చౌటకూరు మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం


చౌటకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లో కొత్తగా ఏర్పడిన మండలం. దీని పరిపాలనా కేంద్రం చౌటకూరు గ్రామం.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం.ఈ మండలం 2020 జులై 13 నుండి ఉనికి లోకి వచ్చింది.ఇది ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలం.ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 27 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూ మధ్య గల కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి. [1] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజనులో భాగం.[3] పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది. ఈ మండలంలో  14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. చౌటకూరు, ఈ మండలానికి కేంద్రం.

చౌటకూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, చౌటకూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, చౌటకూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, చౌటకూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°44′59″N 78°05′23″E / 17.749688°N 78.089704°E / 17.749688; 78.089704
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం చౌటకూరు
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 249 km² (96.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 51,386
 - పురుషులు 25,737
 - స్త్రీలు 25,649
పిన్‌కోడ్ 502273

పుల్కల్ మండలం నుండి ఏర్పడిన కొత్త మండలం

మార్చు

కొత్తగా ఏర్పడిన చౌటకూరు మండలం లోని అన్ని రెవెన్యూ గ్రామాలు చౌటకూరు మండలం ఏర్పడకముందు సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోని పుల్కల్ మండల పరిధిలో ఉన్నాయి. పుల్కల్ మండలం లోని 14 గ్రామాలను విడగొట్టి చౌటకూరు పరిపాలనా కేంద్రంగా చౌటకూరు మండలంలో చేర్చి , జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజనును పరిధి కిందకు చేరింది. మండలం లోని 14 రెవెన్యూ గ్రామాలలో ఒకటి నిర్జన గ్రామం.[4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 249 చ.కి.మీ. కాగా, జనాభా 51,386. జనాభాలో పురుషులు 25,737 కాగా, స్త్రీల సంఖ్య 25,649. మండలంలో 11,364 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. పోసానిపల్లి
  2. చౌటకూరు
  3. సేరిరాంరెడ్డిగూడ
  4. సుల్తాన్‌పూర్
  5. సరాఫ్‌పల్లి
  6. కొర్పోల్
  7. లింగంపల్లి
  8. వెంకటకిస్టాపూర్
  9. తడ్డన్‌పల్లి
  10. గంగోజీపేట్
  11. చక్రియాల్
  12. శివంపేట్
  13. వెండికోల్

గమనిక:సముదాయం నిర్ణయం మేరకు నిర్జన గ్రామాలు పరిగణనలోకి తీసుకోలేదు.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామం ఉంది.

మూలాలు

మార్చు
  1. G.O.Ms.No. 79,  Revenue (DA-CMRF) Department, Dated: 13-07-2020.
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. Team, Web (2020-07-13). "తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్". Dishadaily (దిశ): Latest Telugu News. Retrieved 2022-01-04.
  4. G.O.Ms.No. 79,  Revenue (DA-CMRF) Department, Dated: 13-07-2020.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.