జనకుడు

(జనక మహారాజు నుండి దారిమార్పు చెందింది)

జనకుడు, మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీత తండ్రిగా ప్రసిద్ధుడు. ఈయన హ్రస్వరోముడి కొడుకు. జనకునికి సీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. భార్య రత్నమాల. కుశధ్వజుడు ఈతని సోదరుడు. సంతానంకోసం యజ్ఞం చేయదలచి భూమిని దున్నుతుంటే సీత దొరుకుతుంది. యాజ్ఞవల్కుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు.

సీత స్వయంవరాన్ని నిర్వహిస్తున్న జనకుడు

జనకుడి భార్య మార్చు

రామాయణం ప్రకారం జనకుడు భార్య పేరు సునయన . బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం రత్నమాల బలి చక్రవర్తి కూతురు. వామనుడిని చూసి తనకలాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది. తర్వాతి జన్మలో పూతనగా జన్మిస్తుంది.

జనకుని వంశం మార్చు

వాల్మీకిరామాయణంలో జనక మహారాజుల వంశక్రమం:[1]

  • నిమి
  • మిథి - మిథిలా రాజ్య స్థాపకుడు, మొదటి జనకుడు
  • ఉదవసు
  • నందివర్ధనుడు
  • సుకేతు
  • దేవవ్రత
  • బృహవ్రత
  • మహావీర
  • సుధ్రితి
  • దృష్టకేతు
  • హర్యశ్వ
  • మారు
  • ప్రతింధక
  • కృతిరథ
  • దేవమిధ
  • విభూత
  • మహిధ్రత
  • కీర్తిరాతుడు
  • మహారోముడు
  • స్వర్ణరోముడు
  • హ్రశ్వరోముడు
  • సీరధ్వజుడు - రామాయణంలోని సీత తండ్రి, కుశధ్వజుడు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-10. Retrieved 2008-03-11.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జనకుడు&oldid=4010755" నుండి వెలికితీశారు