తెలంగాణ తల్లి

(జయజయహే తెలంగాణ నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ తల్లి చిత్రపటం

తెలంగాణ తల్లి అనగా తెలంగాణ అమ్మ. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రాంతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఈ తెలంగాణ తల్లి భావన మలిదశ ఉద్యమ వ్యాప్తిలో ఎంతో దోహదపడింది.

తెలంగాణ తల్లి రూపంసవరించు

ఈమె సాధారణంగా మహిళ వలె కుంకుమ రంగు చీరను ధరించి ఒక చేతితో కాడతో సహా ఉన్న కంకులను, మరొక చేతితో బతుకమ్మను పట్టుకొని ఉంటుంది.

తెలంగాణ తల్లి రూప నేపథ్యంసవరించు

తెలంగాణ తల్లి భావన పూర్వం నుంచి ఉన్నదే అయినా, దాన్ని ఉద్యమ ప్రతీకగా ముందుకు తేవాలన్న ఆలోచన మాత్రం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసారథి కేసీఆర్‌దే. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, తత్వవేత్త బీఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. బి. ఎస్. రాములు ఆలోచనలు, సూచనల ప్రకారం.. కంప్యూటర్‌పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బి. వి. ఆర్. చారి. సాధారణ స్త్రీ మాదిరిగా(తలపై కీరీటం ఆభరణాలు లేకుండా) కొంగు నడుముకు చుట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని బీయూఆర్ చారి చిత్రించారు. ఈ రూపం దేవులపల్లి అజయ్ సారథ్యంలో వెలువడుతున్న ప్రజాతంత్ర అనే తెలంగాణ వారపత్రిక కవర్ పేజీపై ప్రచురితమైంది.

తెలంగాణ తల్లికి తామిచ్చిన రూపాన్ని బీఎస్ రాములు ఉద్యమ సారథి కేసీఆర్ ముందు పెట్టగా.. ఆయన కొన్ని మార్పులు సూచించారు. ఈ విషయమై చర్చించడానికి తెలంగాణ భవన్‌లో రెండు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బీఎస్ రాములు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ గంగాధర్, గన్‌పార్క్‌లోని 1969 తెలంగాణ అమరవీరుల స్థూపం సృష్టికర్త ఎక్కా యాదగిరి రావు, తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, విశ్లేషకులు దుర్గం రవీందర్, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, ఈ తరం చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ మహిళలు, రచయితలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు పాల్లొన్నారు.

ఈ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి గుర్తుగా పేద స్త్రీ రూపంలో ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ ఎప్పటికీ ఇలాగే వెనుకబడి ఉండదు కదా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగా, దేశంలోనే సంపన్న రాష్ట్రంగా, బంగారు తెలంగాణగా మారుతుంది. రాజా రవివర్మ గీసిన దేవతల బొమ్మల స్ఫూర్తితో భారత మాత చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రాన్ని తలపించేలా తెలంగాణ తల్లికి రూపమివ్వాలి అని కేసీఆర్ సూచించారు. కెసిఆర్ సూచనతోపాటు సమావేశాల్లో పాల్గొన్న మరికొందరు ఇచ్చిన సూచనలకు తగినట్లుగా ప్రొఫెసర్ గంగాధర్ ఇప్పటి తెలంగాణ తల్లికి రూపాన్నిచ్చారు. తెలంగాణ లోని నాటి పది జిల్లాలకు చెందిన ప్రత్యేకతలను తెలంగాణతల్లి రూపకల్పనలో జోడిస్తూ తీర్మానించడం, జరిగింది .వాటిని సమన్వయిస్తూ బి ఎస్ రాములు డిజైనింగ్ రూపాన్ని సూచించారు. అలా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ,గద్వాల, పోచంపల్లి

