మిథిల (సంస్కృతం: मिथिला, mithilā) రామాయణంలో జనకుడు లేదా మిథి పరిపాలించిన విదేహ రాజ్యానికి చెందిన ప్రాచీన రాజధాని నగరం. ఆధునిక కాలంలో నేపాల్ లోని జనక్ పూర్ అప్పటి మిథిలగా గుర్తించారు.

भारत में प्रस्तावित मिथिला राज्य (जिला सहित)
भारत में मैथिली भाषी क्षेत्र

చరిత్ర మార్చు

విదేహరాజ్యాన్ని జనకమహారాజు పాలిస్తున్నాడు. వెదేహరాజ్యానికి జనకుడు 21వ సంతతి వాడు. మిధిలా రాజకుమారి సీతాదేవి జకమహారాజుకు భూమిని దున్నుతున్న సమయంలో మట్టిపాత్రలో లభించిన ప్రదేశాన్ని సీతామర్షి అంటారు. ఈ రాజ్యంలో 57 రాజులు ఉన్నట్లు అంచనా. జనకసామ్రాజ్యం అంతరించిన తరువాత మిధిల 8 భాగాలుగా విభజించబడి ప్రాంతీయంగా ఎన్నుకొనబడిన రాజప్రతినిధుల పాలనకింద అధికారం వికేంద్రీకరించబడింది. భూమి మీద మొదటి స్వతంత్రప్రతిపత్తి కలిగిన రాజ్యంగా తిరహుతిక్ గుర్తించబడింది. ఈ సమయంలో తిరహుతిక్ వజ్జి సంయుక్త రాష్ట్రాలు (వజ్జి రిపబ్లిక్) గా పిలువబడింది. 8 విభాగాలలో లిచ్ఛవీలు అధిక శక్తివంతమైన వారుగాను ప్రజాదరణ చూరగొన్న వారుగా ఉన్నారు. మగధ సమ్రాజ్య పాలకులు కూడా తమకు పొరిగున ఉన్న లిచ్ఛవీలతో వివాహసంబంధఅలు ఏర్పరచుకున్నారు. అజాతశత్రువు తిరహుతిక్ మీద దండయాత్ర చేసాడు. ఈ సమయంలో పవిత్ర గంగాతీరంలో పాటలీపుత్ర (ప్రస్తుత పాట్నా) పట్టణం పాటలీ గ్రామం వద్ద రూపుదిద్దుకుంది. అజాతశత్రువు బయటకు కనిపించని కోటను నిర్మించి గంగానదికి అవతలి తీరంలో ఉన్న లిచ్ఛవీల నుండి రాజ్యసరిహద్దు రక్షణ ఏర్పాటుచేసాడు. ముజఫ్ఫర్‌పూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబరాటి ప్రఖ్యాతి చెందిన వైశాలీ రాజ నర్తకి ఆమ్రపాలి విశ్రాంతిగృహం (పల్లె గృహం) ఉండేది అని ఊహిస్తున్నారు. మతపరమైన శిల్పకళావైభవానికి వైశాలి ప్రముఖ కేంద్రంగా భాసిల్లింది. ఇక్కడి శిల్పకళావైభవం, బాసో కుండ్, మహావీరుడి జన్మస్థలం, మహావీరుడి సమకాలీనుడైన బుద్ధుడు మొదలైన ఆకర్షణలు ఈ ప్రాంతానికి నిరంతర అంతర్జాతీయ పర్యాటకుల రాకకు కారణమై ఉన్నాయి.

హూయన్‌త్సాంగ్ రాక నుండి పాలా సామ్రాజ్యం తలెత్తే వరకు ఈ ప్రాంతం హర్షవర్ధనుడి పాలనలో ఉంటూ వచ్చింది. క్రీ.పూ 647 తిరహుతిక్ ప్రాంతం ప్రాంతీయ రాజప్రతినిధుల పాలనలోకి మారింది. సా.శ. 8వ శతాబ్దంలో తిరహుతిక్ మీద పాలా పాలకులు తమ ఆధిక్యాన్ని పునఃస్థాపించారు. తరువాత మధ్యభారతం నుండి వాచ్చిన చేది రాజులు ఈ ప్రాంతాన్ని వారు శేన సామ్రాజ్యం చేత ఓడింపబడే వరకు పాలించారు.

