హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం
కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ స్థానాలలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

నియోజకవర్గంలోని మండలాలు సవరించు
- వీణవంక
- జమ్మికుంట
- హుజురాబాద్
- కమలాపూర్
- ఇల్లందుకుంట
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు సవరించు
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2021 | ఉప ఎన్నికలు | హుజురాబాద్ | జనరల్ | ఈటెల రాజేందర్ | పు | బీజేపీ | 101974 | గెల్లు శ్రీనివాస్ యాదవ్ | పు | టీఆర్ఎస్ | 79452 |
2018 | 31 | హుజురాబాద్ | జనరల్ | ఈటెల రాజేందర్ | Male | టీఆర్ఎస్ | 110000 | పాడి కౌశిక్ రెడ్డి | Male | కాంగ్రెస్ పార్టీ | 61730 |
2014 | 31 | హుజూరాబాద్ | జనరల్ | ఈటెల రాజేందర్ | Male | టీఆర్ఎస్ | 95315 | కేతిరి సుదర్శన్ రెడ్డి | Male | కాంగ్రెస్ పార్టీ | 38278 |
2010 | ఉప ఎన్నికలు | హుజూరాబాద్ | జనరల్ | ఈటెల రాజేందర్ | M | టీఆర్ఎస్ | 93026 | ముద్దసాని దామోదర రెడ్డి | M | టీడీపీ | 13799 |
2009 | 31 | హుజూరాబాద్ | జనరల్ | ఈటెల రాజేందర్ | M | టీఆర్ఎస్ | 56752 | వకుళాభరణం కృష్ణమోహన్ రావు | కాంగ్రెస్ పార్టీ | 41717 | |
2008 | ఉప ఎన్నికలు | హుజూరాబాద్ | జనరల్ | ఈటెల రాజేందర్ | M | టీఆర్ఎస్ | 53547 | కేతిరి సుదర్శన్ రెడ్డి | M | కాంగ్రెస్ పార్టీ | 32727 |
2004 | 251 | హుజూరాబాద్ | జనరల్ | ఈటెల రాజేందర్ | M | టీఆర్ఎస్ | 81121 | ఇనుగాల పెద్దిరెడ్డి | M | టీడీపీ | 36451 |
1999 | 251 | హుజూరాబాద్ | జనరల్ | ఇనుగాల పెద్దిరెడ్డి | M | టీడీపీ | 45200 | కేతిరి సాయిరెడ్డి | M | కాంగ్రెస్ పార్టీ | 38770 |
1994 | 251 | హుజూరాబాద్ | జనరల్ | ఇనుగాల పెద్దిరెడ్డి | M | TDP | 57727 | Laxmikantha Rao Bopparaju | M | కాంగ్రెస్ పార్టీ | 38436 |
1989 | 251 | హుజూరాబాద్ | జనరల్ | కేతిరి సాయిరెడ్డి | M | IND | 32953 | Venkat Rao Duggirala | M | టీడీపీ | 29251 |
1985 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Duggirala Venkatarao | M | టీడీపీ | 54768 | J. Bhaskerreddy | M | కాంగ్రెస్ పార్టీ | 17876 |
1983 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Kotha Raji Reddy | M | IND | 24785 | Duggirala Venkat Rao | M | IND | 20602 |
1978 | 251 | హుజూరాబాద్ | జనరల్ | Duggirala Venkat Rao | M | కాంగ్రెస్ పార్టీ | 35561 | Algrieddy Kasi Viswanath Reddy | M | JNP | 21822 |
1972 | 246 | హుజూరాబాద్ | జనరల్ | Vodithela Rajeswar Rao | M | కాంగ్రెస్ పార్టీ | 29686 | A K Viswanadha Reddy | M | IND | 22153 |
1967 | 246 | హుజూరాబాద్ | జనరల్ | N. R. Polsani | M | కాంగ్రెస్ పార్టీ | 23470 | R. R. Kotha | M | IND | 18197 |
1962 | 266 | హుజూరాబాద్ | (SC) | Gadipalli Ramulu | M | కాంగ్రెస్ పార్టీ | 22162 | Naini Devayya | M | CPI | 8057 |
1957 | 59 | హుజూరాబాద్ | (SC) | P. Narsing Rao | M | IND | 24296 | G. Ramulu (Sc) | M | IND | 19373 |
2004 ఎన్నికలు సవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీకి చెందిన కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెద్దిరెడ్డి పై 44669 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మీకాంతరావుకు 81121 ఓట్లు రాగా, పెద్దిరెడ్డి 36451 ఓట్లు పొందినాడు.కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ కి చెందిన ఇనుగాల భీమారావు 5281 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు సవరించు
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణమోహన్, భారతీయ జనతా పార్టీ నుండి కె.రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఈటెల రాజేందర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున పి.వెంకటేశ్వర్లు, సమతా పార్టీ అభ్యర్థిగా ఇ.భీమారావు, లోక్‌సత్తా పార్టీ నుండి కె.శ్యాంసుందర్ పోటీచేశారు.[2]
2021 ఉప ఎన్నికలు; సవరించు
2018లో తెరాస పార్టీ తరపున విజయం సాధించిన ఈటెల రాజేందర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి అక్టోబరు 2021లో ఉప ఎన్నిక నిర్వహించబడింది. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.[3] బీజేపి తరఫున ఈటెల రాజేందర్, తెరాస తరఫున గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ తరఫున బల్మూరి వెంకట్ పోటీ చేయగా ఈటెల రాజేందర్ గెలుపొందాడు.
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ ఈనాడు దినపత్రిక తేది అక్టోబరు 14, 2021