జనవరి 7 2006, శనివారం మార్చు

  • పోలవరం కడితే తమ పట్టు పోతుందని భయపడుతున్నామని ముఖ్యమంత్రి అనడాన్ని సి.పి.ఎం. నేత బి.వి.రాఘవులు తప్పుబట్టాడు.
  • తెరాస అసంతృప్త ఎమ్మెల్యేల తీరు మారాలి:ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలను తెరాస హెచ్చరించింది. అన్నింటికీ సమాధానమిస్తానని అధినేత కేసీఆర్‌ చెప్పినా... ప్రజా ఉద్యమం చేయొద్దంటూ మీడియా ముందుకు వెళ్ళటంతో వారి అసలు రంగు బయటపడిందని తెరాస స్పష్టం చేసింది.
  • ప్రవాసీ భారతీయ దివస్:హైదరాబాదులో ప్రవాసీ భారతీయ దివస్ ను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించాడు. ఎలాంటి చర్యలు తీసుకొంటే వెనకబడిన తెలంగాణ ప్రగతి సాధిస్తుందో ఆర్థిక వేత్తలు లోతుగా అధ్యయనం చేయాలని ఆయన పిలుపునిచ్చాడు.
  • వై.ఎస్ పై నరేంద్ర మోడీ విమర్శ: ఆంధ్రప్రదేశ్‌ ఐఎస్‌ఐకి అడ్డాగా మారుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న పాక్‌ ప్రేరిత ఐఎస్‌ఐ కార్యకలాపాలను నియంత్రించాల్సిన వైఎస్‌ సర్కారు దీర్ఘనిద్రలో ఉంది. దీనివల్ల దేశానికి కలగబోయే అనర్థాలకు సర్కారే బాధ్యతవహించాల్సి ఉంటుంది అని గుజరాత్ ముఖ్యమంత్రి హెచ్చరించాడు.
  • "వ్యక్తిగా, ముఠానేతగా నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేకపోవచ్చు. కానీ ఓ రాష్ట్ర సీఎంగా, ప్రభుత్వాధినేతగానైనా ప్రజాస్వామ్య విలువల ప్రకారం నడుచుకో! నువ్వు కూర్చున్న కుర్చీని కించపరచవద్దు" అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి తెదేపా హితవు పలికింది.

జనవరి 6 2006, శుక్రవారం మార్చు

  • పత్యేక తెలంగాణా డిమాండుపై కాంగ్రెస్ వైఖరేంటో హైదరాబాద్‌లో జరిగే పార్టీ ప్లీనరీలో ఏఐసీసీ రాజకీయ తీర్మానం స్పష్టంచేస్తుందని రక్షణమంత్రి, పార్టీ సీనియర్‌నేత ప్రణబ్‌ముఖర్జీ సూచనప్రాయంగా చెప్పాడు.
  • సాగునీటి ప్రాజెక్టులలో 1000 కోట్ల ముడుపులు చేతులు మారాయని రాఘవులు ఆరోపణ, దానిపై ఈనాడు ప్రచురించిన కార్టూనులపై ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించాడు. ఎద్దు ఇనిందని రాఘవులంటే, గాట కాట్టమని ఈనాడు అన్నదంటూ పోల్చాడు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతిని చదవడం లేదని కూడా ఆయన అన్నాడు. పోలవరం కడితే సి.పి.ఎం.కు ఖమ్మం జిల్లాలో పట్టు పోతుందని భయం అని విమర్శించాడు.
  • పోలవరం ప్రాజెక్టు విషయమై జరిగిన అఖిలపక్ష సమావేశం ఏ నిర్ణయమూ తీసుకోకుండా ముగిసింది. తిరిగి జనవరి 13 న సమావేశమవ్వాలని నిర్ణయం తీసుకుంది.

జనవరి 5 2006, గురువారం మార్చు

  • గ్రామీణ న్యాయవ్యవస్థను పటిష్టం చెయ్యాలని రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నాడు.
  • సాగునీటి ప్రాజెక్టులలో 1000 కోట్ల ముడుపులు చేతులు మారాయని రాఘవులు ఆరోపణపై స్పందిస్తూ రాఘవులు చెప్తే, నిజమే అయిఉండవచ్చు అని సి.పి.ఎం. జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నాడు.