ఇస్లాం దండయాత్ర మార్చు

1210 & 1226 బెంగాల్ పాలకుడు గయాజుద్దీన్ ఇవాజ్ మిధిలా నగరం మీద దడయాత్రచేసాడు. మిధిలా నగరం మీద మొదటిసారిగా దండెత్తిన ముస్లిమ్ పాలకుడు ఇతడే. కాని అతడు మిధిలను పాలించకుండా కప్పం మాత్రమే తీసుకున్నాడు. 1323 లో గయాజుద్దీన్ తుగ్లక్ తన అధికారాన్ని మిధిల వరకు విస్తరించాడు. సిమ్రన్ చక్రవర్తులు పడమటి మిథిలా నగరాన్ని అలాగే నేపాల్ మీధ ఆధిపత్యం సాధించిన సిమ్రాన్ సామ్రాజ్యచరిత్రను పరిశీలిస్తే కాని మిథిలా నగర చరిత్ర అధ్యయనం పూర్తికాదు. సిమ్రన్ చక్రవర్తులలో ఆఖరివాడు అయిన హరసింహ దేవుని పాలనా సమయంలో తుగ్లక్‌షాహ్ మిథిలా నగరం మీద దండయాత్ర చేసి 1323 లో పూర్తి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తుగ్లక్‌షాహ్ అధికారాన్ని పి.టి థాగూర్ హస్థగతం చేసాడు. ఇలా హిందూ ఆధిపత్యం నుండి ముస్లిమ్ అధిపత్యంలోకి మిథిలా నగరం మారినా హిందువులు నిరంతరాయంగా స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవించారు.

కవి మైథిలి విద్యాపతి మార్చు

1352- 1448 మధ్యకాలంలో జీవించిన మైథిలి, సంస్కృత భాషల పండితుడు కవి ఇక్కడ జన్మించినవాడే. ఆయన మధుబనిలోని బిసిఫిలో జన్మించాడు. జానపదసాహిత్యములో అతడు భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్న గొప్ప భక్తుడుగా వర్ణించబడింది. ఒకసారి అతడి ఇంటికి భగవంతుడు సేవకుడిగా వచ్చి సేవ చేయాలని అనుకున్నాడు. సేవకుడిగా భగవంతుడు ఉగ్న అనే పేరు చెప్పాడు. ఈ ప్రదేశంలోని పలు శివాలయాల్లో ఈశ్వరుడు ఈ పేరు మీద పిలువబడుతున్నాడు. ఈశ్వరుడు విద్యాపతి వద్ద సేవకుడుగా వచ్చినప్పుడు విద్యాపతి ఆ విషయం తాను తిరిగి వెళ్ళే వరకు ఎవరికీ చెప్పాకూడదని షరతు పెట్టాడు. విద్యాపతి భార్య వారి సేవకుడి మీద ఆగ్రహించి సేవకుడిని కొడుతున్న తరుణంలో విద్యాపతి ఇక ఓర్వలేక భగవంతుడైన శివుడిని కొట్టవద్దని అడ్డు చెప్పిన వెంటనే పరమశివుడు మాయమయ్యాడు. తరువాత శువుడు విద్యాపతికి కనిపించలేదు.

బెంగాల్ పాలనలో మిథిల మార్చు

14వ శతాబ్దం చివరి భాగానికంతా మిధిలానగరం అంతా జౌన్‌పూర్ రాజుల పాలనలోకి చేరి ఒక శతాబ్ధకాలం వారి ఆధీనంలో ఉంది. తరువాత జౌన్‌పూర్ రాజులు ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి చేతిలో ఓడి పోయాడు. ఇంతలో బెంగాల్ నవాబు హస్సేన్ షాహ్ శక్తి పుంజుకుని అతడు మిధిలతో సహా రాజ్యంలోని అతిపెద్ద భాగాన్ని తన స్వాధీనంలోకి తీసుకు వచ్చాడు. 1499లో ఢిల్లీ నవాబు తిరిగి హస్సేన్ షాహ్‌ మీద దాడి చేసి మిథిలానగర రాజాను ఓడించి ఈ ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తీసుకువచ్చాడు. హస్సేన్ షాహ్‌ మరణంతరువాత బెంగాల్ నవాబుల ఆధిపత్యం క్షీణించి మిథిల ముగల్ సామ్రాజ్యంలో ఒక భాగం అయింది. అయినా బెంగాల్ నవాబు దావుద్ ఖాన్ వచ్చే వరకు ఉత్తర బీహారుతో చేర్చి ఈ ప్రాంతం అంతా రాజప్రతినిధుల పాలనలో కొనసాగింది. దావుద్ ఖాన్ పట్నా, హజిపూర్ మీద ఆధిపత్యం సాగించాడు. అతడి తరువాత ముగల్ సామ్రాజ్యాధినేతలు బీహారు లోని కొంత ప్రదేశాన్ని విభజించినప్పుడు మిధిల కూడా అందులో ఒక భాగంగా ఉంది.

