ఇందుకూరి సునీల్ వర్మ
సునీల్‌గా పేరుగాంచిన ఇందుకూరి సునీల్ వర్మ తెలుగు సినిమా నటుడు. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. మొదట ఎక్కువ హాస్యపాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారాడు. హాస్యనటుడిగా నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు అతనికి మంచి గుర్తింపు సాధించి పెట్టాయి. అందాల రాముడు అతనికి కథానాయకుడిగా మొదటి సినిమా. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న మంచి ప్రజాదరణ పొందింది.
సునీల్ | |
---|---|
జననం | ఇందుకూరి సునీల్ వర్మ 1974 ఫిబ్రవరి 28 |
విద్య | ఫైన్ ఆర్ట్స్ |
విద్యాసంస్థ | భీమవరం కళాశాల |
వృత్తి | నటుడు |
పిల్లలు | కుందన |
2003లో నువ్వు నేను, 2006 లో ఆంధ్రుడు చిత్రాలకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. మర్యాద రామన్న చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది.
బాల్యం, విద్యాభ్యాసం. వృత్తి
మార్చుసునీల్ పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించాడు. తండ్రి కేంద్ర తపాలా శాఖా ఉద్యోగి. సునీల్‌కు ఐదేళ్ళ వయసు అప్పుడు తండ్రి మరణించగా తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది. చిన్నప్పుడు సునీల్ వాళ్ళ అమ్మమ్మ ఊరైన పెదపులివర్రులో ఎక్కువగా ఉండేవాడు. నాలుగో తరగతి దాకా అక్కడే చదివి తరువాత భీమవరం వచ్చేశాడు. తొమ్మిదో తరగతికి ఉండి ఉన్నత పాఠశాలలో చేరాడు. సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్ఆర్ట్స్ కోర్సులో చేరాడు. అప్పట్లో అక్కడ నాటకాలలో నట శిక్షణ ఇవ్వడానికి రాజా వన్నెంరెడ్డి ('క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్ర దర్శకుడు) వచ్చేవాడు. అప్పటికింకా ఆయన దర్శకుడు కాలేదు.
కుటుంబం
మార్చుసునీల్ ది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆయన భార్య పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. వీరిద్దరికీ ఒక పాప. పేరు కుందన.
సినిమా కెరీర్
మార్చుసునీల్ మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్నాడు. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. త్రివిక్రం సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నించాడు. తన సినిమాల్లో కూడా అతనికి పాత్రలు ఇప్పించాడు. సునీల్ కేవలం నటుడిగానే కాక కథానాయకునిగా, మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకొన్నాడు.[1]
సునీల్ హీరోగా
మార్చుసునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అందాలరాముడు ఇందులో ఆర్తీ అగర్వాల్ కథానాయిక. ఇందులోని అన్నిపాటలు ప్రజాదరణ పొందినవి. ఈ చిత్రం విజయవంతంగా నడచి సునీల్ కు మంచి పేరు తెచ్చింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న (సినిమా) కూడా ప్రజాదరణ పొందింది. పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు.[2]
సునీల్ నటించిన చిత్రాలు
మార్చు- పుష్ప 2 (2024)
- జీబ్రా (2024)
- విశ్వం (2024)
- శ్వాగ్ (2024)
- మెకానిక్ రాకీ (2024)
- హరోం హర (2024)
- మత్తు వదలరా 2 (2024)
- పారిజాత పర్వం (2024)
- గీతాంజలి మళ్ళీ వచ్చింది (2024)
- జపాన్ (2023)
- వెయ్ దరువెయ్ (2023)
- మార్క్ ఆంటోని (2023)
- మహావీరుడు (2023)
- భువన విజయమ్ (2023)
- విరూపాక్ష (2023)
- కథ వెనుక కథ (2023)
- వాలెంటైన్స్ నైట్ (2023)
- మిస్టర్ కింగ్ (2023)
- ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు (2023)
