చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై రైల్వే స్టేషను, న్యూ జల్పైగురి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | ||||
స్థితి | ఆపరేటింగ్ | ||||
స్థానికత | పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ & తమిళనాడు | ||||
తొలి సేవ | 29 జనవరి 2011 | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | చెన్నై సెంట్రల్ (MAS) | ||||
ఆగే స్టేషనులు | 18 | ||||
గమ్యం | న్యూ జల్పైగురి (NJP) | ||||
ప్రయాణ దూరం | 2273 కి.మీ. | ||||
సగటు ప్రయాణ సమయం | 40 గం. 45 ని.లు | ||||
రైలు నడిచే విధం | వీక్లీ | ||||
రైలు సంఖ్య(లు) | 22611/22612 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి 2 వ తరగతి (1), ఎసి 3 వ తరగతి (2), స్లీపర్ (10), జనరల్ (6) | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
ఆహార సదుపాయాలు | ఉంది | ||||
బ్యాగేజీ సదుపాయాలు | ఉంది | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ | ||||
వేగం | సరాసరి వేగం - 55 కి.మీ./గం. | ||||
|
జోను, డివిజను
మార్చుఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 22611. ఈ రైలు వారానికి ఒక రోజు బుధవారం నడుస్తుంది.
భోగీలు అమరిక
మార్చురైలు నంబరు: 22611 : చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎసి 2 వ తరగతి (1), ఎసి 3 వ తరగతి (2), స్లీపర్ (10), జనరల్ (6), లగేజి కం రాక్ కోచ్‌లు (2) గార్డు క్యాబిన్ కూర్చొనే విధంగా బోగీలు అమరిక కలిగి ఉంది. ఈ రైలునకు మొత్తం 21 బోగీలు ఉంటాయి.
రైలు డిమాండ్
మార్చుఈ రైలు వారంలో ఒకరోజు ఉన్నప్పటికీ ఈ మార్గంలోని ఒక ప్రముఖ రైలు. టికెట్ల కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ రైలులో ప్రయాణం చేయు టకు ఒక నిర్ధారిత బెర్త్ పొందేందుకు ఒక టికెట్ అనేక రోజుల ముందుగా బుక్ చేసుకోవాలి.[2]
చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారత దేశంలోని నగరాలు అయిన చెన్నై, సిలిగురి కలిపే ఒక సూపర్‌ఫాస్ట్ రైలుగా ఉంది. ఈ రైలు ప్రయాణం చెన్నై సెంట్రల్ నుండి ప్రారంభమై న్యూ జల్పైగురి వద్ద ముగుస్తుంది. ఇది చెన్నై నుండి న్యూ జల్పైగురి వరకు ప్రత్యక్ష రైలు సేవలు సరాసరిగా నడిచే మొదటి రైలు. అంతేకాక తూర్పు, దక్షిణ భారతదేశమును కలుపుతూ, భారతదేశం యొక్క భూభాగాలయిన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ & తమిళనాడు రాష్ట్రాలకు సేవలందిస్తున్నది. ఇది జార్ఖండ్ రాష్ట్రం ద్వారా ప్రయాణించిననూ దీనికి విరామము కలిగిన రైల్వే స్టేషను మాత్రము లేదు.
టైం టేబుల్
మార్చుక్రమ సంఖ్య | స్టేషను & స్టేషను కోడ్ | రోజు | రాక (చేరుకొను సమయం) | పోక (బయలుదేరు సమయం) | దూరం (కి.మీ.) |
---|---|---|---|---|---|
1 | చెన్నై సెంట్రల్ (ఎంఎఎస్) | 1 | 11:00 | 0 | |
2 | నెల్లూరు (NLR) | 1 | 13:40 | 13:41 | 175 |
3 | ఒంగోలు (OGL) | 1 | 15:04 | 15:05 | 291 |
4 | విజయవాడ జంక్షన్ (BZA) | 1 | 17:40 | 17:55 | 430 |
5 | ఏలూరు (EE) | 1 | 18:41 | 18:42 | 489 |
6 | అనకపల్లె (AKP) | 1 | 22:39 | 22:40 | 746 |
7 | దువ్వాడ (DVD) | 1 | 23:40 | 23:42 | 762 |
8 | విశాఖపట్నం (VSKP) | 2 | 0:10 | 0:30 | 780 |
9 | విజయనగరంJN (VZM) | 2 | 1:28 | 1:30 | 841 |
10 | బ్రహ్మపూర్ (BAM) | 2 | 4:35 | 4:37 | 1057 |
11 | ఖుర్దా రోడ్ జంక్షన్ (KUR) | 2 | 6:55 | 7:10 | 1203 |
12 | భువనేశ్వర్ (BBS) | 2 | 7:30 | 7:35 | 1222 |
13 | హిజిల్లి (HIJ) | 2 | 12:07 | 12:12 | 1540 |
14 | బంకుర (BQA) | 2 | 14:06 | 14:08 | 1665 |
15 | అద్రా జంక్షన్ (ADRA) | 2 | 15:00 | 15:10 | 1723 |
16 | అసన్సోల్ జంక్షన్ (ASN) | 2 | 16:15 | 16:25 | 1765 |
17 | దుర్గాపూర్ (DGR) | 2 | 17:25 | 17:45 | 1812 |
18 | రాంపూర్హట్ (RPH) | 2 | 20:26 | 20:31 | 1935 |
19 | మాల్డా టౌన్ (MLDT) | 2 | 23:20 | 23:35 | 2057 |
20 | బర్సోయి జంక్షన్ (BOE) | 3 | 1:00 | 1:02 | 2145 |
21 | కిషన్గంజ్ (KNE) | 3 | 1:51 | 1:53 | 2202 |
22 | న్యూ జల్పైగురి (NJP) | 3 | 5:05 | 2316 |
కోచ్ కూర్పు
మార్చురైలు నంబరు 22611: చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:
మూలాలు
మార్చు- ↑ "Welcome to Indian Railway Passenger Reservation Enquiry".
- ↑ "New Jalpaiguri-Chennai train from today". The Hindu. Archived from the original on 2011-02-03. Retrieved 2011-01-29.
- ↑ "Chennai-NewJalpaiguri SF Express". India Rail Info. Retrieved 2014-02-04.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-14. Retrieved 2016-04-24.
బయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537