జగదీప్ ధన్కర్
జగదీప్ థన్కర్ (జననం 1951 మే 18) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది. ప్రస్తుతం భారత ఉప రాష్ట్రపతి గా 2022 ఆగస్టు 11 నుండి విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.[1] 2022 జులై 16న ఆయనను బిజేపి భారత ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నామినేట్ చేయబడింది.[2] బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటించారు.
భారతదేశ రాజకీయనాయకుడు, పశ్చిమ బెంగాల్ గవర్నరు | |
పుట్టిన తేదీ | 18 మే 1951 ఝున్‌ఝును జిల్లా |
---|---|
చదువుకున్న సంస్థ |
|
వృత్తి | |
రాజకీయ పార్టీ సభ్యత్వం |
|
చేపట్టిన పదవి |
|
జీవిత భాగస్వామి |
|
[ అధికారిక వెబ్ సైటు] | |
తొలినాళ్ళ జీవితం
మార్చుదన్కర్ 1951 మే 18న రాజస్థాన్ రాష్ట్రంలోని కితానా అనే కుగ్రామంలో జన్మించారు. చిత్తోడ్ ఘడ్ లోని సైనిక్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసి, రాజస్థాన్ విశ్విద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. [1]
రాజకీయ జీవితం
మార్చు1989 నుండి 1991 వరకు రాజస్థాన్ లో ఝుంఝును నియోజవర్గం నుండి 9వ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. 1993 నుండి 1998 వరకు కిషనగర్ నియోజకవర్గం నుండి రాజస్తాన్ శాసనసభ సభ్యుడిగా పనిచేశారు. రాజస్తాన్ రాష్ట్ర న్యాయవాదుల బార్ కౌన్సిల్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
2019 జూలై 30న రాష్ట్రపతి కోవింద్ చే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నరుగా నియమించబడ్డారు.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Our Governor: Raj Bhavan, West Bengal, India". Raj Bhavan, West Bengal, India. Retrieved 15 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Jagdeep Dhankhar, West Bengal Governor, is NDA's Vice President candidate". The Indian Express (in ఇంగ్లీష్). 2022-07-16. Retrieved 2022-07-16.
- ↑ "Our Governor: Raj Bhavan, West Bengal, India". Raj Bhavan, West Bengal, India. Retrieved 15 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)