చేర్యాల మండలం

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం

చేర్యాల మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. చేర్యాల, ఈ మండలానికి కేంద్రం.

చేర్యాల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్ధిపేట జిల్లా, చేర్యాల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్ధిపేట జిల్లా, చేర్యాల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్ధిపేట జిల్లా, చేర్యాల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°55′29″N 78°58′08″E / 17.924602°N 78.968807°E / 17.924602; 78.968807
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్ధిపేట జిల్లా
మండల కేంద్రం చేర్యాల
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,809
 - పురుషులు 35,499
 - స్త్రీలు 35,310
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.81%
 - పురుషులు 66.89%
 - స్త్రీలు 38.90%
పిన్‌కోడ్ 506223

మండల జనాభా

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 70,809, పురుషులు 35,499, స్త్రీలు 35,310. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 199 చ.కి.మీ. కాగా, జనాభా 52,778. జనాభాలో పురుషులు 26,516 కాగా, స్త్రీల సంఖ్య 26,262. మండలంలో 12,219 గృహాలున్నాయి.[3]

మెదక్ జిల్లా నుండి సిద్ధిపేట జిల్లాకు మార్పు

మార్చు

లోగడ చేర్యాల మండలం గ్రామం/మండలం మెదక్ జిల్లా, సిద్దిపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చేర్యాల మండలాన్ని (1+11) పన్నెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లా, సిద్దిపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలంలో చేరిన కొత్త గ్రామాలు

మార్చు

ఈ మండలంలో లోగడ లోగడ 12 గ్రామాలు ఉన్నాయి. తరువాత ప్రభుత్వం మధ్దూరు మండలం నుండి కమలాయపల్లి, అర్జునపట్ల అనే రెండు గ్రామాలను ఈ మండలంలో విలీనం చేసింది. దానితో ఈ మండలంలోని గ్రామాల సంఖ్య 14కు చేరుకుంది.[4]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. తాడూర్
  2. చిట్యాల్
  3. దానంపల్లి
  4. దొమ్మాట
  5. ఆకునూర్
  6. చేర్యాల
  7. వేచరేణి
  8. నాగపురి
  9. పెదరాజుపేట్
  10. కడవేర్గు
  11. చుంచన్ కోట
  12. ముస్త్యాల
  13. కమలాయపల్లి
  14. అర్జునపట్ల

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "సిద్ధిపేట జిల్లాలో కొత్త మండలం... ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్". Samayam Telugu. Retrieved 2021-11-06.

బయటి లింకులు

మార్చు