ప్రస్తుత ఘటనలు | 2006 ఘటనలు నెలవారీగా - |జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2005 ఘటనలు
జనవరి 2006
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31

పతాక శీర్షికలు


జనవరి 30 2006, సోమవారం

మార్చు
 
వేటూరి సుందరరామమూర్తి
  • జాతీయ అవార్డు వెనక్కిస్తున్నా -వేటూరి: తెలుగును ప్రాచీన భాషగా గుర్తించనప్పుడు తనకిచ్చిన అవార్డుకు విలువలేదని ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి వ్యాఖ్యానించారు. 1993 లో మాతృదేవోభవ సినిమాలో "రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే" అనే పాటకు తనకిచ్చిన అవార్డును తిరిగిచ్చేస్తున్నానని ప్రకటించారు.
  • కోటరీ తప్పుడు సలహాలు: చుట్టూ చేరిన కోటరీ తప్పుడు సలహాలతోనే సోనియాగాంధీ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నారని మంత్రివర్గ విస్తరణపై ఆదివారం బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరిచిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఆరోపించారు.
  • ఆంధ్రప్రదేశ్‌ను చిన్న రాష్ట్రాలుగా చేద్దాం: "ఆంధ్రప్రదేశ్‌ను చిన్న రాష్ట్రాలుగా చేయడం కోసం ఉద్యమిద్దాం" అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు.
  • హే రాం: గాంధీ హత్య జరిగినపుడు గాంధీ 'హే రాం' అంటూ నేలకొరిగిపోయారు అని అనుకుంటూ ఉన్నాం. అయితే ఇది సరికాదని మహాత్మునికి నాడు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న వెంకిట కల్యాణం (83) వెల్లడించాడు. హత్య సమయంలో మహాత్ముని వెనుకే తాను ఉన్నానని చెప్పారు. గాడ్సే కాల్చినపుడు గాంధీ అసలు ఏ పదాన్నీ ఉచ్చరించనేలేదని వివరించాడు.
  • కేంద్ర మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం జరిగిందని చంద్రబాబునాయుడు విమర్శించాడు. "రాష్ట్ర జనాభాలో 50 శాతం బీసీలు. వారిలో ఒక్కరూ కేంద్ర మంత్రి పదవికి నోచుకోలేదా? ఇదేనా సామాజిక న్యాయం?" అని ఆయన అన్నాడు.

జనవరి 29 2006, ఆదివారం

మార్చు
  • ప్రాచీన భాషగా తెలుగు: తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలని, దీనికోసం ప్రజలు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు కదలాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించాడు. కొసరాజు రాఘవయ్య చౌదరి శత జయంత్యుత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.
  • కేంద్ర మంత్రివర్గ విస్తరణ: కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తూ కొత్తగా 19 మంది మంత్రులను చేర్చుకున్నారు. మరో ముగ్గురికి పదోన్నతి కల్పించారు. ఏడుగురి శాఖలు మార్చారు. కొత్తగా చేర్చుకున్నవారిలో ఏడుగురు కేబినెట్ మంత్రులు కాగా, 12 మంది సహాయ మంత్రులు. ఈ 12 మందిలో ఒకరికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. తాజా పునర్వ్యవస్థీకరణతో మంత్రుల మొత్తం సంఖ్య 79కి చేరింది.
  • అసంతృప్తి: కేంద్ర మంత్రివర్గ విస్తరణ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. మంత్రి పదవులు దక్కని జి.వెంకటస్వామి, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, మధు యాష్కీ గౌడ్ వంటి పలువురు నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు.
  • ప్రత్యేక తెలంగాణ అంశంపై భారతీయ జనతా పార్టీ ఉద్యమిం : ప్రత్యేక తెలంగాణ అంశంపై ఒంటరిగానే ఉద్యమించాలని భారతీయ జనతా పార్టీ తీర్మానించింది. తెలంగాణపై ఉద్యమించడానికి మార్చి నెలను ముహూర్తంగా నిర్ణయించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మద్దతివ్వాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరాలని కూడా తీర్మానించారు. రాష్ట్ర శాఖ వైఖరికి ఆమోదముద్ర వేయాల్సిందిగా పార్టీ జాతీయ నూతన అధ్యక్షుడికి సీనియర్ నేతలతో కూడిన ఓ కమిటీ ద్వారా సందేశాన్ని పంపుతారు.
  • రాష్ట్ర గవర్నరు రాజీనామా: రాష్ట్ర గవర్నరు సుషీల్ కుమార్ షిండే రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌గా రామేశ్వర్ ఠాకూర్ ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశాడు.


2006 జనవరి 4వ వారం
2006 జనవరి 3వ వారం
2006 జనవరి 2వ వారం
2006 జనవరి 1వ వారం

"https://te.wikipedia.org/w/index.php?title=జనవరి_2006&oldid=3271991" నుండి వెలికితీశారు