చెన్నబోయిన కమలమ్మ

చెన్నబోయిన కమలమ్మ ( 1926 - మార్చి 11, 2018 ) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు.[1][2]

చెన్నబోయిన కమలమ్మ
జననం
చెన్నబోయిన కమలమ్మ

1926
మరణంమార్చి 11, 2018
వృత్తితెలంగాణ సాయుధ పోరాట యోధురాలు
జీవిత భాగస్వామిచెన్నబోయిన ముకుందం
తల్లిదండ్రులు
  • రంగారావు (తండ్రి)
  • రంగమ్మక (తల్లి)

జననంసవరించు

ఈమె 1926 లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, నైనాల గ్రామంలో రంగారావు, రంగమ్మ దంపతులకు జన్మించింది.

జీవిత విశేషాలుసవరించు

చిన్నతనంలోనే మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన చెన్నబోయిన ముకుందంతో వివాహం జరిగింది. నాడు గ్రామాల్లో కొనసాగుతున్న నిజాం నిరంకుశత్వం నిరసిస్తూ పోరాటానికి సిద్ధమయ్యారు. భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు మద్దికాయల ఓంకార్ నాయకత్వంలో భర్త అప్పన్నతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అయితే అప్పటికే ఆమెకు ఒక కుమారుడు ఉండగా, అత్త ఇంటి వద్ద వదిలేసి పోరాటంలో నిమగ్నమైంది. ఇదే క్రమంలో కొన్నాళ్ల తర్వాత పోరాట గమనంలో కమలమ్మ దంపతులకు రెండో కుమారుడు జన్మించాడు. ఈ సమయంలో సాయుధ పోరాటం త్రీవ స్థాయిలో ఉంది. పసిగుడ్డును ఎవరికైనా ఇవ్వాలంటూ పార్టీ తీర్మానించింది. దీంతో కమలమ్మ రక్త సంబంధం కన్నా, వర్గ సంబంధమే విలువైనదిగా భావించి దంపతులిద్దరూ ప్రజారక్షణ, సాయుధ దళాల ప్రాణాలే ముఖ్యమంటూ పసికందును అడవిలో ఒక గుర్తు తెలియని కోయ జాతి కుటుంబానికి దానం చేశారు. ఈమె ఆలపించిన విప్లవ గీతాలు, జానపదాలు ప్రజలను ఉర్రూతలూగించాయి. ఇందులో సై...సై... గోపాలరెడ్డి.. నీవు నిలిచావూ ప్రాణాలొడ్డి.. తిరునగరి రామాంజనేయులు (ఆనాటి ఆజ్ఞాత కవి) వీరోచిత స్మారక గేయం దేశవ్యాప్తంగా పీడిత ప్రజల గుండెల్లో మారుమోగింది. వృద్ధాప్యంలో కూడా నిజాం నిరంకుశత్వంపై అనేక పాటలు ఆలపించారు.[3]

తెలంగాణ ప్రభుత్వం ఈమె చరిత్రను 8, 9 వ తరగతి సాంఘికశాస్త్రం పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చారు. అలాగే గతంలో ఈమెను నోబెల్ బహుమతికి అర్హురాలుగా పేర్కొంటూ జాతీయ మహిళా సమాఖ్య ప్రతిపాదించింది. కాని అనివార్య కారణాలతో యిది నిలిచిపోయింది. ఈమె ఉద్యమ జీవితాన్ని రష్యా, జర్మనీ దేశాలు పుస్తకాలలో పొందుపరిచాయి.[4]

పురస్కారాలుసవరించు

  • మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2016 లో తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారంతో సత్కరించింది.[5]

మరణంసవరించు

ఈమె మార్చి 11, 2018 రోజున కిడ్నీ సంబంధ వ్యాధితో హైదరాబాద్ లోని కామినేని ఆస్పత్రిలో మరణించింది.[6]

ఇవి కూడ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "వీరనారి కమలమ్మ..!". /www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 13 March 2018.
  2. నవతెలంగాణ, మానవి, స్టోరి (22 March 2018). "ఆమె త్యాగం అమర జ్ఞాపకం". Retrieved 22 March 2018.
  3. "Chennaboina Kamalamma: An embodiment of sacrifice, fighting spirit & freedom". www.thehansindia.com. Retrieved 13 March 2018.
  4. "సాయుధ పోరాట యోధురాలు కమలమ్మ కన్నుమూత". www.manamnews.com. మనంన్యూస్. Retrieved 13 March 2018.[permanent dead link]
  5. "తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు కమలమ్మ కన్నుమూత". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 13 March 2018.
  6. "సాయుధ పోరాట యోధురాలు కమలమ్మ ఇకలేరు". www.andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 13 March 2018.[permanent dead link]