జయంతిలాల్ ఛోటాలాల్ షా

భారతదేశ సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తి.

జయంతిలాల్ ఛోటాలాల్ షా (1906, జనవరి 22 - 1991, జనవరి 4) భారతదేశ సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తి. 1970 డిసెంబరు 17 నుండి 1971 జనవరి 21న పదవీ విరమణ చేసేవరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.

జయంతిలాల్ ఛోటాలాల్ షా
12వ భారత ప్రధాన న్యాయమూర్తి
In office
1970 డిసెంబరు 17 – 1971 జనవరి 21
Appointed byవి. వి. గిరి
అంతకు ముందు వారుమహమ్మద్ హిదయతుల్లా
తరువాత వారుసర్వ్ మిత్ర సిక్రి
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అంతకు ముందు వారుప్రకాష్ చంద్ర తాటియా
డి.ఎన్. పటేల్
వ్యక్తిగత వివరాలు
జననం(1906-01-22)1906 జనవరి 22
అహ్మదాబాద్‌, గుజరాత్
మరణం1991 జనవరి 4(1991-01-04) (వయసు 84)
ముంబై, మహారాష్ట్ర

జననం మార్చు

జయంతిలాల్ ఛోటాలాల్ షా 1906 జనవరి 22న గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌లో జన్మించాడు.[1] షా అహ్మదాబాద్‌లోని ఆర్.సి. స్కూల్‌లో పాఠశాల విద్యను,బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు.[2]

న్యాయవాద వృత్తి మార్చు

1929లో అహ్మదాబాద్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు.[3] గాంధీ హత్య కేసులో నాథూరామ్ గాడ్సే, ఇతర ప్రతివాదులను విచారించే న్యాయ బృందంలో సభ్యుడిగా ఉన్నాడు.[3] 1949లో బాంబే హైకోర్టుకు వెళ్ళి అక్కడ 10 సంవత్సరాలపాటు న్యాయమూర్తిగా పనిచేశాడు.[1] 1959 అక్టోబరులో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 1970 డిసెంబరులో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు.

1977 మే 28న హోం మంత్రిత్వ శాఖ జస్టిస్ షాను నియమించింది. అప్పటికే అతడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. దాంతో అతడు షా కమిషన్‌కు నాయకత్వం వహించాడు. భారతదేశంలో ఎమర్జెన్సీ సమయంలో జరిగిన చర్యలపై విచారణ జరిపేందుకు 1952 కమీషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది.[4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Sethi, Sunil. "High priest of justice". India Today. Retrieved 2022-10-26.
  2. "Jayantilal Chhotalal Shah". Supreme Court of India. Retrieved 2022-10-26.
  3. 3.0 3.1 "Former CJ J.C. Shah dead". The Indian Express. Press Trust of India. 5 January 1991. p. 1. Retrieved 2022-10-26.
  4. Sen, Vikramajil; Singh, Ajay. "The law: What after Shah Commission?". India Today. Retrieved 2022-10-26.

బయటి లింకులు మార్చు