చెన్నూర్ జగన్నాథ దేవాలయం

(జగన్నాథ దేవాలయం చెన్నూర్ నుండి దారిమార్పు చెందింది)

జగన్నాథ దేవాలయం చెన్నూర్ తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల కేంద్రములో ఉంది. ఇది చాలా పురాతన ఆలయం.శ్రీ కృష్ణ స్వరూపుడైన జగన్నాథుడు సుభద్ర, బలభద్ర సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు[1][2].

శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం చెన్నూర్
శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం చెన్నూర్ is located in Telangana
శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం చెన్నూర్
శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం చెన్నూర్
తెలంగాణ లోని ప్రదేశం
భౌగోళికాంశాలు:18°48′50″N 79°42′59″E / 18.81389°N 79.71639°E / 18.81389; 79.71639
పేరు
ఇతర పేర్లు:జగన్నాథ టెంపుల్
స్థానిక పేరు:Shri Jagannath Swamy Temple
శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం
దేవనాగరి:जगन्नाथ मंदिर चेन्नुर
మరాఠీ భాష:जगन्नाथ मंदिर चेन्नुर
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మంచిర్యాల
ప్రదేశం:చెన్నూర్ మండల కేంద్రములో
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శ్రీ జగన్నాథ స్వామి సుభద్ర, బలభద్ర
ప్రధాన పండుగలు:రథయాత్ర
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
500 ఏళ్ళ చరిత్ర
నిర్మాత:కాకతీయులు

చరిత్ర

మార్చు

శ్రీ కృష్ణ స్వరూపుడైన జగన్నాథుడు సుభద్ర, బలభద్ర ‌సమేతంగా ఉన్న జగన్నాథ స్వామి ఈ దేవాలయంలోని దేవతలు.చాలా పురాతన మైన ఈ దేవాలయం 500 ఏళ్ళ క్రితం కాకతీయులుకాలంలో వారి సామంత రాజులు నిర్మించారు.ఒక రోజు రాత్రి రాజుకు దేవుడు కాలలో కనిపించి సపరివారంగా వస్తున్నానంటూ తనంతట తానే చెన్నూర్ క్షేత్రానికి రావడానికి నిశ్చయించుకున్నాడట.నాకు నా కుటుంబికులతో సహా పవిత్రమైన గోదావరి నది తీరాన ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేపట్టాలని కోరారట.నిద్ర నుంచి లెచిన ఆ రాజు ఏమిటి నాకు ఇలా కల ఎందుకు ‌వచ్చింది అని ఆలోచించాడట. ఇలాంటి కాల పదే పదే రావడంతో రాజు తన రాజ్యంలో ఉన్న ఆస్థాన కవులు, పామరులు, పండితులతో చర్చించి ఒక మందిర నిర్మాణం చేయుటకు నిర్ణయానికి వచ్చారట.

స్థల పురాణం

మార్చు

భారత దేశంలోని జగన్నాథ స్వామి క్షేత్రాల్లో పూరీ లోని జగన్నాథ స్వామి దేవాలయం తర్వాత అంతట ప్రాశస్త్యం ఉన్న దేవాలయం మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయం. సుమారు 500 వందల సంవత్సరాల క్రితం ఈ చెన్నూర్ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ సామంత రాజు రమ్యపురి మహారాజు చెన్నూరు లో ఈ జగన్నాథ దేవాలయాన్ని నిర్మించారని మనకు స్థల పురాణం వల్ల తెలుస్తోంది.

నిత్యం పూజలు

మార్చు

ఈ ఆలయంలో ప్రతి రోజూ ఉదయం సాయంత్రం వేళల్లో పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏడు రోజుల పాటు తాళం ఆపకుండా నిరంతరంగా భక్తులచే భజన కీర్తనలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ధనుర్మాసమంతా స్వామి వారికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పర్వ దినాలలో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .భక్తులు స్వామి వారికి దర్శనం కోసం జిల్లా నలుమూలల నుండే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

విశేషం

మార్చు

చెన్నూరు జగన్నాథ ఆలయంలో పూరీలో ఏవిధంగా నైతే కాయ్యలతో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయో ఇక్కడి దేవాలయంలో కూడా ఆలాంటి విగ్రహాలు ఉండటం విశేషం[3].

ఇవి కూడా చూడండి

మార్చు

జగన్నాథ దేవాలయం, హైదరాబాదు

పూరీ జగన్నాథ దేవాలయం

మూలాలు

మార్చు
  1. "Adilabad District Temples of Lord Shiva of Telengana - అదిలాబాద్ శివ గుడి". shaivam.org. Retrieved 2024-11-05.
  2. Publications, Devullu com | Mohan. "Mohan Publications | Bhakti Books | Telugu Books | FREE pdfs | Devullu.com | Bhakti Pustakalu: జగన్నాథ ఆలయం చెన్నూరు_jagannadhaswamyTemple-chennur". Mohan Publications | Bhakti Books | Telugu Books | FREE pdfs | Devullu.com | Bhakti Pustakalu. Retrieved 2024-11-05.
  3. "jagannath temple - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on jagannath temple | Sakshi". www.sakshi.com. Retrieved 2024-11-05.