- ఎస్5 నో ఎగ్జిట్ (2022)
- ఊర్వశివో రాక్షసివో (2022)
- జిన్నా(2022)
- వాంటెడ్ పండుగాడ్ (2022)
- దర్జా (2022)
- భీమ్లా నాయక్ - భీమ్లా నాయక్ పాటలో (2022)
- ముఖచిత్రం (2022)
- తీస్ మార్ ఖాన్ (2022)
- చిత్తం మహారాణి (2022)
- అతడు ఆమె ప్రియుడు (2022)
- బుజ్జీ ఇలారా (2022)
- హెడ్స్ అండ్ టేల్స్ (2021)
- కనబడుటలేదు (2021)
- తెలంగాణ దేవుడు (2021)
- కలర్ ఫోటో (2020)
- డిస్కో రాజా (2020) తెలుగు[3][4]
- చాణక్య (2019)[5][6]
- సిల్లీ ఫెలోస్ (2018)[7]
- అమర్ అక్బర్ ఆంటోని (2018)
- ఉంగరాల రాంబాబు (2017)
- 2 కంట్రీస్ (2017)
- ఈడు గోల్డ్ ఎహె (2016)
- జక్కన్న (2016)
- కృష్ణాష్టమి (2016)
- భీమవరం బుల్లోడు (2014)
- తడాఖా (2013)
- మిస్టర్ పెళ్ళికొడుకు (2013)
- పూలరంగడు (2012)
- శంభో శివ శంభో (2010)
- తిమ్మరాజు (2010)
- ఖలేజా (2010)
- మర్యాద రామన్న (2010)
- ఆ ఒక్కడు (2009)[8][9]
- నేరము - శిక్ష (2009)
- రెయిన్బో (2008)
- ఆదివిష్ణు (2008)
- చుక్కల్లో చంద్రుడు (2006)
- నువ్వు నాకు నచ్చావు
- నేనున్నాను (2004)
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
- కొడుకు (2004)
- నువ్వు నేను
- మనసంతా నువ్వే
- బొమ్మరిల్లు
- నువ్వే నువ్వే
- నువ్వు లేక నేను లేను
- నువ్వే కావాలి
- ఠాగూర్
- మల్లీశ్వరి (2004 సినిమా)
- ఉల్లాసంగా ఉత్సాహంగా
- పాపే నా ప్రాణం (2000)
- కలుసుకోవాలని
- హోలీ (2002)
- ఒకటో నంబర్ కుర్రాడు (2002)
- విజయం (2003)
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
- నేను పెళ్ళికి రెడీ (2013)
- మాస్
- జై చిరంజీవ
- అతడు
- జల్సా
- రెడీ
- ఢీ
- కింగ్
- వాసు
- అందాల రాముడు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు
- అరవింద సమేత వీర రాఘవ
పురస్కారాలు
మార్చు- స్పెషల్ జ్యూరీ అవార్డు - మర్యాద రామన్న
- 2013 - ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు - తడాఖా
- 2013: ఉత్తమ సహాయనటుడు (తడాఖా)
మూలాలు
మార్చు- ↑ "Sunil Not Interested In Comedian Roles Anymore?". Sakshi Post (in ఇంగ్లీష్). 2020-08-07. Retrieved 2021-01-05.
- ↑ Keramalu, Karthik (2020-10-28). "The Rise, Fall And Resurrection Of Telugu Actor Sunil, Who Stars In Colour Photo". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-05.
- ↑ సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 2020-01-24. Retrieved 24 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 జనవరి 2020. Retrieved 24 January 2020.
- ↑ "Gopichand dons a spy's hat for his upcoming film Chanakya". Times of India. 9 June 2019. Retrieved 7 January 2020.
- ↑ "Chanakya: Gopichand, Mehreen Pirzada's upcoming Telugu spy thriller gets a title and logo- Entertainment News, Firstpost". firstpost.com. Archived from the original on 1 July 2019. Retrieved 7 January 2020.
- ↑ సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.
- ↑ Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Archived from the original on 12 December 2019. Retrieved 29 May 2020.
- ↑ Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com (in ఇంగ్లీష్). Venkat Arikatla. Retrieved 29 May 2020.[permanent dead link]