చేమ దుంప

(చేమగడ్డ నుండి దారిమార్పు చెందింది)

Colocasia
Colocasia esculenta
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Colocasia

Range of the genus Colocasia.
Synonyms[1][2]

Leucocasia Schott

చేమ దుంపలు/కొత్తపేట కూరగాయల మర్కెట్లో తీసిన చిత్రం

ఆరం లిలీ (Arum lily) లేదా ఆరేసీ (Araceae) కుటుంబానికి చెందిన చేమ మొక్క శాస్త్రీయ నామం కోలొకేషియా ఎస్కులెంటా (Colocasia esculenta). దీనిని కో. యాంటీకోరం (C. antiquorum) అని కూడా అంటారు. ఎస్కులెంటా అంటే "ఆహారంగా పనికొచ్చేది అని అర్థం." యాంటీకోరం అంటే "ప్రాచీనులు ఉపయోగించినది" అని అర్థం. ఆరేసీ కుటుంబానికి చెందినది కనుక దీనిని "ఆరం" (arum) అని కూడా అంటారు. హిందీ లోనూ, ఉర్దూ లోను దీనిని "ఆర్వీ" అనడానికి మూలం ఇదే. హిందీలో ఖుయ్యా అని కూడా అంటారు. ఇంగ్లీషులో టేరో (taro) అని కాని టేరో రూట్ (taro) అని కాని అంటారు.

మొక్క

మార్చు

చేమ మొక్క ఆకులు ఏనుగు చెవుల్లా పెద్దగా ఉంటాయి. అందుకనే ఇంగ్లీషులో ఈ మొక్కని Elephant ear అంటారు. చేమ మొక్కకి కాండం అంటూ ఉండదు; ఆకులు, కాడలు పొడుగ్గా పెరుగుతాయి. ఇది బహువార్షిక మొక్క. ఇది చిత్తడి నేలల్లోనూ, కాలవల వెంట పెరుగుతుంది. దుంపలు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి. మధ్యలో ఒక పెద్ద దుంప (corm) దాని చుట్టూ పిల్ల దుంపలు (cormels) ఉంటాయి.

జన్మ స్థలం

మార్చు

పేరు లోని యాంటీకోరంని బట్టి చేమ ప్రాచీన కాలం నుండి ఉపయోగంలో ఉందని తెలుస్తోంది. దీని జన్మస్థానం మూడొంతులు ఆగ్నేయ ఆసియా ప్రాంతం (అనగా, ప్రస్తుతం ఇండేనేసియా, ఫిలిప్పిన్ దీవులు, వియత్నాం, వగైరా). ఇది భారతదేశం లోనికి ప్రాచీన కాలంలోనే వచ్చి ఉంటుందని పెద్దలు అంచనా వేస్తున్నారు.

ఆహారంగా చేమ

మార్చు
Taro, cooked, without salt
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి594 కి.J (142 kcal)
34.6 g
చక్కెరలు0.49
పీచు పదార్థం5.1 g
0.11 g
0.52 g
విటమిన్లు Quantity
%DV
థయామిన్ (B1)
9%
0.107 mg
రైబోఫ్లావిన్ (B2)
2%
0.028 mg
నియాసిన్ (B3)
3%
0.51 mg
పాంటోథెనిక్ ఆమ్లం (B5)
7%
0.336 mg
విటమిన్ బి6
25%
0.331 mg
ఫోలేట్ (B9)
5%
19 μg
విటమిన్ సి
6%
5 mg
Vitamin E
20%
2.93 mg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
2%
18 mg
ఇనుము
6%
0.72 mg
మెగ్నీషియం
8%
30 mg
మాంగనీస్
21%
0.449 mg
ఫాస్ఫరస్
11%
76 mg
పొటాషియం
10%
484 mg
జింక్
3%
0.27 mg

Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

కంద, పెండలం మాదిరే ఈ దుంపలలో కూడా కేల్సియం ఆగ్జలేట్ ఉండడం వల్ల పచ్చివి తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టుకుని తినాలి. హవాయి దీవులలో చేమ చాల ముఖ్యమైన వంటకం. దీనిని ఉడకబెట్టి, ముద్ద చేసి, ఊరబెట్టి "పోయ్" (poi) అనే పదార్థాన్ని చేసి ఆ ద్వీపవాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఉడకబెట్టిన ముక్కల్ని ఎర్రగా పెనం మీద వేయించిన (stir fry) చేమ వేపుడు తెలుగు దేశంలో ప్రసిద్ధమైన వంటకమే. ఉడకబెట్టిన దుంపలకి ఆవ పెట్టి వండిన కూర కూడా బాగుంటుంది కాని కొంచెం జిగురుగా ఉంటుందని కొంతమంది ఇష్టపడరు. పోషక విలువల పరంగా, 100 గ్రాముల చామదుంపలు సుమారు 120 కేలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు (కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్) ఉండడం వల్ల, పోషక నార (డయటరీ ఫైబర్‌) ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం లోకి గ్లూకోజ్ ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రాణ్యములు (ప్రోటీన్లు) కొద్దిగానే ఉంటాయి.

వైద్యంలో చేమ

మార్చు

విటమిన్‌ " సి," "బి-6 ," "ఇ," మేంగనీస్, కేల్సియం, ఇనుము, భాస్వరం తోపాటు పోషక నార (dietary fiber), ఏంటీ ఆక్సిడేంట్లు వంటి పోషక పదార్థాలు చేమ దుంపలలో ఉన్నాయి.

మరీ ఎక్కువగా తినడము వలన కడుపులో వికారము, అసౌకర్యము, విరోవనాలు వంటివి కలుగవచ్చును.

ఇతర దుంపలు, వాటి పేర్లు

మార్చు
  • బంగాళాదుంప = ఆలూ = ఉర్ల గడ్డ = [bot.] Solanum tuberosum = Potato
  • తియ్యదుంప = చిలగడదుంప = గెనుసు గడ్డ = [bot.] Ipomoea batatas = Sweet potato
  • చేమ దుంప = [bot.] Colacasia esculenta = Taro root
  • పాలగరుడ వేరు = [bot.] Marantha ramosissima or [bot.] Maranta arundinacea = Arrow-root; this looks similar to other underground tubers such as cassava, yucca or kudzu, which are oblong in shape; a flour made from this is called పాలగుండ and is used in the preparation of puddings;
  • కంద = Elephant-foot yam = [bot.] amorphophallus campanulatus (Watts) = Elephant-foot yam
  • పెండలం = (1) [bot.] Dioscorea esculentum = Lesser Yam; (2) [bot.] Dioscorea alata = Grater yam = Purple yam;
  • కర్రపెండలం = cassava root = yucca; the starch from this root is used to make tapioca or sago [bot.] Manihot utilissima; Manihot esculenta;
  • అమెరికాలో అనేక రకాల దుంపలని కట్టగట్టి "యామ్" అని పిలిచెస్తారు.

మూలాలు

మార్చు
  1. "Kew World Checklist of Selected Plant Families". Archived from the original on 2020-07-09. Retrieved 2015-09-01.
  2. GRIN (October 5, 2007). "Colocasia Schott". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. Archived from the original on 2012-10-07. Retrieved July 13, 2010.

వనరులు

మార్చు
  • ముత్తేవి రవీంద్రనాథ్, కూరగాథలు, విజ్ఞఆన వేదిక, తెనాలి, 2014

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=చేమ_దుంప&oldid=4235082" నుండి వెలికితీశారు