బ్రిటిష్ అద్వర్యంలో మిథిల మార్చు

1764లో సంభవించిన బక్సర్ యుద్ధానంతరం మిథిలా నగర ఆధిపత్యం బీహార్‌తో సహా ఈస్టీండియా కంపెనీకి మారింది. 1887లో ఢిల్లీలో జరిగిన తిరుగుబాటు అలలు మిథిలలో నివసిస్తున్న ఆంగ్లేయులలో మరణభీతిని కలుగజేసింది. విప్లవం నిరంతరాయంగా దేశమంతా వ్యాపించింది.

ఖుడి రామ్ బోస్ మార్చు

1908లో 18 సంవత్సరాల బెంగాలీ విప్లవదారుడు కుడీరామ్‌బోస్ ఆంగ్లేయ అధికారుల మీద బాంబు విసిరిన దారణంగా ముజఫర్‌పూర్ వద్ద ఉరితీయబడ్డాడు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ దేశభక్తుడైన యువవిప్లవకారుడి కొరకు ముజాఫర్ వద్ద ఒక జ్ఞాపకచిహ్నం నిర్మించారు. 1902లో బీహార్ బెంగాల్ నుండి విడివడింది. తరువాత బీహార్ మిథిల-మథుర-ఆగ్రా విఫల సంధిని కుదుర్చుకున్నది. 1920 1927 డిసెంబరు జనవరిలో తిర్‌హత్‌కు (మోతీహరి) గాంధీ మహాత్ముడి రాకతో మిథిలలో రాజకీయంగా విప్లవాత్మకమైన మార్పులు కొనసాగాయి. తరువాత మిథిలా నగరం స్వాతంత్ర్య సమరంలో ప్రధాన పాత్ర వహించింది.

నదులు, వరదలు మార్చు

ఈ నగరం నుండి అనేక నదులు ఉత్తరం నుండి దక్షిణదిశగా ప్రవహించి గంగానదిలో సంగమిస్తున్నాయి. ఈ నదులు వరదల మూలంగా పంటపొలాలకు సారవంతమైన మట్టిని తీసుకు వస్తుంటాయి. ఏమైనప్పటికీ ప్రభుత్వ కార్యక్రామల కారణంగా ఏర్పడుతున్న వరదలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మిధిల ప్రధాన నదులు గండకీనది, మహానందానది, కీసీనది, భాగమతీనది, కమలానది, బుధిగండకీనది.

సహజమైన వరదలు మార్చు

మానవసంస్కృతి ఆరంభం అయినప్పటి నుండి నదులు మానవసంస్కృతిలో ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. మిథిలానగరంలో 7 ప్రధాన నదులు పలు ఉపనదులు ప్రవహిస్తుంటాయి. ఈ నదులన్నీ హిమాలయ శికరాల నుండి నీటిని పొందుతున్నాయి. ఈ నదుల కారణంగా మిథిలానగరంలో నీటి కొరత కనిపించదు. ప్రతి సంవత్సరం ఈ నదులలో ఏదో ఒకటి మిథిలా నగరానికి విలువైన సారవంతమైన మట్టిని తీసుకు వస్తుంది. వరదనీరు వ్యవసాయభూములందు ప్రవహించి భూములను సారవంతం చేసి వెనుకకు మరలుతుంటాయి. ఈ పద్ధతి అయిన మానవీయమైన వరదలు మిథిలా నగరానికి వరప్రసాదినిగా ఉన్నాయి. ఇవి మిథిలానగర భూములను అత్యంత సారవంతం చేస్తున్నాయి. కాని మిథిలలో సహజమైన వరదలు తగ్గిపోయాయి.

