జామ్తాడా

ఝార్ఖండ్‌లో ఒక నగరం
(జమ్తాడా నుండి దారిమార్పు చెందింది)

జామ్తాడా ఝార్ఖండ్ రాష్ట్రం జామ్తాడా జిల్లాలోని జామ్తాడా సదర్ ఉపవిభాగంలోని నగరం. ఇదొక నోటిఫైడ్ ప్రాంతం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.

జామ్తాడా
పట్టణం
క్లాక్ టవర్ చౌక్‌లో వీర్‌ కువర్ విగ్రహం
క్లాక్ టవర్ చౌక్‌లో వీర్‌ కువర్ విగ్రహం
జామ్తాడా is located in Jharkhand
జామ్తాడా
జామ్తాడా
ఝార్ఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 23°57′48″N 86°48′05″E / 23.9633°N 86.8014°E / 23.9633; 86.8014
Country India
రాష్ట్రంఝార్ఖండ్
జిల్లాజామ్తాడా
విస్తీర్ణం
 • Total1,802 కి.మీ2 (696 చ. మై)
Elevation
155 మీ (509 అ.)
జనాభా
 (2011)
 • Total90,426
 • జనసాంద్రత439/కి.మీ2 (1,140/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
PIN
815351
Telephone code06433
Vehicle registrationJH-21
లింగనిష్పత్తి959 /

భౌగోళికం

మార్చు

జమ్తాడా 23°57′N 86°48′E / 23.95°N 86.8°E / 23.95; 86.8 వద్ద,[1] సముద్రమట్టం నుండి సగటున 155 మీటర్ల ఎత్తున ఉంది.

ఇది రాష్ట్ర రాజధాని రాంచీ నుండి 250 కి.మీ. దూరంలో ఉంది. బొగ్గు రాజధాని' ధన్‌బాద్ నుండి దీని దూరం 54 కి.మీ. కోల్‌కతా నుండి దూరం 260 కి.మీ., పాట్నా నుండి 290 కి.మీ.

జనాభా

మార్చు

2011 జనగణన ప్రకారం,[2] జామ్తాడా జనాభా 29,415. ఇందులో 89% మంది ముస్లిములు. పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. జామ్తాడా సగటు అక్షరాస్యత 63.73%. ఇది జాతీయ సగటు 74.4%కంటే తక్కువ: పురుషుల అక్షరాస్యత 76.85%, స్త్రీల అక్షరాస్యత 50.08%. జామ్తాడా జనాభాలో 13% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు

సైబర్ నేరాల ప్రత్యేకత

మార్చు

జామ్తాడాను భారతదేశపు ఫిషింగ్ (phishing) నేరాలకు రాజధాని అని అంటారు.[నోట్స్ 1] ఈ చిన్న పట్టణం కేంద్రంగా దేశవ్యాప్తంగా అనేక ఫిషింగ్ సంఘటనలు జరగడంతో దీనికి ఈ పేరు వచ్చింది.[3] 2015 ఏప్రిల్, 2017 మార్చి మధ్య రెండు సంవత్సరాల వ్యవధిలో, 12 భారతీయ రాష్ట్రాలకు చెందిన పోలీసులు తమతమ 5 రాష్ట్రాల్లో జరిగిన సైబర్ నేరాలను పరిశోధించడానికి జామ్తాడాకు 23 సార్లు ప్రయాణాలు చేసినట్లు సమాచారం. కొన్ని అంచనాల ప్రకారం ఫిషింగు నేరాల్లో 80 శాతానికి బాధ్యత ఈ పట్టణమే వహిస్తుంది.[4] ఈ నేరాల్లో ప్రమేయం ఉన్నవారు విలాసవంతమైన SUV లను కొనుగోలు చేసారు. గుడిసెల పక్కన పెద్దపెద్ద బంగళాలను నిర్మించుకున్నారు.

శీతోష్ణస్థితి

మార్చు
  • వేసవి కాలం - మార్చి నుండి మే వరకు
  • వర్షాకాలం - జూన్ నుండి సెప్టెంబర్ వరకు
  • శీతాకాలం - అక్టోబర్ నుండి ఫిబ్రవరి
  • శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత - 2 °C
  • వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత - 45 °C
  • సముద్ర మట్టం నుండి ఎత్తు - 175 మీ. (574 అ.)
  • గాలి దిశ - నైరుతి నుండి ఈశాన్యం వైపుకు

నోట్స్

మార్చు
  1. అంతర్జాలంలో ఈమెయిలు, సంకేతపదాలు, క్రెడిట్ కార్డు సమాచారం వంటి వ్యక్తిగత సమాచారాన్ని మోసపూరితంగా దొంగిలించడాన్ని ఫిషింగ్ (phishing) అంటారు.

మూలాలు

మార్చు

 

  1. "Maps, Weather, and Airports for Jamtara, India". www.fallingrain.com.
  2. http://censusindia.gov.in/2011-prov-results/data_files/jharkhand/Jharkhand%20Provisional%20Result%20Data%20sheet%20for%20release.pdf
  3. Singh, Shiv Sahay (12 August 2017). "The cyber con 'artists' of Jharkhand's Jamtara district" – via www.thehindu.com.
  4. "ED raids 5 locations in Jharkhand in first cyber conning PMLA case" – via The Economic Times.
"https://te.wikipedia.org/w/index.php?title=జామ్తాడా&oldid=3657559" నుండి వెలికితీశారు