జక్కన్న (2016 సినిమా)
జక్కన్న 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఆర్. పి.ఏ క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించాడు. సునీల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 29 జూలై 2016లో విడుదలైంది.
జక్కన్న (2016 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వంశీకృష్ణ ఆకెళ్ల |
---|---|
నిర్మాణం | సుదర్శన్ రెడ్డి |
కథ | వంశీకృష్ణ ఆకెళ్ల |
తారాగణం | సునీల్ మన్నారా చోప్రా |
సంగీతం | దినేష్ |
ఛాయాగ్రహణం | సి.రాంప్రసాద్ |
నిర్మాణ సంస్థ | ఆర్. పి.ఏ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 29 జూలై 2016 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుగణేష్ (సునీల్) ఎవరైనా తనకు సాయం చేస్తే ఆ సాయాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా తనకు సాయపడ్డ వాళ్లను ఎంతదూరమైనా వెళ్ళి రుణం తీర్చుకునే వ్యక్తితం.గణేష్ బైరాగి (కబీర్ సింగ్) ను వెతుకుంటూ విశాఖపట్నంకు వెళ్తాడు. ఈ క్రమంలో గణేష్ సహస్ర (మన్నారా చోప్రా) ప్రేమలో పడతాడు. ఇంతకీ బైరాగి కోసం గణేష్ ఎందుకు వెతుకుతుంటాడు? అతడికి ఇతడికి సంబంధమేంటి ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- సునీల్ - గణేష్ \ జక్కన్న [3]
- మన్నారా చోప్రా - సహస్ర
- కబీర్ సింగ్ దుహా - బైరాగి
- పృథ్వీరాజ్ - కటకటాల కట్టప్ప
- సప్తగిరి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆర్. పి.ఏ క్రియేషన్స్
- నిర్మాత: సుదర్శన్ రెడ్డి
- కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల [4]
- సంగీతం: దినేష్
- మాటలు: భవానీ ప్రసాద్
- కెమెరా: సి.రాంప్రసాద్
- కళ: కె.మురళీధర్
పాటలు
మార్చుపాట | పాడినవారు | గీత రచయిత |
---|---|---|
జక్కన్న | కావ్య అజిత్, సింహ భాగవతుల | కాసర్ల శ్యామ్ |
హెల్పేర్ | రంజిత్ గోవింద్, రేవంత్ | శ్రీమణి |
నిజంగా | కార్తీక్ | శ్రీమణి |
యు అర్ మై డార్లింగో | రాహుల్ సింప్లిగంజ్, దామిని భట్ల | కాసర్ల శ్యామ్ |
అందం టన్నుల్లోన | జితిన్ రాజ్,రమ్య బెహరా | శ్రీమణి |
మూలాలు
మార్చు- ↑ Sakshi (21 June 2016). "'జక్కన్న' మూవీ స్టిల్స్". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
- ↑ Sakshi (31 July 2016). "నవ్వులు తెప్పించే... జక్కన్న". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
- ↑ THE HANS INDIA (19 March 2016). "Sunil turns Jakkanna". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
- ↑ The Indian Express (25 July 2016). "Treated Sunil as a technician in Jakkanna: Director Vamsi Krishna Akella". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 1 నవంబరు 2016. Retrieved 26 June 2021.