మానవకృత వరదలు మార్చు

స్వాతంత్ర్యానంతరం బీహార్ ప్రభుత్వం ఈ నదీతీరాల వెంట రెండు పక్కల పెద్ద గట్లను నిర్మించారు. ఈ నిర్మాణాల కారణంగా నదులలో పూడిక పెరిగి నదుల లోతు తగ్గి వరదలకు కారణం ఔతున్నాయి. ఈ కారణంగా నదులు నీటిని నిలుపుకునే సామర్థ్యం తగ్గిపోసాగింది. ఈ కారణంగా ఈ నదులు తరచుగా వరదలను కలిగిస్తున్నాయి. ఈ వరదనీరు ఇసుకను తీసుకు వచ్చి వ్యవసాయ భూములలో వదిలి వెడుతుంటాయి. ఇందు వలన భూములు మేడువారుతున్నాయి.ొకప్పుడు మిథిలా నగరానికి వరమైన వరదలు ఇప్పుడు శాపంగా మారాయి.

2008 కోసీ వరదలు మార్చు

2008 కోసీ వరదలు దేశంలోనే పేదరికం జనసాంద్రత అధికంగా ఉన్న మిథిలానగర చరిత్రలో అత్యంత దుఃఖకరమైన వరదలుగా నమోదైంది. ఇండోనేపాల్ సరిహద్దుల వద్ద 2008 ఆగస్టు 18 తేదీన కోసీనది గట్లు బీటలు వారాయి. నదిప్రవాహ దిశ మారి అకాలంలో అప్పటివరకు అలాంటి వరదల అనుభ్యవం లేని ప్రదేశాలలో వరదముప్పును తెచ్చిపెట్టింది.[1] ఈ వరదల కారణణంగా 23 లక్షల మంది బాధించబడ్డారు. ఈ వరదలలో 250 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.[2] సుమారు 30 లక్షలమంది తమ నివాసాలకు దూరం అయ్యారు.[3] కనీసం 3,00,000 గృహాలు ధ్వంసం అయ్యాయి. 8,40,000 ఎకరాల (3,40,000) హెక్టారుల వ్యవసాయ భూములలో పంటనాశనం జరిగింది.[4] మిథిలావాసులు పచ్చి బియ్యం, పిండిని కలుషితమైన నీటితో తయారుచేసుకుని తిన్నారు. ఆకలి, రోగాలు ఈ ప్రాంతం అంతా ప్రబలి పోయింది. సుపౌల్ జిల్లా అధికంగా నాశనమైనది. 1,000 చదరపు కిలోమీటర్ల (247 హెక్టార్ల) మేర వ్యవసాయభూములు నీట మునగడం వలన పంట నాశనం అయింది. [5]

ఆర్ధికరంగం మార్చు

వ్యవసాయాదాయం మార్చు

పారిశ్రామికాదాయం మార్చు

ప్రాచీనా మిథిలా రాజ్యం మార్చు

విభాగాలు - జిల్లాలు మార్చు

ప్రతిపాదిత మిథిల ఏడు కమీషనరీల నుండి 6 తిర్‌హట్, దర్బంగ, సహర్స, పూర్నియా, ముంగర్ & బగల్‌పుర్ ఇవి బీహారు రాష్ట్రంలో ఉన్నాయి. మిగిలిన ఒకటి అయిన సంతల్ పరణాలు మాత్రం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. బీహారులీ ఇప్పటికీ మైథిలీ భాషను మాట్లాడే వారు ఉన్నారు. అవి : అరారియా, బంకా, బెగుసారై, భగల్‌పూర్, దర్భంగ, తూర్పు చంపరాన్, జములి, కటిహార్, ఖగారియా, కిషన్‌గంజ్, లాఖిసారై, మాధేపురా, మధుబని, మోఘ్యూర్, ముజఫర్‌పూర్, పూర్నియా, సహర్స, సమస్తిపుర్, షైఖపుర, షియోహర్, సీతామర్హి, సుపౌల్, వైశాలి, పడమటి చంపరాన్ ఉన్నాయి. జార్ఖందులో ఉన్న మైథిలి భాష మాట్లాడే ప్రాంతాలు. దియోగర్, దుమ్క, గొడ్డ, జంతర, పకౌర్, సాహెబ్‌గంజ్.

