జమ్ములపాలెం (టంగుటూరు)
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
జమ్ములపాలెం, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
జమ్ములపాలెం (టంగుటూరు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°20′56.184″N 80°1′2.748″E / 15.34894000°N 80.01743000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | టంగుటూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్కోడ్ | 523274 |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ గురుమాత పంచముఖేశ్వరస్వామివారి ఆలయం
మార్చుకార్తీకమాసంలో ఒక్క రోజైనా శివునికి అభిషేకం చేస్తే సకల పాపాలు హరిస్తాయని శాస్త్రాలు చెప్పుచున్నాయి. అయితే 1,116 శివలింగాలకు అభిషేకం చేసే భాగ్యం వస్తే ఆ భక్తుల జన్మ ధన్యమైనట్లే.. ఈ మహాక్రతువు ఈ ఆలయంలో నిత్యం జరుగుచున్నది.
ఈ గ్రామములో 1999 జనవరి 24న పాదర్తి వెంకటశేషుమాంబ, పేరిశెట్టిన్ రెలిజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దాతల సహకారంతో, 1,116 శివలింగాలను ప్రతిష్ఠించారు. ప్రతి శివలింగానికీ, పంచలోహ నాగాభరణం అలంకరించారు. శివలింగాల మధ్యలో 108 శక్తిపీఠాలను ఏర్పాటుచేసి, మధ్య భాగంలో పంచముఖేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఒక్కసారి ఓం నమశ్శివాయ అనే పంచాక్ష్రీ మంత్రాన్ని జపించినయెడల, 1,116 సార్లు జపించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
కార్తీకమాసంలో ప్రతి సోమవారం, శివరాత్రి, ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజులలో స్వామివారికి పంచామృతాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించెదరు. ఆ సమయంలో భక్తులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం పొందెదరు. అంతేగాకుండా కార్తీకమాసంలో ఈ ఆలయంలో, మహిళలు విశేషంగా దీపారాధన నిర్వహించెదరు. ప్రతి మాస శివరాత్రినాడు, రాత్రికి ఏకాదశ రుద్రాభిషేకం, రజత బిల్వాలతో అష్టోత్తర శతనామావావళి నిర్వహించెదరు.
ఈ ఆలయానికి ప్రతి నిత్యం జిల్లా నలుమూలలనుండి భక్తులు విశేషంగా తరలి వచ్చి, ఆలయంలో కొలువుదీరిన పంచముఖేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి నిత్యం ఈ ఆలయం ఓం నమశ్శివాయ, హరహర మహాదేవ, శంభోశంకర నినాదాలతో మార్మోగుతుంటుంది.
గ్రామ ప్రముఖులు
మార్చుఈ గ్రామం కొండెపి శాసనసభ్యులు గుర్రాల వెంకటశేషు స్వగ్రామం. 2002లో మండల కార్యాలయం సమీపంలో 250 మంది గ్రామస్తులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకుని అక్కడే ఉంటున్నా, ఇంతవరకు వీధిదీపాలు, రహదారులు ఏర్పాటుచేయలేదు.