ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం.

ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. సంగారెడ్డి జిల్లాలోవున్న నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి.[1] ఈ డివిజను పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.[2] ఈ డివిజను ప్రధాన కార్యాలయం జోగిపేట్ పట్టణంలో ఉంది. 2020 జూలైలో రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఈ రెవెన్యూ డివిజను జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని ఆందోల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజను
అందోల్ గడి ద్వారం
అందోల్ గడి ద్వారం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసంగారెడ్డి

వివరాలు

మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన

మార్చు

ఆందోల్ - జోగిపేట డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 పుల్కల్ మండలం 16 రెవెన్యూ గ్రామాలు
2 ఆందోల్ మండలం 27 రెవెన్యూ గ్రామాలు
3 వట్‌పల్లి మండలం 19 రెవెన్యూ గ్రామాలు
4 చౌటకూరు మండలం 14 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)

మూలాలు

మార్చు
  1. "Revenue Divisions | District Sangareddy, Government of Telangana | India". www.sangareddy.telangana.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-20. Retrieved 2022-07-29.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "Andole-Jogipet is 74th revenue division in Telangana: Harish". Telangana Today (in ఇంగ్లీష్). 2022-07-23. Archived from the original on 2020-09-19. Retrieved 2022-07-29.
  4. "Telangana Sangareddy District Revenue Divisions, Mandals TS GO 239". Teacher4us. 2016-10-16. Archived from the original on 2022-07-18. Retrieved 2022-07-29.
  5. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-07-29.