జతకలిసే
జతకలిసే 2015లో విడుదలైన తెలుగు సినిమా.[1] వారాహి చలనచిత్రం సమర్పణలో యుక్త క్రియేషన్స్, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నరేష్ రావూరి నిర్మించిన ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. అశ్విన్, తేజస్వి మదివాడ, స్నిగ్ధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
జతకలిసే | |
---|---|
దర్శకత్వం | రాకేష్ శశి |
స్క్రీన్ ప్లే | రాకేష్ శశి |
నిర్మాత | నరేష్ రావూరి |
తారాగణం | అశ్విన్ తేజస్వి మదివాడ స్నిగ్ధ |
ఛాయాగ్రహణం | చీకటి జగదీష్ |
సంగీతం | సాయి కార్తీక్, ఎం.సి. విక్కీ |
నిర్మాణ సంస్థలు | యుక్త క్రియేషన్స్, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2015 డిసెంబర్ 25 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురిషి (అశ్విన్) యుఎస్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓ. తన మిత్రుడి పెళ్ళికి వైజాగ్ వస్తాడు, అతడి ఫ్రెండ్స్‌తో చేసే ఓ గొడవ వల్ల పెళ్ళి ఆగిపోతుంది. ఆ తర్వాత తిరిగి అమెరికా వెళ్ళేందుకు బయలుదేరిన అశ్విన్ హైద్రాబాద్‌లో జరిగే సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్ళాల్సిన తేజస్వి (తేజస్వి) తో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి క్యాబ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. వైజాగ్ నుంచి హైద్రాబాద్ వరకు జరిగే ఈ ప్రయాణంలో రిషి, తేజస్విలకు ఏమేం అనుభవాలు ఎదురయ్యాయి? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ఓ తండ్రి ఇరవై ఏళ్ళ కలను కూతురు ఎలా నెరవేర్చింది? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- అశ్విన్
- తేజస్వి మదివాడ
- స్నిగ్ధ
- పృథ్వీరాజ్
- హర్ష చెముడు
- షకలక శంకర్
- సప్తగిరి
- సూర్య
- ప్రియ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: యుక్త క్రియేషన్స్, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: నరేష్ రావూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాకేష్ శశి
- సంగీతం: సాయి కార్తీక్, ఎం.సి. విక్కీ
- సినిమాటోగ్రఫీ: చీకటి జగదీష్
మూలాలు
మార్చు- ↑ Sakshi (14 December 2015). "ప్రయాణంలో... జత కలిసే". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ Sakshi (26 December 2015). "ప్రేమ, కామెడీ జత కలిసే?". Retrieved 5 May 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)