చీర, కరీంనగర్ వెండి మట్టెలు,కోహినూర వజ్రం, జాకబ్ వజ్రం,పాలమూరు,మెదక్మె, అదిలాబాద్ మెట్ట  పంటలకు చిహ్నంగా మక్కకంకులు,నిజామాబాద్ వరంగల్, కరీంనగర్,జిల్లాల సంస్కృతికి చిహ్నంగా బంగారు నగలు, భరతమాతముద్దు బిడ్డగా , రాజమాతగా అందమైన కిరీటం, ఆ కిరీటంలో ప్రసిద్ద కొహినూర్ వజ్రం,వడ్డాణం,జరీ అంచుచీర నిండైన కేశ సంపద తదితరాలతో తుదినెరుగులు తీర్చిదిద్దడం జరిగింది. ఇలా తెలంగాణ తల్లి రూపకల్పనలో ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశేషాలు సంశ్లేషించబడ్డాయి. వీటన్నిటి వెనక బిఎస్ రాములు గారి పదినెలల విశేష కృషి ఉంది.బిఎస్ రాములు గారు తెలంగాణ రాష్ర సాధనకు థింక్ ట్యాంకు గా, అందరికి అందుబాటులో ఉండాలని ఉస్మానియా విశ్వ విద్యాలయం సమీపంలో విశాల సాహిత్య అకాడమీ, సామాజిక తాత్విక విశ్వ విద్యాలయం కార్యాలయం 2003 నుండి నెలకొల్పడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాక ప్రతినెల ఒక పుస్తకం వెలువరిస్తానని ప్రకటించడం, తెలుగుతల్లి మా తల్లి కాదని మా తల్లి తెలంగాణ తల్లి అని అస్తిత్వ ఉద్యమం, భావజాలంతో పుస్తకాలు వెలువరించడం జరిగింది. అలా “తెలంగాణ తల్లి ఎరుక” అనే పుస్తకం, ప్రచురించడమ,దాన్ని గూడ అంజయ్య యక్షగానంగా మలచడం జరిగింది.

ఇలామలి తెలంగాణ ఉద్యమంలో సమస్త అంశాల పునరుత్తేజం,, పునర్వికాసంలో భాగంగా బి ఎస్ రాములు నేతృత్వంలో కెసిఆర్ సలహాలు , చొరవ సహకారంతో తెలంగాణ తల్లి క్యాలెండర్ బిఎస్ రాములు చేత ముద్రించబడింది.బి ఎస్ రాములు ప్రముఖ సామాజిక తత్వవేత్త, సుప్రసిద్ధ రచయిత, అనేక సాహిత్య,సామాజిక ఉద్యమాల నిర్మాత. వివిధ ప్రక్రియలలో 98 గ్రంథాలు ప్రచరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బి సి కమిషన్ ఛైర్మన్ గా పని చేస్తున్నారు.

తెలంగాణ తల్లి రూపాన్ని తొలిసారి క్యాలెండర్ రంగుల్లో ముంద్రించి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. ఆ తరువాత బి ఎస్ రాములుగారికి, ఆర్టిస్టు గంగాధర్ గారికి నిజాంకాలేజీ లో జరిగిన తెలంగాణ సంబురాలు పేరిట జరిగిన తెలంగాణ ఫుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ లో కెసిఆర్ గారు బంగారు కంకణం తొడిగారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లికి చక్కని రూపాన్నిచ్చిన ప్రొ గంగాధర్, బీఎస్ రాములు పేర్లు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయన్నారు. 

పసునూరి దయాకర్ చేతుల మీదుగా తయారైన తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని 2007, నవంబర్ 15న టీఆర్‌ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో పలువురు ప్రముఖులు, నాయకుల ఆధ్వర్యంలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఇలాంటి విగ్రహాలనే అన్ని నియోజకవర్గాల్లో ఆవిష్కరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. అలా నేడు ఊరూర తెలంగాణ తల్లి విగ్రహాలు, ఇంటింటాతెలంగాణతల్లి చిత్రపటాలు, మెమెంటోల తో తెలంగాణ తల్లి స్ఫూర్తి నిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహాలను రూపొందిందన ఆర్టిస్టు పసునూరు దయాకర్ 2014 లో వరంగల్ నుండి భారీ మెజారితో పార్లమెంట్ సభ్యులుగ ఎన్నికయ్యారు. 2019 రెండవసారి కూడా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నకయ్యారు. ఇలా తెలంగాణ తల్లి తనదైన ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్నది.తెలంగాణ అమర వీరుల చిహ్నం రూపశిల్పి ఎక్కాయాదగిరి రావు గారి పద్మశ్రీ వరించింది. —బి.ఎస్.రాములు, సామాజిక తత్వవేత్త,

   తెలంగాణ తొలి బి సి కమిషన్ ఛైర్మన్

మూలాలుసవరించు

www.ntnews.com/telangana-news/information-about-telangana-talli-statue-1-1-531124.html

ఇతర లింకులుసవరించు


ఇవి కూడా చూడండిసవరించు