భౌగోళిక చిత్రం మార్చు

 
మిథిల భౌగోళిక చిత్రం

వైశాల్యం-జనసంఖ్య మార్చు

మిథిలా నగర మొత్త వైశాల్యం 66,049 చదరపు కిలోమీటర్లు దీనిలో 54,232 చదరపు కిలోమీటర్ల భూమి బీహారులోనూ 11,817 చదరపు కిలోమీటర్ల భూమి జార్ఖండ్ లోనూ ఉంది. 2001 జనాభా గణాంకాలననుసరించి మిథిలా నగర జనాభా 5,68,12,422. వీరిలో 5,12,20,017 మంది బీహారు రాష్ట్రంలో నివసిస్తున్నారు. 55,92,405 మంది జార్ఖండ్ రాష్ట్రంలో నివసిస్తున్నారు.

స్వాతంత్రానంతర మిథిల మార్చు

స్వాతంత్ర్యానంతరం మహారష్ట్రా, కర్నాటక, కేరళా వివిధ రాష్ట్రల ఏర్పాటుకు వత్తిడితో మిధిల రాష్ట్ర ప్రస్తావన కూడా ప్రస్తావనకు వచ్చింది. 1955లో స్టేట్ రీ ఆర్గనైజేషన్ రూపుదిద్దుకున్న తరువాత పలు రాష్ట్రాల ఏర్పాటుజరిగి నిర్వహింపడ్డా మిథిలకు రాష్ట్రహోదా కలగడానికి అర్హత ఉన్నా దురదృష్టవశాత్తు ఆసమయంలో కూడా రాష్ట్ర ఏర్పాటు ఆగిపోయింది. 2000 సంవత్సరంలో జార్ఖండ్ బీహారు నుండి నైతికంగానూ భౌగోళికంగానూ ప్రత్యేకించబడి రాష్ట్రహూదా కలిగింది. జార్ఖండ్ కూడా మిథిల నుండి సంథాల్ ప్రాగాణా అనే ఒక జిల్లాను కలుపుకుంది. అది ఇప్పుడు 6 జిల్లాలుగా విభజింపబడింది.

రాష్ట్రహోదా కొరకు సంస్థల ప్రయత్నాలు మార్చు

1993లో అంతరాష్ట్రీయ మిథిలా పరిషద్ పేరుతో మొట్టమొదటి సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ తన తాను మిథిల, మైథిలి కొరకే ఏర్పాటు చేయబడ్డట్లు ప్రకటించింది. తరువాత 1995లో ఏర్పాటైన మిథిలా రాజ్య సంఘర్ష్ సమితి , 2008లో, అఖిల భారతీయ మిథిలా పార్టీ, మిథిలా వికాస్ పార్టీ , లాంటి మరికొన్ని సంస్థల ఏర్పాటు జరిగింది. ఈ రెండు రాజకీయ పార్టీలు మిథిలా రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావనతో తమ అస్థిత్వం నిలుపుకుంటున్నాయి.

రాజకీయంగా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల, ప్రతికూల స్పందనలు మార్చు

భారతీయ జనతా పార్టీ అనుకూలస్పందన:-

  • బి జే పి కార్యదర్శిగా పనిచేసిన గోవిందాచార్య 27.8.1996 డాక్టర్ ధనకర్‌ థాకూర్‌కు మిథిలా రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఒక లేఖను వ్రాసారు. తరువాత మిథిలా రాష్ట్ర ప్రస్తావనను బలపరచడానికి ఆర్ ఎస్ ఎస్ తరఫున ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నాడు.
  • బి జే పి బీహార్ నాయకుడు సుషీల్ కుమార్ మోడీ 1.3.1997 న మిథిలా రాష్ట్ర ఏర్పాటు కోరికను వెలిబుచ్చుతూ డాక్టర్ ధనకర్‌ థాకూర్‌కు ఒక లేఖ వ్రాసారు. ఈ లేఖ మైథిలీ సందేష్ పత్రిక ప్రచురించింది.
  • బి జే పి ఎమ్ పి కీర్తి అజాద్ దర్భంగా నుండి నిరంతరంగా మిథిలా రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ధర్నాలు, వ్యాఖ్యానాలు చేసారు.
  • బిజెపీ నాయకుడూ బీహారు విధాన్ పరిషద్ ఛైర్మన్ తారాకాంత్‌ ఝా మిథిలా రాష్ట్ర ఏర్పాటుకు శక్తివంతంగా బలపరుస్తున్నాడు. ఆయన అనేక బహిరంగ ర్యాలీలు నిర్వహించి మిథిలా రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ప్రజాబలాన్ని చేకూర్చాడు.
  • ఫోర్బెస్గంజి ఎమ్ ఎల్ ఎ ఎల్ ఎన్ మెతా 24.4.2010. ఆరియాలో జరిగిన అంతర్జాతీయ మైథిలీ సమ్మేళనంలో మిథిలా రాష్ట్ర ఏర్పాటుకు కోరిక వెలిబుచ్చాడు.

