జమ్మికుంట పురపాలకసంఘం

జమ్మికుంట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] జమ్మికుంట పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

జమ్మికుంట పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
జమ్మికుంట పురపాలకసంఘం is located in తెలంగాణ
జమ్మికుంట పురపాలకసంఘం
జమ్మికుంట పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°15′22″N 79°29′34″E / 18.2561189°N 79.4928857°E / 18.2561189; 79.4928857
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండలం జమ్మికుంట
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ తక్కలపల్లి రాజేశ్వర్ రావు
 - వైస్ చైర్‌పర్సన్‌ దేశిని స్వప్న
వైశాల్యము
 - మొత్తం 30.97 km² (12 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 28,073
 - పురుషుల సంఖ్య 14,553
 - స్త్రీల సంఖ్య 13,520
 - గృహాల సంఖ్య 8,464
పిన్ కోడ్ - 505122
Area code(s) టెలిఫోన్ కోడ్ -08727
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న జమ్మికుంట 2011 పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం

మార్చు

జమ్మికుంట 30.97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°17′20″N 79°28′23″E / 18.289°N 79.473°E / 18.289; 79.473 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 183 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం కరీంనగర్ నుండి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 28073 మంది కాగా, అందులో 14553 మంది పురుషులు, 13520 మంది మహిళలు ఉన్నారు. 8464 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 18 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన

మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం తక్కలపల్లి రాజేశ్వర్ రావు చైర్‌పర్సన్‌గా, దేశిని స్వప్న వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

మార్చు
  1. బొంగోని వీరన్న
  2. మారపల్లి బుచయ్య
  3. మేడిపల్లి రవీందర్
  4. ఎలగందుల స్వరూప
  5. పిట్టల శ్వేత
  6. శ్రీపతి నరేష్
  7. పొనగంటి సారంగం
  8. పొనగంటి శ్రీలత
  9. పొనగంటి రాము
  10. పొనగంటి విజయలక్ష్మి
  11. బిట్ల కళావతి
  12. మోలుగు ప్రణిత
  13. దయ్యాల శ్రీనివాస్
  14. బోగం సుగుణ
  15. పతకాల రమేష్
  16. పుతాది రాజయ్య
  17. జేగురు సదానందం
  18. బోడుల అరుణ
  19. దేశిని స్వప్న (వైస్ చైర్‌పర్సన్‌)
  20. దేశిని రాధ
  21. తక్కలపల్లి రాజేశ్వర్ రావు (చైర్‌పర్సన్‌)
  22. గుల్లి పులమ్మ
  23. పొనుగంటి మల్లయ్య
  24. సాయిని రమ
  25. బచ్చు మాధవి
  26. దిడ్డి రాంమోహన్
  27. గాజుల భాస్కర్
  28. కల్వల దీప్తి
  29. రావికంటి రాజ్ కుమార్
  30. మద్ది లావణ్య

మూలాలు

మార్చు
  1. "Jammikunta Municipality". jammikuntamunicipality.telangana.gov.in. Retrieved 12 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 12 May 2021.
  3. "Basic Information of Municipality, Jammikunta Municipality". jammikuntamunicipality.telangana.gov.in. Retrieved 12 May 2021.
  4. The Hindu, Telangana (27 January 2020). "All top posts of municipalities in Karimnagar go to TRS". Archived from the original on 28 January 2020. Retrieved 12 May 2021.
  5. admin (2020-02-05). "Jammikunta Municipal Councillors List - 2020". Telangana data. Retrieved 12 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు

మార్చు