చెన్నుపాటి శేషగిరిరావు

పారిశ్రామిక వేత్త

చెన్నుపాటి శేషగిరిరావు పారిశ్రామిక వేత్త, నాస్తికోద్యమ నాయకులు, సామాజిక కార్యకర్త.[1]

చెన్నుపాటి శేషగిరిరావు

జీవిత విశేషాలు

మార్చు

శేషగిరిరావు 1920 జూన్ 20న విజయవాడ సమీపంలోని పటమట లంక గ్రామంలో అంజయ్య, రంగమ్మ దంపతులకు జన్మించాడు.[2]

ఆయన మోటారు రవాణా రంగంలో పనిచేసారు. ఆయన భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆయన కులాంతర వివాహాలను చేసి, లౌకిక, మానవతా వాదానికి బలమైన పునాదులు వేసారు. బహుముఖ వ్యక్తిత్వం మూలంగా ఆయన కుస్తీ క్రీడాకారుడైనందున కుస్తీ పోటీలకు రిఫరీగా కూడా వ్యవహరించారు. ఆయన న్యూఢిల్లీలో జరిగిన మొదటి ఆసియా క్రీడలలో పాల్గొన్నారు. కుస్తీ విభాగంలో మూడవ స్థానం పొందారు. ఆయన యువతను దుర్గుణాలనుండి దూరం చేయుటకు మహాత్మా గాంధీ హెల్త్ సెంటరును ప్రారంభించి ప్రకృతి వైద్యం చేయడానికి పూనుకున్నారు. ఆయన రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా పనిచేసారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కు సభ్యునిగా ఉన్నరు. 2000 లో న్యూఢిల్లీలో జరిగిన మోటారు ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ ఆయనను "మోటారు రత్న" అవార్డును అందజేసింది.[1]

సామాజిక సేవ

మార్చు

శేషగిరిరావు కూడా స్ర్తి విద్యకోసం, వారి ఆర్థిక స్వాతంత్య్రంకోసం కృషి చేశారు. అటువంటి వారి కృషి ఫలితమే నేడు సంఘంలో స్ర్తి గౌరవంగా జీవించడానికి దోహదపడుతుంది. అప్పట్లలోనే మహిళామండలికి తన స్వంత స్థలాన్ని ఇచ్చి మహిళాభ్యున్నతికి శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి ఆయన. నాలుగున్నర దశాబ్దాల క్రితం నిస్సహాయస్థితిలో వున్న స్ర్తిల సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతి సాధించాలని తద్వారా వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి, మేలైన భారతావనిని నిర్మించడానికి శేషగిరిరావు కృషి చేశారు. ఆయన భార్య చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు గారి కుమార్తె. 1950 లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[1][3]

ఆయన జూలై 18 2008 న గుండెపోటుతో మరణించారు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Well known social worker Seshagiri Rao passes away". one india. Retrieved 19 July 2008.
  2. "Chennupati Seshagiri Rao". Archived from the original on 2017-02-12. Retrieved 2019-06-10.
  3. మాజీ రాష్టప్రతి వివి గిరి కోడలు మోహినిగిరి[permanent dead link]

ఇతర లింకులు

మార్చు