జే డి యు అనుకూలస్పందన:- ఆర్ జే డి అనిశ్చిత పరిస్థితి :- కాంగ్రెస్ అనుకూలము :- ఎల్ జే పి, ఇతరాలు :-

ప్రశాంతంగా మిథిలారాష్ట్ర ఏర్పాటు కోరికవెలిబుచ్చటం మార్చు

మిథిలానగర చరిత్రలో ఉద్రిక్త పరిస్థితి చెలరేగినట్లు నమోదు కాలేదు. మిథిలా ప్రజలు అత్యంత ప్రశాంత జీవనులు శాంతి కాముకులు. వారు మిథిలా రాష్ట్రం కొరకు ప్రశాంతంగా కోరిక వెలిబుచ్చుతున్నారు. మిథిల, ఢిల్లీలలో 22.12.2008, 22.12.2009,10.12.2011 అంతరాష్ట్రీయ మైథిలి పరిషద్, మిథిలా రాజ్య సంఘర్షసమితి పార్టీల చేత ధర్నా నిర్వహించబడింది. సమీపకాలంగా ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద 2012 జనవరి 21న మిథిలా రాజ్య సమితి పార్టీ ప్రత్యేకరాష్ట్ర కోరిక వెలిబుచ్చారు. తమ కోరిక తీర్చాలన్న వత్తిడి తీసుకురావడానికి వారు గౌరవనీయ రాష్ట్రపతికి ఒక లేఖను సమర్పించారు.

మిధిలానగర ప్రజలు మార్చు

ఇది జనకమహారాజు, సీతా, శతానుడు, విశ్వామిత్రుడు, విజయవల్క్య, మైత్రేయీ, గర్గి, గౌతమ్ మొదలైన పురాణ పురుషులు, స్త్రీలు జన్మించిన ప్రాంతము. క్రీ. పూ 599లో వైశాలి సామ్రాజ్యంలో జైన మత స్థాపకుడైన మహావీరుడు జన్మించాడు. మిథిలలో నిరంతరంగా అనేక మంది పండితులు జన్మించారు. వారు వరుసగా మదన్ మిశ్రా-భారతి (మహిషి, సహర్స), వాచస్పతి (దండి), కాళిదాసు (ఉచ్చైత్, బెనిపట్టి), వాచస్పతి (శామౌల్, మధుబని) ఉద్యానాచార్య (కరియన్, సమస్తిపుర్), శంకర్ (సరిసబ్, దర్భంగ) మురారి, పక్షదర్ మొదలైన ప్రముఖ రచయితలు-జ్యోఇష్కులు (వర్నరత్నాకర్ సా.శ. 1224), ఈయన హిందీలో నాగర్జున కలం పేరుతో వ్రాసాడు. గొప్ప కవులైన విద్యాపతి, చందా ఝా, సురేంద్ర ఝా, 'సుమన్', బైద్యనాధ్ మిశ్రా 'యత్రి' ఈయన హిందీలో నాగార్జున కలం పేరుతో వ్రాసాడు, రామధారి సింగ్, 'దిన్‌కర్', ఆర్సి ప్రసాద్ సింగ్, జానకి భల్లభ శాస్త్రి లాంటి వారు కూడా మిథిలలో జన్మించిన వారే .

ఇవికూడా చూడండి మార్చు

వనరులు మార్చు

  1. "A Dalit watch report on the flood camps in Bihar" (PDF). Archived from the original (PDF) on 2009-01-14. Retrieved 2012-04-12.
  2. "Half of Bihar under water, 30 lakh suffer;". CNN IBN. 2008-01-09. Archived from the original on 3 సెప్టెంబరు 2008. Retrieved 2008-09-01.
  3. http://www.abc.net.au/news/stories/2008/08/29/2350609.htm?section=justin
  4. abc.net.au, Death toll rises from Indian floods
  5. "reuters.com, Bihar villagers desperate as floods spread". Archived from the original on 2009-03-04. Retrieved 2012-04-12.
"https://te.wikipedia.org/w/index.php?title=మిథిల&oldid=4060861" నుండి వెలికితీశారు