జరగనహళ్ళి సరస్సు

జరగనహళ్లి సరస్సు కర్ణాటకలోని బెంగుళూరు దక్షిణ భాగంలో ఉంది. దీనిని యెలచెనహల్లి సరస్సు అని కూడా పిలుస్తారు. ఇది జెపి నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో కనకపుర రోడ్డులో ఉంది. దీనికి జరగనహళ్లి, యలచనహళ్లి అనే గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.[1][2]

జరగనహళ్ళి సరస్సు
జరగనహళ్ళి సరస్సు is located in India
జరగనహళ్ళి సరస్సు
జరగనహళ్ళి సరస్సు
ప్రదేశంబెంగళూరు, కర్ణాటక
అక్షాంశ,రేఖాంశాలు12°54′5.7″N 77°34′22.4″E / 12.901583°N 77.572889°E / 12.901583; 77.572889
ఇందులో భాగంవృషభావతి నది
ప్రవహించే దేశాలుభారతదేశం
నిర్మాణం26 మే 1402 (1402-05-26)
ఉపరితల వైశాల్యం6.22 ఎకరం (2.52 హె.)
ప్రాంతాలుజరగనహళ్ళి, యలచనహళ్లి

విస్తీర్ణం

మార్చు

ఒకప్పుడు ఈ సరస్సు 6 ఎకరాలలో విస్తరించి ఉండేది. సరస్సులోని కొంత భాగం 1998 లో జరగనహల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠశాల ఆట స్థలంగా మార్చబడింది. ప్రస్తుతం సరస్సు 4 ఎకరాలలో మాత్రమే విస్తరించి ఉంది.[3]

భౌగోళికం

మార్చు

ఈ సరస్సు అన్నయ్య సరస్సు, సారక్కీ సరస్సు వంటి ఇతర సరస్సులకు దగ్గరగా ఉంది. ఈ స్థలానికి స్పష్టమైన సర్వే నంబర్ ఇవ్వబడలేదు. కానీ ఈ సరస్సు జరగనహళ్లి గ్రామంలోని సర్వే నంబర్ 29/2C లో ఉందనీ కొన్ని పత్రాలు, యెలచెనహళ్లి, ఉత్తరహళ్లి హోబ్లీ, బెంగళూరు దక్షిణ తాలూకాలోని సర్వే నంబర్ 23 లో ఉందని కొన్ని పత్రాలు పేర్కొన్నాయి.[4]

చరిత్ర

మార్చు

1904 నాటి సర్వే సరస్సుకు కనీసం 100 సంవత్సరాల చరిత్ర ఉందని స్పష్టంగా సూచిస్తుంది. 2008లోని గూగుల్ మ్యాప్ సరస్సు పాక్షిక ఉనికిని చూపుతుంది.[5]

సంరక్షణ

మార్చు

కర్ణాటక లోని సరస్సులను పరిరక్షించేందుకు గానూ అక్కడి ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులను రూపొందించింది.

సరస్సులు నాశనం కావడానికి ముఖ్య కారణం చెత్తాచెదారాన్ని సరస్సులో వేయడం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా 1999 లో, కృష్ణ భట్ (ప్రఖ్యాత సామాజిక కార్యకర్త) ద్వారా ఒక ప్రాజెక్టు ప్రారంభించబడింది. సరస్సుపై అలాంటి కార్యకలాపాలు ఆపాలని కోర్టు ఆదేశించింది.[6][7][8][9]

మూలాలు

మార్చు
  1. "BDA Revised Master Plan 2031 – Planning district 15" (PDF). Archived from the original (PDF) on 2020-02-15. Retrieved 2021-08-23.
  2. "Maintain the tank by de-weeding and desilting and cleaning, prevent any third person from encroaching the lake or felling of trees" (PDF). Archived from the original (PDF) on 2018-12-21. Retrieved 2021-08-23.
  3. "Strategies of Land Development: A Study of Two Areas of Bangalore City". The Expanding City Land Development and Urban Planning in Bangalore. 2011. hdl:10603/105676?mode=full.
  4. "Bengaluru: Jaraganahalli, Yelachenahalli lakes fall prey to encroachers".
  5. "Inventorisation of Water Bodies in Bengaluru Metropolitan Area (BMA)" (PDF).[permanent dead link]
  6. "Bangalore Lake turning into a dump yard".
  7. "Garbage dumped on presumed lakebed near Kanakapura Road". Archived from the original on 2018-11-19. Retrieved 2021-08-23.
  8. "ಹೋರಾಟದ ನಡುವೆಯೂ ಕೆರೆ ಮಾಯ". 7 January 2019.
  9. "Jarganahalli residents raise a stink over garbage dumping".