జనవరి 4 2006, బుధవారం మార్చు

  • ముస్లిములకు 5% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన అప్పీలుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. కేసు విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.
  • తెలంగాణ రాష్ట్ర సాధనలో జరుగుతున్న జాప్యాన్ని ఇక చూస్తూ కూర్చునే ఓపిక తమకు లేదని కేంద్ర మంత్రి, [[తెరాస]] అధినేత కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశాడు. ఎనిమిది వారాల్లో ఇస్తామన్న ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఏడాదైన వెలుగు చూడకపోవడమేమిటని అసంతృప్తి వ్యక్తం చేశాడు. పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణ సాధన దిశగా యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను ఏకకాలంలో చేపట్టనున్నట్లు చెప్పాడు.
  • సాగునీటి ప్రాజెక్టులలో 1000 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని సి.పి.ఎం. నేత బి.వి.రాఘవులు చేసిన ఆరోపణను ముఖ్యమంత్రి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కె.కేశవరావు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి విమర్శలు చేసేందుకు ఆయన ఒక పత్రిక పెట్టుకుంటే మంచిది అని కేశవరావు అన్నాడు.

జనవరి 3 2006, మంగళవారం మార్చు

  • నల్గొండలో పాకిస్తాను ప్రేరేపిత ఉగ్ర్రవాది: బెంగుళూరు ఐండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌పై దాడి కేసులో పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ లింకు బయటపడింది. దాడికి వ్యూహం పన్నినట్లు భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్‌ రెహ్మాన్‌(35)ను ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండలో పట్టుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో బెంగుళూరు పోలీసులు శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఈనాడు[permanent dead link]
  • ఔటర్ రింగురోడ్డుకు ప్రధాని శంకుస్థాపన: హైదరాబాదు ఔటరు రింగురోడ్డుకు భారత ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసాడు.
  • సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుంచి పాలకులు వెయ్యి కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని బి.వి.రాఘవులు మహబూబ్‌ నగర్లో ఆరోపించారు.

జనవరి 2 2006, సోమవారం మార్చు

 
జనవరి 1న రబ్బరు డ్యాం ప్రారంభం
  • భీభత్సానికి తీవ్రవాదుల కుట్ర: మూడు అత్యంత ప్రమాదకరమైన బాంబులు. పాకిస్థాన్‌ గూఢచారసంస్థ ఐఎస్‌ఐ పన్నిన కుట్ర మేరకు 8 నెలల కిందటే ముగ్గురు యువకుల ద్వారా హైదరాబాద్‌ చేరాయి. వాటిని ఇక్కడే దాచిపెట్టిన ఆ యువకులు... హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేయటానికి పథకం వేశారు. బాంబుల్ని పేల్చటానికి... వాటికన్నా ప్రమాదకరమైన మానవ బాంబుల కోసం వెదికారు. ఇంతలో హైదరాబాద్‌ వాసుల అదృష్టం బాగుండి... వారి కుట్ర భగ్నమైంది. ఈనాడు[permanent dead link]
  • ఆచార్య నాగార్జునుడు రెండో బుద్ధుడు:బుద్ధుడు ప్రబోధించిన కాలం నాటి కంటే ఈ రోజే ఎక్కువ అవసరమని బౌద్ధమత గురువు దలైలామా పేర్కొన్నారు. అమరావతిలో కాలచక్ర ఉత్సవాల నిర్వహణకు రాష్ట్రానికి వచ్చిన దలైలామా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హిందూయిజం, బౌద్ధం కవలల వంటివన్నారు. ఆచార్య నాగార్జునుని రెండో బుద్ధునిగా దలైలామా అభివర్ణించారు. ఆచార్యుని బోధలు చదివే ఆధ్యాత్మికంగా తన మనోనేత్రం తెరుచుకుందన్నారు. ఆ మహనీయుడు తిరుగాడిన ప్రాంతంలో కాలచక్ర ప్రవచనాలకు తాను పునఃప్రారంభం చేయడం జీవితంలో ఎంతో సంతోషాన్నిస్తోందని చెప్పారు. ఈనాడు[permanent dead link]
  • నీలోఫర్ ఆసుపత్రిలో విద్యుత్తు షాకుకు గురై పసికందు మరణం: 20 రోజుల వయసున్న ఆడశిశువు నెలలు నిండక ముందే పుట్టడంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. మరింత మెరుగైన సేవల కొరకు హైదరాబాదు లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి అధ్వాన్నమైన సేవలు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వేలాడే విద్యుత్ వైర్ల వలన షాకుకు గురై ఆ పసికందు మరణించింది.

జనవరి 1 2006, ఆదివారం మార్చు