చెన్నకేశవస్వామి

చెన్నకేశవ స్వామి అనగా శ్రీకృష్ణుడు. చెన్న అనగా అందమైన అని అర్థం. అందువలన చెన్నకేశవుడు అనగా మేలైన కేశములు కలవాడు అని అర్థం. వేరొక అర్థంలో కేశి అను రాక్షసిని సంహరించినవాడని పెద్దవారు చెబుతారు. 'కేశులు' అనగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు.... వారిని తన వశమందుంచుకున్నవాడు కేశవుడు.. కావున కేశవుడు అనగా త్రిమూర్తులు ఒకటైన ఆనందస్వరూపుడు.

చిన గోల్కొండలో వెలసి ఉన్న చెన్నకేశవస్వామి

చెన్న కేశవ స్వామి చరిత్ర మార్చు

శ్రీ చెన్నకేశవుడు తెలుగునాట 10శతాబ్దంలో అవతరించిన దేవతా సార్వభౌముడు. పల్నాటి వీరుల కొలుపు లందు కొంటున్నవీర దైవత మూర్తి ఈయన.

  • “ శంఖ చక్ర గదా పద్మ ధారిణే దోషహారిణే * పరతత్త్వ స్వరూపాయ పంచవ్యూహాయ మంగళమ్.!”అంటూ భక్తకోటి చే మంగళాశాసనాలందుకొంటున్న ఆర్తులపాలిట ఈ కొంగుబంగారం
  • పురాణ వాజ్ఞ్మయం లో కన్పించడంలేదనే కొందరి సందేహం. “ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి” అని చతుర్వింశతి కేశవనామాలతో నిత్యము శ్రీ మహావిష్ణువుని ఆరాధించే ముముక్షువులు చెన్నకేశవుని మోహనరూపాన్ని చూచి మురిసిపోతున్నారు.
జితకోటి స్మరోత్తజ్ఞ సౌందర్యాజ్ఞ విలాసినే
బ్రహ్మాండ సార్వభౌమాయ భవ్యవృత్తాయ మంగళమ్.!

” అంటూ కైమోడ్పు లర్పిస్తున్నారు. శంఖ చక్ర గదాధారుడై పద్మాంకిత అభయహస్తం తో ఆర్తజనులను ఆదుకొనే స్వామి చెన్నకేశవుడు. “పుంసాం మోహనరూపుడైన” ఆ ఆది నారాయణమూర్తి రూపమే జగన్మోహనx కాగా ఆయనయే జగన్మోహిని యైతే ఆది శంకరుడే మెత్తని చిత్తము కలవాడైనాడని భాగవతం చెపుతోంది.

  • సుందరరూపుడైన కేశవుని సృజించడానికి మహాకవులు చేసిన ప్రయత్నమే 10 వ శతాబ్దం చివర లోనే మహాశిల్పులు చేసి నిరూపించారు.అమరశిల్పి జక్కన అద్భుతసృష్టి బేలూరు చెన్నకేశవాలయం. హోయసల రాజుల నిర్మాణంగా బేలూరు చెన్నకేశవాలయం చరిత్రలో పేరు పొందింది. వీరి పరిపాలనా కాలం 10, 11 శతాబ్దుల మధ్య భాగంగా పరిశోధకులు నిరూపించారు.
  • “చెన్ను” శబ్దము నిఘంటువులలో అందము,కాంతి,విధము, సౌందర్యము అనే అర్ధాలలో చెప్పబడింది.”చెన్నుడు అంటే అందగాడు “అని కూడ స్పష్టంగా ఆంద్రదీపిక చెపుతోంది. కేశవుని అత్యంత సుందరరూపుని గా తీర్చిదిద్ది చెన్నకేశవుని చేసిన ఖ్యాతి అపూర్వమై, , హోయసల రాజుల కీర్తి ని అజరామరం చేసింది.
  • శంఖ చక్రాలను కుడి ఎడమ చేతుల్లో తారుమారు గాధరించి, గదాధారుడై, అభయహస్తంలో పద్మాన్ని దాల్చిన సుందరరూపుడైన చెన్నకేశవుడు దక్షణ భారతం లో దర్శన మిస్తున్నాడుస
  • కార్యమపూడి యుద్దరంగంలో” జై చెన్నకేశవా”! నినాదం దిక్కుల పిక్కటిల్లిన కాలం శా.శ 1098-1104 మధ్యకాలంగా చరిత్ర చెపుతోంది. అంటే పల్నాటి యుద్ధం 11 వ శతాబ్దం లోనిది. కాగా చెన్నకేశవుడు పల్నాటి వీరుల ఇలవేల్పుగా కన్పిస్తాడు.
  • చెన్నుడు అంటే మాచర్ల చెన్నుడు అని నిఘంటువులు చెపుతున్నాయి. అంటే పల్నాటి వీర చరిత్రకు – తెలుగునాట చెన్నకేశవ ప్రాదుర్భావానికి సంబంధం ఉన్నదనేది యథార్థం.
  • చెన్నబసవడు వీరశైవ మత బోధకుడుగా చారిత్రక వ్యక్తి. ఈయనను కుమారస్వామి అవతారంగా వీరశైవులు భావిస్తారు.
  • 11 వశతాబ్దం ఉత్తర భాగం 12 వ శతాబ్దం చివరి భాగం వరకు ఆంధ్రదేశచరిత్రలో రాజకీయంగా, మతపరంగా కూడా మిక్కిలి చెడ్డకాలంగా చరిత్ర చెపుతోంది.శైవ వైష్ణవ భేదాలు తారాస్ధాయిని అందుకున్నాయి. పల్నాటి యుద్ధమే శైవ వైష్ణవ తగాదాల వలన సంభవించిందన్నంతగా ఈ పరిణామం వ్యాపించింది.” నాగమ్మ” శైవాన్ని సమర్ధించగా,” బ్రహ్మన్న” వైష్ణవాన్ని పోషించాడు. చెన్నమల్లిఖార్జునుడు చెన్నబసవడు వీరశైవులకు ఆరాధ్యదైవాలు కాగా,----వైష్ణవులు చెన్నకేశవుని దర్శించి, పూజించి, తరించారు.

చెన్నకేశవాలయాలు మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.