ప్రధాన మెనూను తెరువు

చెన్నుపాటి విద్య

భారత పార్లమెంటు సభ్యురాలు

చెన్నుపాటి విద్య (Chennupati Vidya) భారత పార్లమెంటు సభ్యురాలు[1] మరియు సంఘ సేవిక.

చెన్నుపాటి విద్య
చెన్నుపాటి విద్య

చెన్నుపాటి విద్య


పదవీ కాలము
1980 - 1984 and 1989 - 1991
ముందు గోడే మురహరి
తరువాత వడ్డే శోభనాద్రీశ్వరరావు
నియోజకవర్గము విజయవాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1934-06-05) 1934 జూన్ 5 (వయస్సు: 85  సంవత్సరాలు)
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్, India
మరణం ఆగష్టు 18, 2018
విజయవాడ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి చెన్నుపాటి శేషగిరిరావు
సంతానము 1 కుమారుడు; 3 కుమార్తెలు

ఈమె ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు; గోరా కుమార్తె. ఈమె విజయనగరంలో 1934 జూన్ 5 తేదీన జన్మించింది. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నది. ఈమె చెన్నుపాటి శేషగిరి రావు గారిని 1950 లో వివాహం చేసుకున్నది. వీరికి ఒక కుమారుడు మరియు ముగ్గురు కుమార్తెలు.

రాజకీయ రంగప్రవేశంసవరించు

1974లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు కాంగ్రేస్ పార్టీ తరఫున పోటీ చేయటానికి విద్య అభ్యర్థిత్వం ఖరారయింది. కానీ అప్లికేషన్లో కులం, మతం అనే కాలమ్‌లో "నిల్" అని పెట్టడంతో కాంగ్రెస్ టికెట్టు రాలేదు. దీనిపై ఆగ్రహించి, ఈ విషయాన్ని ఇందిరా గాంధీ దృష్టికి తీసుకెళుతూ "కులాలు, మతాలు అవసరం లేని రోజున, ఓ కాంగ్రెస్ కార్యకర్తగా నా సేవలు కావాల్సినపుడు, నన్ను పిలవండి.. అంతవరకూ నేను ఏ పదవి కోసం, టిక్కేట్టు కోసం దరఖాస్తు చేయను" అని ఖరాఖండిగా లేఖ వ్రాయగా ఆ లేఖ ఇందిరా గాంధీపై బలమైన ముద్ర వేసింది. అలా మాటకు కట్టుబడి ఏ అభ్యర్థిత్వానికి దరఖాస్తు పెట్టలేదు. అయితే 1979లో ఓ రాత్రి అకస్మాత్తుగా ఇందిరా గాంధీ స్వయానా ఫోన్ చేసి "విజయవాడ ఎంపీ టికెట్ నీకు ఇచ్చాను విద్య... గెట్‌రెడీ" అని చెప్పగా "మేడం ఎంపీగా నేను ఫిట్ అవుతానా?" అని సందేహం వెలుబుచ్చింది. "ఐ థింక్ యూ ఆర్ ది బెస్ట్ ఛాయిస్" అన్న ఇందిరా గాంధీ భరోసాతో పోటీచేసి జనతా పార్టీ అభ్యర్థి కె.ఎల్.రావు పై లక్షపైచిలుకుల ఆధిక్యతతో గెలుపొందింది.[2]

ఈమె విజయవాడ లోకసభ నియోజకవర్గం నుండి 1980లో మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 7వ లోకసభ కు ఎన్నుకోబడింది. తర్వాత మరళ 1989 లో రెండవసారి అదే నియోజకవర్గం నుండి 9వ లోకసభ కు ఎన్నుకోబడింది.

ఈమె ఆంధ్ర ప్రదేశ్ ఖోఖో సమాఖ్య ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలను నిర్వహించారు.

మరణంసవరించు

ఆగష్టు 18, 2018 న విజయవాడలో మరణించారు.

మూలాలుసవరించు