీ పార్వతి మలయాళం Dubbed into Tamil as Siraichalai, Telugu as Kalapani and Hindi as Saza E Kalapani.
1996 కాదల్ దేశం దివ్య తమిళం తెలుగు లో ప్రేమదేశం గా విడుదలైంది
1996 హిమ్మత్ అంజు హిందీ
1996 తూ చోర్ మై సిపాహి కాజల్ హిందీ
1996 జీత్ తుల్సి హిందీ Special appearance
ప్రతిపాదన–ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటి
1996 నిన్నే పెళ్లాడుతా మహాలక్ష్మీ తెలుగు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి
1996 మాచిస్ వీరేంద్ర హిందీ m:en:National Film Award for Best Actress
ప్రతిపాదన–ఫిలింఫేర్ ఉత్తమ నటి
1997 విరాసత్ జెహ్నా హిందీ Filmfare Award for Best Actress (Critics' Choice)
Nominated–Filmfare Award for Best Actress
1997 దర్మియా చిత్ర హిందీ
1997 బోర్డర్ కులదీప్ భార్య హిందీ
1997 ఇరువర్ సెంతామరై తమిళ్ తెలుగులో ఇద్దరుగా విడుదల
1998 తాయిన్ మణికొండి రాణి తమిళ్
1998 చాచి 420 జానకి పాశ్వాన్ హిందీ
1998 ఆవిడా మా ఆవిడే అర్చన తెలుగు
1998 2001:దో హజార్ ఏక్ బిల్లు హిందీ
1998 హనుమాన్ అంజ ఆంగ్లము
1999 కొహ్రామ్ ఇన్స్పెక్టర్ కిరణ్ పాక్టర్ హిందీ
1999 హం సాథ్ సాధ్ హై సాధన హిందీ
1999 హు తు తు పన్నా హిందీ Filmfare Award for Best Actress (Critics' Choice)
Nominated–Filmfare Award for Best Actress
1999 బీవీ నెంబర్ 1 లవ్లీ హిందీ
1999 తక్షక్ సుమన్ హిందీ
2000 స్నేగితియే ACP గాయత్రి తమిళ్
2000 కవర్ స్టోరీ జాస్మిన్ మలయాళం
2000 హేరా ఫేరీ అనురాథా శివశంకర్ పనికర్ హిందీ
2000 కండుకొండేన్ కండుకొండేన్ సౌమియ తమిళ్ తెలుగులో ప్రియురాలు పిలిచింది
2000 తక్రీబ్ రోషిణి చౌబే హిందీ
2000 దిల్ పే మత్ లే యార్ కామ్యా లాల్ హిందీ
2000 షికారి సుమన్ హిందీ
2000 అస్తిత్వ అదితి మరాఠీ Filmfare Award for Best Actress (Critics' Choice)
Nominated–Filmfare Award for Best Actress
2000 ఘాత్ కవిత చౌదరి హిందీ
2001 దిల్ నే ఫిర్ యాద్ కియా రోష్నీ బాత్రా హిందీ
2001 చాందినీ బార్ ముంతాజ్ అలీ అంసారీ హిందీ National Film Award for Best Actress
Nominated–Filmfare Award for Best Actress
2001 ఆందాని ఆఠనా ఖర్చా రుపయా మీనా హిందీ తెలుగు క్షేమంగా వెళ్ళి లాభంగా రండికి హిందీ పునర్నిర్మాణం
2002 మా తుఝే సలాం కెప్టెన్ సోనియా ఖన్నా హిందీ
2002 ఫిల్‌హాల్... రేవా సింగ్ హిందీ
2002 చెన్నకేశవరెడ్డి సీత తెలుగు
2002 జిందగీ ఖూబ్‌సూరత్ హై షాలు హిందీ
2002 సాధియా సావిత్రీ రావు హిందీ అతిథి పాత్ర
2003 అబర్ అరణ్య అమ్రిత బెంగాలీ
2003 ఖంజర్: ది నైఫ్ శిల్ప హిందీ
2003 హవా సంజన హిందీ
2003 జాల్ ది ట్రాప్ నేహా పండిట్ హిందీ
2003 మక్బూల్ నిమ్మి హిందీ
2004 మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ మీనాక్షి/మరియా హిందీ
2005 సిల్‌సిలే రెహానా హిందీ
2005 భాగ్‌మతి భాగ్‌మతి హిందీ
2005 అందరివాడు శాంతి తెలుగు
2006 షాక్ (సినిమా) Geetha తెలుగు
2006 ఫనా మాలిని త్యాగి హిందీ
2007 సర్‌హద్ పార్ పమ్మి హిందీ
2007 ది నేమ్‌ సేక్ ఆషిమా గంగూలీ ఆంగ్లము
2007 చీనీ కమ్ నీనా వర్మ హిందీ Filmfare Award for Best Actress (Critics' Choice)
2007 ఓం శాంతి ఓమ్ స్వీయ పాత్ర హిందీ Special appearance in song "Deewangi Deewangi"
2007 రాకిల్ పట్టు గాయత్రీ వర్మ మలయాళం
2008 ఇదీ సంగతి స్వరాజ్య లక్ష్మి తెలుగు
2008 పాండురంగడు అమృత తెలుగు Nominated—m:en:Filmfare Award for Best Supporting Actress – Telugu
2010 తో బాత్ పక్కీ రాజేశ్వరి హిందీ
2010 ఖుదా కసమ్ నీతు సింగ్ హిందీ
2011 ఉరుమి మలయాళం Special appearance in song "Aaranne Aarane"
2012 లైఫ్ ఆఫ్ పై గీత పటేల్ ఆంగ్లము
2013 డేవిడ్ ఫ్రెన్నీ హిందీ
2013 డేవిడ్ తమిళ్
2014 జై హో గీతా అగ్నిహోత్రి హిందీ
TBA బందా యే బిందాస్ హై హిందీ చిత్రీకరణ జరుగుతున్నది
2014 యాంగ్రీ బర్డ్ మలయాళం చిత్రీకరణ జరుగుతున్నది
2014 హైదర్ హిందీ చిత్రీకరణ జరుగుతున్నది
2020 అల వైకుంఠపురములో టబు తెలుగు
2022 భూల్ భులయా 2 కనికా శర్మ హిందీ
2024 క్రూ

పురస్కారాలు

మార్చు

సైమా అవార్డులు: ఉత్తమ సహాయనటి

  1. 2020: అల వైకుంఠపురములో
  1. Andhrajyothy (14 April 2024). "అలుపెరుగని ప్రయాణం". Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=టబు&oldid=4186586" నుండి వెలికితీశారు